Skip to content

Salt Sea

9 verses · 3 known names

ఇలా కూడా పిలుస్తారు: salt, sea

31.5300, 35.4800 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Salt Sea ను ప్రస్తావించే వచనాలు

  1. ఈ రెండవ గుంపు రాజులందరూ సిద్దీము లోయలో (మృత సముద్ర లోయలో) కూడుకున్నారు.

  2. “ ‘మీ దక్షిణం వైపు ఎదోము సరిహద్దు ప్రక్కన సీను ఎడారిలో కొద్ది భాగం ఉంటుంది. మీ దక్షిణ సరిహద్దు మృత సముద్రం యొక్క దక్షిణ చివర తూర్పు దిక్కున ప్రారంభమై,

  3. తర్వాత ఆ సరిహద్దు యొర్దాను గుండా వెళ్తూ మృత సముద్రం వరకు వ్యాపిస్తుంది.

  4. దాని పశ్చిమ సరిహద్దు కిన్నెరెతు నుండి పిస్గా కొండచరియల తూర్పున, మృత సముద్రమనే అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబాలోని యొర్దాను నది.

  5. ఆ నీళ్లు ఆగిపోయి చాలా దూరంలో సారెతాను ప్రక్కన ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఎత్తైన రాశిలా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రమనే అరాబా సముద్రం అంటే మృత సముద్రంలోకి ప్రవహించే నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి. కాబట్టి ప్రజలు యెరికోకు ఎదురుగా నదిని దాటారు.

  6. అతడు తూర్పు అరాబాను కిన్నెరెతు సముద్రం నుండి అరాబా సముద్రం (అంటే మృత సముద్రం) వరకు, బేత్-యెషిమోతు వరకు, ఆపై పిస్గా కొండ క్రింద దక్షిణం వైపు వరకు పరిపాలించాడు.

  7. వారి దక్షిణ సరిహద్దు మృత సముద్రం యొక్క దక్షిణ చివరన ఉన్న అఖాతం నుండి ప్రారంభమైంది,

  8. దాని తూర్పు సరిహద్దు మృత సముద్రం వెంట యొర్దాను నది యొక్క ముఖద్వారం వరకు విస్తరించింది. ఉత్తర సరిహద్దు యొర్దాను ముఖద్వారం దగ్గర సముద్రం యొక్క అఖాతం నుండి ప్రారంభమై, బేత్-హొగ్లా వరకు వెళ్లి, బేత్-అరాబాకు ఉత్తరాన రూబేను కుమారుడైన బోహాను రాయి వరకు కొనసాగింది.

  9. అది బేత్-హొగ్లా ఉత్తర వాలుకు వెళ్లి దక్షిణాన యొర్దాను ముఖద్వారం దగ్గర మృత సముద్రపు ఉత్తర అఖాతం దగ్గరకు వచ్చింది. ఇది దక్షిణ సరిహద్దు.