Skip to content

Pisgah గురించి బైబిల్ వచనాలు

20 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. బామోతు నుండి మోయాబు లోయకు వెళ్లారు. అక్కడే పిస్గా పర్వతం ఉంది.

  2. బాలాకు బిలామును సోఫీము పొలములో ఉన్న పిస్గా శిఖరం మీదికి తీసుకెళ్లాడు. అక్కడ ఏడు బలిపీఠాలు కట్టి, ఒక్కో దాని మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించాడు.

  3. బిలాము బాలాకుతో, “నీవు ఇక్కడ నీ బలిపీఠం దగ్గర ఉండు, నేను అక్కడ దేవున్ని కలుస్తాను” అని అన్నాడు.

  4. యెహోవా బిలామును కలుసుకొని, అతని నోటిలో మాట ఉంచి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటను చెప్పు” అని అన్నారు.

  5. బిలాము తిరిగివెళ్లి రాజు, తన మోయాబు అధికారులతో దహనబలి దగ్గర నిలిచియుండడం చూశాడు. బాలాకు అతన్ని, “యెహోవా ఏమి చెప్పారు?” అని అడిగాడు.

  6. అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు: “బాలాకు! లేచి, విను; సిప్పోరు కుమారుడా! నా మాట విను.

  7. అబద్ధమాడడానికి దేవుడు మనుష్యుడు కాదు, మనస్సు మార్చుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన మాట్లాడి క్రియ చేయరా? ఆయన వాగ్దానం చేసి నెరవేర్చరా?

  8. ఆశీర్వదించమని నేను ఆజ్ఞ పొందుకున్నాను; ఆయన వారిని ఆశీర్వదించారు, దాన్ని నేను మార్చలేను.

  9. “యాకోబులో ఎటువంటి దోషం కనిపించలేదు, ఇశ్రాయేలులో ఏ చెడు కనిపించలేదు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు; రాజు యొక్క కేక వారి మధ్య ఉన్నది.

  10. దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చారు; వారికి అడవి ఎద్దుకు ఉన్న బలం ఉంది.

  11. యాకోబుకు వ్యతిరేకంగా ఏ భవిష్యవాణి లేదు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ శకునాలు లేవు. ఇప్పుడు యాకోబు గురించి, ఇశ్రాయేలు గురించి, ‘దేవుడు ఏమి చేశారో చూడండి!’

  12. ప్రజలు ఆడ సింహంలా లేస్తారు; వారు తమకు తాము సింహంలా లేస్తారు అది తన వేట మాంసాన్ని మ్రింగివేసే వరకు దాని బాధితుల రక్తం త్రాగే వరకు విశ్రాంతి తీసుకోదు” అని చెప్పబడుతుంది.

  13. దాని పశ్చిమ సరిహద్దు కిన్నెరెతు నుండి పిస్గా కొండచరియల తూర్పున, మృత సముద్రమనే అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబాలోని యొర్దాను నది.

  14. నీవు పిస్గా కొండ శిఖరం పైకెక్కి అక్కడినుండి పడమర, ఉత్తరం, దక్షిణం, తూర్పు వైపులకు చూడు. నీవు యొర్దాను నది దాటవు కాబట్టి నీ కళ్లారా ఆ దేశాన్ని చూడు.

  15. యొర్దాను తూర్పున ఉన్న అరాబా ప్రాంతమంతా, పిస్గా కొండచరియల దిగువగా ఉప్పు సముద్రం వరకు ఉంది.

  16. తర్వాత మోషే మోయాబు సమతల మైదానాల నుండి వెళ్లి యెరికో ఎదురుగా ఉన్న పిస్గా పర్వత శిఖరం వరకు వెళ్లి నెబో పర్వతమెక్కాడు. అక్కడ యెహోవా అతనికి గిలాదు నుండి దాను వరకు ఉన్న దేశాన్నంతా చూపించారు,

  17. నఫ్తాలి ప్రాంతమంతటిని, ఎఫ్రాయిం మనష్షేల ప్రాంతాలను, పశ్చిమదిక్కున ఉన్న మధ్యధరా సముద్రం వరకు ఉన్న యూదా ప్రాంతాన్ని,

  18. దక్షిణ ప్రాంతాన్ని, ఖర్జూర చెట్ల పట్టణమైన యెరికో లోయ నుండి సోయరు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని అతనికి చూపించారు.

  19. అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నారు, “నేను మీ సంతానానికి ఇస్తానని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశం ఇదే. కళ్ళారా నిన్ను దాన్ని చూడనిస్తున్నాను కాని, నది దాటి నీవు అక్కడికి వెళ్లవు.”

  20. అతడు తూర్పు అరాబాను కిన్నెరెతు సముద్రం నుండి అరాబా సముద్రం (అంటే మృత సముద్రం) వరకు, బేత్-యెషిమోతు వరకు, ఆపై పిస్గా కొండ క్రింద దక్షిణం వైపు వరకు పరిపాలించాడు.