Holy Land గురించి బైబిల్ వచనాలు: A sabbath of rest appointed for
A sabbath of rest appointed for గురించి వచనాలు
“ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘నేను మీకు ఇవ్వబోయే దేశంలో మీరు ప్రవేశించినప్పుడు, స్వయాన ఆ భూమి కూడా యెహోవాకు సబ్బాతు పాటించాలి.
ఆరు సంవత్సరాలు పొలంలో విత్తనాలు చల్లాలి విత్తనాలు చల్లవచ్చు, ద్రాక్షతోటలు సాగుచేసుకుని వాటి ఫలాలు సమకూర్చుకోవచ్చు.
కానీ ఏడవ సంవత్సరం భూమికి సబ్బాతు విశ్రాంతి సంవత్సరం, అది యెహోవాకు సబ్బాతు. మీ పొలాల్లో విత్తనాలు వేయకూడదు. ద్రాక్షతోటలు సాగుచేయకూడదు.
దానికదిగా పెరిగే పంటను కోయవద్దు, సాగుచేయని మీ ద్రాక్షతోటల నుండి ద్రాక్షపండ్లను కోయవద్దు. భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి ఉండాలి.