కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 22:10సుమారు క్రీ.పూ. 593

    తమ తండ్రి పడకను అవమానపరిచేవారు నీలో ఉన్నారు; బహిష్టు సమయంలో అపవిత్రంగా ఉన్న స్త్రీలను చెరిపినవారు నీలో ఉన్నారు.

  2. యెహెజ్కేలు 22:11సుమారు క్రీ.పూ. 593

    నీలో ఒకడు తన పొరుగువాని భార్యతో అసహ్యకరమైన నేరం చేస్తాడు, మరొకడు అవమానకరంగా తన కోడలిని అపవిత్రం చేస్తాడు, మరొకడు తన సోదరిని, తన తండ్రి కుమార్తెను చెరుపుతాడు.

  3. యెహెజ్కేలు 22:12సుమారు క్రీ.పూ. 593

    నీలో రక్తం చిందించడానికి లంచాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు; నీవు వడ్డీ తీసుకుని పేదల నుండి లాభం పొందుతావు. నీవు నీ పొరుగువారి నుండి అన్యాయమైన లాభం పొందుతావు. నీవు నన్ను మరచిపోయావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  4. యెహెజ్కేలు 22:13సుమారు క్రీ.పూ. 593

    “ ‘నీవు సంపాదించిన అన్యాయ లాభాన్ని, నీవు చేసిన హత్యలు చూసి నా చేతులు చరుచుకుంటాను.

  5. యెహెజ్కేలు 22:14సుమారు క్రీ.పూ. 593

    నేను నిన్ను శిక్షించే రోజును తట్టుకునే ధైర్యం నీకు ఉంటుందా? నీ చేతులు బలంగా ఉంటాయా? యెహోవానైన నేను చెప్పాను, దానిని నేను నెరవేరుస్తాను.

  6. యెహెజ్కేలు 22:15సుమారు క్రీ.పూ. 593

    ఇతర జనాంగాల్లోకి నిన్ను చెదరగొట్టి, ఇతర దేశాలకు నిన్ను వెళ్లగొడతాను; నీ అపవిత్రతకు ముగింపు తెస్తాను.

  7. యెహెజ్కేలు 22:16సుమారు క్రీ.పూ. 593

    నీవు జనాంగాల దృష్టిలో అపవిత్రం అయినప్పుడు, నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’ ”

  8. యెహెజ్కేలు 22:17సుమారు క్రీ.పూ. 593

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  9. యెహెజ్కేలు 22:18సుమారు క్రీ.పూ. 593

    “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి లోహపు మడ్డిలాంటి వారు; వారంతా కొలిమి లోపల మిగిలిపోయిన రాగి, తగరం, ఇనుము, తగరం వంటివారు. వారు వెండి లోహపు మడ్డి వంటివారు.

  10. యెహెజ్కేలు 22:19సుమారు క్రీ.పూ. 593

    ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరంతా లోహపు మడ్డిలా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని యెరూషలేము మధ్యకు పోగుచేస్తాను.

  11. యెహెజ్కేలు 22:20సుమారు క్రీ.పూ. 593

    వెండి, ఇత్తడి, ఇనుము, తగరాన్ని పోగుచేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది, కరిగించినట్లు నేను నా కోపంతో నా ఉగ్రతతో మిమ్మల్ని పోగుచేసి ఆ పట్టణం లోపల ఉంచి మిమ్మల్ని కరిగిస్తాను.

  12. యెహెజ్కేలు 22:21సుమారు క్రీ.పూ. 593

    మిమ్మల్ని పోగుచేసి నా కోపాగ్నిని మీమీద ఊదగా మీరు దానిలో కరిగిపోతారు.

  13. యెహెజ్కేలు 22:22సుమారు క్రీ.పూ. 593

    కొలిమిలో వెండి కరిగినట్లు మీరు దానిలో కరిగిపోతారు. యెహోవానైన నేను నా ఉగ్రతను మీమీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.’ ”

  14. యెహెజ్కేలు 22:23సుమారు క్రీ.పూ. 593

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  15. యెహెజ్కేలు 22:24సుమారు క్రీ.పూ. 593

    “మనుష్యకుమారుడా, యెరూషలేముతో ఇలా చెప్పు, ‘నీవు శుద్ధి చేయబడని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం కురవదు.’

  16. యెహెజ్కేలు 22:25సుమారు క్రీ.పూ. 593

    సింహం గర్జిస్తూ వేటను చీల్చేటట్లు దానిలో దాని ప్రవక్తలు కుట్ర చేస్తారు. వారు మనుష్యులను మ్రింగివేస్తారు. ప్రజల సంపదను విలువైన వస్తువులను దోచుకుంటారు. చాలామందిని విధవరాండ్రుగా చేస్తారు.

  17. యెహెజ్కేలు 22:26సుమారు క్రీ.పూ. 593

    దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని మీరి నా పరిశుద్ధ వస్తువులను అపవిత్రం చేస్తారు; పరిశుద్ధమైన వాటికి సాధారణమైన వాటికి మధ్య భేదం వారికి తెలియదు. పవిత్రతకు అపవిత్రతకు మధ్య ఉన్న భేదాన్ని ప్రజలకు నేర్పించరు. నా విశ్రాంతి దినాలను నిర్లక్ష్యం చేస్తారు. వారి మధ్య నేను అపవిత్రం అయ్యాను.

  18. యెహెజ్కేలు 22:27సుమారు క్రీ.పూ. 593

    దానిలో అధికారులు వేటాడినదాన్ని చీల్చే తోడేళ్లలా ఉన్నారు; అక్రమ సంపాదన కోసం వారు రక్తాన్ని చిందించి ప్రజలను చంపుతారు.

  19. యెహెజ్కేలు 22:28సుమారు క్రీ.పూ. 593

    దాని ప్రవక్తలు తప్పుడు దర్శనాలు అబద్ధపు శకునాలు చూస్తూ యెహోవా ఏమి చెప్పనప్పటికి ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే అని తమ పనులను కప్పిపుచ్చుకుంటారు.

  20. యెహెజ్కేలు 22:29సుమారు క్రీ.పూ. 593

    దేశ ప్రజలు బలాత్కారాలు చేస్తూ దొంగతనాలు చేస్తారు; పేదవారిని దరిద్రులను హింసిస్తారు, విదేశీయులను అన్యాయంగా బాధిస్తారు.

  21. యెహెజ్కేలు 22:30సుమారు క్రీ.పూ. 593

    “నేను దేశాన్ని నాశనం చేయకుండా దాని గోడలను బాగుచేయడానికి పగుళ్లలో నా ఎదుట నిలబడడానికి నేను తగిన వాన్ని వెదికాను కాని అలాంటివాడు ఒక్కడు కూడా నాకు కనపడలేదు.

  22. యెహెజ్కేలు 22:31సుమారు క్రీ.పూ. 593

    కాబట్టి నేను నా ఉగ్రతను వారి మీద క్రుమ్మరించి, నా కోపాగ్నితో వారిని కాల్చివేసి వారు చేసిన వాటన్నిటి ఫలితాన్ని వారి మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”

  23. యెహెజ్కేలు 23:1సుమారు క్రీ.పూ. 593

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  24. యెహెజ్కేలు 23:2సుమారు క్రీ.పూ. 593

    “మనుష్యకుమారుడా, ఒకే తల్లి కుమార్తెలైన ఇద్దరు స్త్రీలు ఉన్నారు.

  25. యెహెజ్కేలు 23:3సుమారు క్రీ.పూ. 593

    వారు తమ యవ్వనం నుండి వ్యభిచారం చేస్తూ ఈజిప్టులో వేశ్యలుగా మారారు. ఆ దేశంలో వారి రొమ్ములు పిండబడ్డాయి, వారి కన్య చనుమొనలు నలిపివేయబడ్డాయి.