కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 13:5సుమారు క్రీ.పూ. 1490

    షిమ్యోను గోత్రం నుండి, హోరీ కుమారుడైన షాపాతు;

  2. సంఖ్యాకాండము 13:6సుమారు క్రీ.పూ. 1490

    యూదా గోత్రం నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు;

  3. సంఖ్యాకాండము 13:7సుమారు క్రీ.పూ. 1490

    ఇశ్శాఖారు గోత్రం నుండి, యోసేపు కుమారుడైన ఇగాలు;

  4. సంఖ్యాకాండము 13:8సుమారు క్రీ.పూ. 1490

    ఎఫ్రాయిం గోత్రం నుండి, నూను కుమారుడైన హోషేయ;

  5. సంఖ్యాకాండము 13:9సుమారు క్రీ.పూ. 1490

    బెన్యామీను గోత్రం నుండి, రాఫు కుమారుడైన పల్తీ;

  6. సంఖ్యాకాండము 13:10సుమారు క్రీ.పూ. 1490

    జెబూలూను గోత్రం నుండి, సోది కుమారుడైన గదీయేలు;

  7. సంఖ్యాకాండము 13:11సుమారు క్రీ.పూ. 1490

    మనష్షే (యోసేపు గోత్రం) గోత్రం నుండి, సూసీ కుమారుడైన గద్దీ;

  8. సంఖ్యాకాండము 13:12సుమారు క్రీ.పూ. 1490

    దాను గోత్రం నుండి, గెమలి కుమారుడైన అమ్మీయేలు;

  9. సంఖ్యాకాండము 13:13సుమారు క్రీ.పూ. 1490

    ఆషేరు గోత్రం నుండి, మిఖాయేలు కుమారుడైన సెతూరు;

  10. సంఖ్యాకాండము 13:14సుమారు క్రీ.పూ. 1490

    నఫ్తాలి గోత్రం నుండి, వోఫ్సీ కుమారుడైన నహబీ;

  11. సంఖ్యాకాండము 13:15సుమారు క్రీ.పూ. 1490

    గాదు గోత్రం నుండి, మాకీ కుమారుడైన గెయుయేలు.

  12. సంఖ్యాకాండము 13:16సుమారు క్రీ.పూ. 1490

    ఇవి వాగ్దాన దేశాన్ని చూడడానికి మోషే పంపిన వారి పేర్లు. (నూను కుమారుడైన హోషేయకు మోషే యెహోషువ అని పేరు పెట్టాడు.)

  13. సంఖ్యాకాండము 13:17సుమారు క్రీ.పూ. 1490

    మోషే వారిని కనాను దేశాన్ని పరిశీలించమని పంపినప్పుడు, అతడు ఇలా చెప్పాడు, “మీరు దక్షిణ మార్గం గుండా వెళ్లి, కొండసీమ వైపు వెళ్లండి.

  14. సంఖ్యాకాండము 13:18సుమారు క్రీ.పూ. 1490

    ఆ దేశం ఎలా ఉందో, అందులోని ప్రజలు బలవంతులా, బలహీనులా, తక్కువగా ఉన్నారా, ఎక్కువగా ఉన్నారా అని చూడండి.

  15. సంఖ్యాకాండము 13:19సుమారు క్రీ.పూ. 1490

    వారు ఎలాంటి భూమిలో నివసిస్తున్నారు? అది మంచిదా చెడ్డదా? వారు ఎలాంటి పట్టణాల్లో నివసిస్తున్నారు? అవి కోటగోడలు లేనివా? లేదా కోటగోడలు కలవా?

  16. సంఖ్యాకాండము 13:20సుమారు క్రీ.పూ. 1490

    ఆ దేశపు మట్టి ఎలా ఉంది? అది సారవంతమైనదా కాదా? అక్కడ చెట్లున్నాయా లేవా? అక్కడి పండ్లలో కొన్ని తీసుకురావడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి.” (అది ప్రథమ ద్రాక్షపండ్ల కాలము.)

  17. సంఖ్యాకాండము 13:21సుమారు క్రీ.పూ. 1490

    కాబట్టి వారు వెళ్లి సీను ఎడారి నుండి లెబో హమాతు వైపున, రెహోబు వరకు ఆ దేశాన్ని పరిశీలించారు.

  18. సంఖ్యాకాండము 13:22సుమారు క్రీ.పూ. 1490

    దక్షిణ దిక్కునుండి వెళ్లి, హెబ్రోనుకు వచ్చారు, అక్కడ అహీమాను, షేషయి, తల్మయి అనే అనాకు వంశస్థులు నివసించారు. (హెబ్రోను, ఈజిప్టులోని సోయను కంటే ఏడు సంవత్సరాల ముందే కట్టబడిన పురాతన పట్టణము.)

  19. సంఖ్యాకాండము 13:23సుమారు క్రీ.పూ. 1490

    వారు ఎష్కోలు లోయకు చేరుకున్నప్పుడు ఒకే గెల ఉన్న ద్రాక్షచెట్టు కొమ్మను నరికారు. దానిని ఇద్దరు వారి మధ్య కర్ర మీద మోసారు, దానితో పాటు కొన్ని దానిమ్మలు, అంజూరాలు కూడా తీసుకున్నారు.

  20. సంఖ్యాకాండము 13:24సుమారు క్రీ.పూ. 1490

    అక్కడ ఇశ్రాయేలీయులు ద్రాక్ష గెలను కోసినందుకు ఆ స్థలం ఎష్కోలు లోయ అని పిలువబడింది.

  21. సంఖ్యాకాండము 13:25సుమారు క్రీ.పూ. 1490

    ఆ దేశాన్ని పరిశీలించిన నలభైరోజల తర్వాత వారు తిరిగి వచ్చారు.

  22. సంఖ్యాకాండము 13:26సుమారు క్రీ.పూ. 1490

    వారు పారాను ఎడారిలో కాదేషులో ఉన్న మోషే అహరోనులు, ఇశ్రాయేలు సర్వసమాజం దగ్గరకు వచ్చారు. అక్కడ వారికి, సర్వ సమాజానికి విశేషాలు చెప్పి, ఆ దేశ పండ్లను వారికి చూపించారు.

  23. సంఖ్యాకాండము 13:27సుమారు క్రీ.పూ. 1490

    వారు మోషేకు ఇచ్చిన నివేదిక ఇది: “మీరు పంపిన దేశానికి మేము వెళ్లాము. నిజంగా పాలు తేనెలు అక్కడ పారుతున్నాయి. ఇవి ఆ దేశంలోని పండ్లు.

  24. సంఖ్యాకాండము 13:28సుమారు క్రీ.పూ. 1490

    అయితే అక్కడి నివాసులు బలిష్ఠులు, వారి పట్టణాలు కోటగోడలు కలిగి ఉన్నాయి, చాలా పెద్దవి. అక్కడ అనాకీయులను కూడా చూశాము.

  25. సంఖ్యాకాండము 13:29సుమారు క్రీ.పూ. 1490

    అమాలేకీయులు దక్షిణాదిలో నివసిస్తారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ సీమలో ఉంటారు. కనానీయులు సముద్రతీరాన యొర్దాను నది ఒడ్డున నివసిస్తారు.”