Salt గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
ఈ రెండవ గుంపు రాజులందరూ సిద్దీము లోయలో (మృత సముద్ర లోయలో) కూడుకున్నారు.
అయితే లోతు భార్య వెనుకకు తిరిగింది, ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది.
మీ భోజనార్పణలను అన్నిటికి ఉప్పు కలపండి. మీ దేవుని నిబంధన ఉప్పు లేకుండా మీ భోజనార్పణలు ఉండకూడదు; మీ అర్పణలన్నిటికీ ఉప్పు కలపండి.
ఇశ్రాయేలీయులు యెహోవాకు తెచ్చే పవిత్రార్పణలను ప్రక్కకు పెట్టినవి నీకు, నీ కుమారులకు, కుమార్తెలకు శాశ్వత వాటాగా ఇస్తున్నాను. ఇది యెహోవా ఎదుట నీతో పాటు నీ సంతానానికి నిత్య ఉప్పు ఒడంబడికగా ఉంటుంది.”
తర్వాత ఆ సరిహద్దు యొర్దాను గుండా వెళ్తూ మృత సముద్రం వరకు వ్యాపిస్తుంది.
దాని పశ్చిమ సరిహద్దు కిన్నెరెతు నుండి పిస్గా కొండచరియల తూర్పున, మృత సముద్రమనే అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబాలోని యొర్దాను నది.
ఆ నీళ్లు ఆగిపోయి చాలా దూరంలో సారెతాను ప్రక్కన ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఎత్తైన రాశిలా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రమనే అరాబా సముద్రం అంటే మృత సముద్రంలోకి ప్రవహించే నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి. కాబట్టి ప్రజలు యెరికోకు ఎదురుగా నదిని దాటారు.
యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించారు. వీరు వారిని ఓడించి, మహా పట్టణమైన సీదోను వరకు, మిస్రెఫోత్-మయీము వరకు, తూర్పున మిస్పే లోయవరకు ఏ ఒక్కరు మిగులకుండా వారిని వెంటాడి చంపారు.
అతడు తూర్పు అరాబాను కిన్నెరెతు సముద్రం నుండి అరాబా సముద్రం (అంటే మృత సముద్రం) వరకు, బేత్-యెషిమోతు వరకు, ఆపై పిస్గా కొండ క్రింద దక్షిణం వైపు వరకు పరిపాలించాడు.
వారి దక్షిణ సరిహద్దు మృత సముద్రం యొక్క దక్షిణ చివరన ఉన్న అఖాతం నుండి ప్రారంభమైంది,
నిబ్షాను, ఉప్పు పట్టణం, ఎన్-గేదీ అనేవి మొత్తం ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు.
ఆ రోజంతా అబీమెలెకు పట్టణంపై దాడి చేసి, ముట్టడిచేసి, దాని ప్రజలను చంపాడు. తర్వాత పట్టణాన్ని నాశనం చేసి దానిపై ఉప్పు చల్లాడు.
దావీదు ఉప్పు లోయలో 18,000 మంది ఎదోమీయులను చంపి తిరిగివచ్చిన తర్వాత అతడు చాలా పేరు గడించాడు.
అతడు, “క్రొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు. వారు దానిని అతని దగ్గరకు తెచ్చారు.
అప్పుడు అతడు ఊట దగ్గరకు వెళ్లి అందులో ఆ ఉప్పు వేసి, “యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఈ నీళ్లను బాగుచేశాను. ఇక మీద ఇది చావును తీసుకురాదు; భూమిని నిస్సారంగా చేయదు” అని అన్నాడు.
అమజ్యా ఉప్పు లోయలో యుద్ధం చేసి పదివేలమంది ఎదోమీయులను చంపి, సెల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దానికి యొక్తియేలు అనే పేరు పెట్టాడు. ఈనాటికి దాని పేరు అదే.
సెరూయా కుమారుడైన అబీషై ఉప్పు లోయలో 18,000 మంది ఎదోమీయులను చంపాడు.
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉప్పు ఒడంబడిక చేసి, ఇశ్రాయేలు రాజ్యపరిపాలనను శాశ్వతంగా దావీదు వారసులకు ఇచ్చాడు. ఈ సంగతి మీకు తెలియదా?
మేము రాజుకు కట్టుబడి ఉన్నాం కాబట్టి రాజుకు అవమానం జరిగితే చూడలేము. అందుకే రాజుకు ఈ సమాచారాన్ని చేరవేస్తున్నాము.
వారికి అవసరమైన వాటిని అనగా పరలోక దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు యెరూషలేములోని యాజకులు అడిగే గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, ఒలీవనూనె, ప్రతిరోజు క్రమం తప్పకుండా వారికి అందించాలి.
వంద తలాంతుల వెండి, వెయ్యి తూముల వరకు గోధుమలు, వంద బాతుల ద్రాక్షరసం, వంద బాతుల ఒలీవ నూనె, లెక్కలేనంత ఉప్పు సరఫరా చెయ్యండి.
ఉప్పు లేకుండ రుచిలేని ఆహారం ఎవరైనా తింటారా? గుడ్డులోని తెలుపుకు రుచి ఉంటుందా?
వారు బంజరు భూములలో పొదలా ఉంటారు; వృద్ధి కలిగినప్పుడు వారు దానిని చూడరు. వారు ఎడారిలోని ఎండిన ప్రదేశాల్లో, ఎవరూ నివసించని ఉప్పు భూమిలో నివసిస్తారు.
నీ జన్మ విధానం చూస్తే, నీవు పుట్టిన రోజున నీ నాభి సూత్రం కత్తిరించబడలేదు, నిన్ను నీళ్లతో శుభ్రం చేయలేదు, ఉప్పుతో రుద్దలేదు, గుడ్డలో చుట్టలేదు.
మీరు వాటిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి అప్పుడు యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పిస్తారు.