కంటెంట్‌కు వెళ్లండి

Holy Land గురించి బైబిల్ వచనాలు: Extremely fruitful

6 వచనాలు · 37 కోణాలు

"Holy Land" కోసం వెతకండి

Extremely fruitful గురించి వచనాలు

  1. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మంచి దేశంలోకి తీసుకెళ్తారు; అది నదులు నీటిప్రవాహాలు లోయల నుండి కొండల నుండి ఉబికే లోతైన నీటి ఊటలు ఉండే దేశం;

  2. అంతేకాదు గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూర చెట్లు దానిమ్మపండ్లు ఒలీవనూనె తేనె దొరికే దేశం;

  3. ఆ దేశంలో రొట్టెలకు కొరత ఉండదు మీకు ఏది తక్కువకాదు; ఇనుప రాళ్లు గల దేశం, దాని కొండల్లో మీరు రాగి త్రవ్వితీయవచ్చు.

  4. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఈజిప్టు దేశం వంటిది కాదు; అక్కడ మీరు విత్తనాలు విత్తి కూరతోటలలో చేసినట్లు వాటికి కాళ్లతో నీరు పెట్టారు.

  5. మీరు యొర్దాను దాటి వెళ్లి స్వాధీనం చేసుకోబోయే దేశం ఆకాశపు వర్షాన్ని త్రాగే పర్వతాలు లోయలు ఉన్న దేశము.

  6. అది మీ దేవుడైన యెహోవా సంరక్షించే దేశము; సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దేవుడైన యెహోవా దృష్టి దాని మీద నిలిచి ఉంటుంది.