కంటెంట్‌కు వెళ్లండి

Pisgah గురించి బైబిల్ వచనాలు: Balaam prophesies on

11 వచనాలు · 4 కోణాలు

Balaam prophesies on గురించి వచనాలు

  1. బాలాకు బిలామును సోఫీము పొలములో ఉన్న పిస్గా శిఖరం మీదికి తీసుకెళ్లాడు. అక్కడ ఏడు బలిపీఠాలు కట్టి, ఒక్కో దాని మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించాడు.

  2. బిలాము బాలాకుతో, “నీవు ఇక్కడ నీ బలిపీఠం దగ్గర ఉండు, నేను అక్కడ దేవున్ని కలుస్తాను” అని అన్నాడు.

  3. యెహోవా బిలామును కలుసుకొని, అతని నోటిలో మాట ఉంచి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటను చెప్పు” అని అన్నారు.

  4. బిలాము తిరిగివెళ్లి రాజు, తన మోయాబు అధికారులతో దహనబలి దగ్గర నిలిచియుండడం చూశాడు. బాలాకు అతన్ని, “యెహోవా ఏమి చెప్పారు?” అని అడిగాడు.

  5. అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు: “బాలాకు! లేచి, విను; సిప్పోరు కుమారుడా! నా మాట విను.

  6. అబద్ధమాడడానికి దేవుడు మనుష్యుడు కాదు, మనస్సు మార్చుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన మాట్లాడి క్రియ చేయరా? ఆయన వాగ్దానం చేసి నెరవేర్చరా?

  7. ఆశీర్వదించమని నేను ఆజ్ఞ పొందుకున్నాను; ఆయన వారిని ఆశీర్వదించారు, దాన్ని నేను మార్చలేను.

  8. “యాకోబులో ఎటువంటి దోషం కనిపించలేదు, ఇశ్రాయేలులో ఏ చెడు కనిపించలేదు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు; రాజు యొక్క కేక వారి మధ్య ఉన్నది.

  9. దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చారు; వారికి అడవి ఎద్దుకు ఉన్న బలం ఉంది.

  10. యాకోబుకు వ్యతిరేకంగా ఏ భవిష్యవాణి లేదు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ శకునాలు లేవు. ఇప్పుడు యాకోబు గురించి, ఇశ్రాయేలు గురించి, ‘దేవుడు ఏమి చేశారో చూడండి!’

  11. ప్రజలు ఆడ సింహంలా లేస్తారు; వారు తమకు తాము సింహంలా లేస్తారు అది తన వేట మాంసాన్ని మ్రింగివేసే వరకు దాని బాధితుల రక్తం త్రాగే వరకు విశ్రాంతి తీసుకోదు” అని చెప్పబడుతుంది.