- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 21:17సుమారు క్రీ.పూ. 593
నేను కూడా నా చేతులతో చప్పట్లు కొట్టి, నా ఉగ్రత తీర్చుకుంటాను. యెహోవానైన నేనే ఈ మాట అన్నాను.”
- యెహెజ్కేలు 21:18సుమారు క్రీ.పూ. 593
యెహోవా వాక్కు నాకు వచ్చి:
- యెహెజ్కేలు 21:19సుమారు క్రీ.పూ. 593
“మనుష్యకుమారుడా, బబులోను రాజు ఖడ్గం పట్టడానికి రెండు దారులను ఏర్పరచు, రెండూ ఒకే దేశం నుండి మొదలవుతాయి. ఒక సూచికను తయారుచేసి, పట్టణానికి వెళ్లే రహదారి ఆరంభంలో ఉంచు.
- యెహెజ్కేలు 21:20సుమారు క్రీ.పూ. 593
అమ్మోనీయుల పట్టణమైన రబ్బా మీదికి ఒక మార్గాన్ని, అలాగే యూదా దేశంలో ఉన్న ప్రాకార పట్టణమైన యెరూషలేము మీదికి ఒక ఖడ్గం వచ్చేలా మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలి.
- యెహెజ్కేలు 21:21సుమారు క్రీ.పూ. 593
దారులు విడిపోయే చోట రెండు మార్గాలు చీలే స్థలంలో శకునం తెలుసుకోవడానికి బబులోను రాజు ఆగుతాడు. అతడు బాణాలను అటూ ఇటూ ఆడిస్తూ విగ్రహాల దగ్గర విచారణ చేస్తాడు. అతడు కాలేయం శకునాన్ని పరీక్షించి చూస్తున్నాడు.
- యెహెజ్కేలు 21:22సుమారు క్రీ.పూ. 593
యెరూషలేము గురించి తన కుడి వైపున శకునం కనిపించింది ఏర్పాటు చేయమని, చంపమని, యుద్ధధ్వని చేయమని, గుమ్మాలకు ఎదురుగా పడగొట్టే యంత్రాలు ఏర్పాటు చేయమని, ముట్టడి దిబ్బలు వేయమని చెప్పాడు.
- యెహెజ్కేలు 21:23సుమారు క్రీ.పూ. 593
అతనితో ఒప్పందం చేసుకున్న వారికి ఇది తప్పుడు శకునంగా కనిపిస్తుంది, కాని అతడు వారి అపరాధాన్ని వారికి గుర్తు చేసి వారిని బందీగా తీసుకెళ్తాడు.
- యెహెజ్కేలు 21:24సుమారు క్రీ.పూ. 593
“కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరు బహిరంగంగా తిరుగుబాటు చేసి మీ అపరాధాన్ని గుర్తుకు తెచ్చారు, మీరు చేసేవాటన్నిటిలో మీ పాపాలను బయట పెట్టుకున్నారు. మీరు ఇలా చేశారు కాబట్టి, మీరు బందీలుగా కొనిపోబడతారు.
- యెహెజ్కేలు 21:25సుమారు క్రీ.పూ. 593
“ ‘అపవిత్రుడా ఇశ్రాయేలీయుల దుష్ట అధిపతీ, నిన్ను శిక్షించే రోజు సమీపించింది; నీ శిక్షాకాలం ముగింపుకు చేరుకుంది,
- యెహెజ్కేలు 21:26సుమారు క్రీ.పూ. 593
ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: తలపాగా తీసివేయి, కిరీటాన్ని తీసివేయి. ఇది వరకు ఉన్నట్లుగా ఇక ఉండదు: అల్పులు హెచ్చింపబడతారు, గొప్పవారు తగ్గించబడతారు.
- యెహెజ్కేలు 21:27సుమారు క్రీ.పూ. 593
శిథిలం! ఒక శిథిలం! నేను దానిని శిథిలం చేస్తాను! కిరీటం న్యాయంగా ఎవరికి చెందినదో ఆయన వచ్చేవరకు అది ఉండదు; దానిని నేను ఆయనకు ఇస్తాను.’
- యెహెజ్కేలు 21:28సుమారు క్రీ.పూ. 593
“మనుష్యకుమారుడా! నీవు ప్రవచించి ఇలా చెప్పు, ‘అమ్మోనీయుల గురించి వారి అవమానాల గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం, వధ కోసం దూయబడింది, నాశనం చేయడానికి మెరుగు పెట్టబడి, మెరుపులా తళతళలాడుతూ ఉంది!
- యెహెజ్కేలు 21:29సుమారు క్రీ.పూ. 593
నీ గురించి శకునగాండ్రు తప్పుడు దర్శనాలు చూస్తుండగా, నీ గురించి అబద్ధపు శకునాలు చెప్తున్నప్పుడు, ఎవరి దినమైతే వచ్చేసిందో, ఎవరి శిక్షా సమయం ముగింపుకు చేరుకుందో, ఆ దుర్మార్గుల మెడ మీద ఆ ఖడ్గం పెట్టబడుతుంది. వారి మెడ ప్రక్కనే అది నిన్ను పడవేస్తుంది.
- యెహెజ్కేలు 21:30సుమారు క్రీ.పూ. 593
“ ‘ఖడ్గాన్ని తిరిగి ఒరలో పెట్టు. నీవు సృజించబడిన స్థలంలోనే, నీ పూర్వికుల దేశంలోనే నేను నీకు తీర్పు తీరుస్తాను.
- యెహెజ్కేలు 21:31సుమారు క్రీ.పూ. 593
నేను నా ఉగ్రతను నీపై కుమ్మరించి నా కోపాగ్నిని నీ మీదికి ఊదుతాను; నాశనం చేయడంలో నేర్పరులైన క్రూరుల చేతికి నిన్ను అప్పగిస్తాను.
- యెహెజ్కేలు 21:32సుమారు క్రీ.పూ. 593
నీవు అగ్నికి ఆహుతి అవుతావు, నీ రక్తం నీ దేశంలో చిందించబడుతుంది, నీవు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోబడవు; ఎందుకంటే యెహోవానైన నేనే చెప్పాను.’ ”
- యెహెజ్కేలు 22:1సుమారు క్రీ.పూ. 593
యెహోవా వాక్కు నాకు వచ్చి:
- యెహెజ్కేలు 22:2సుమారు క్రీ.పూ. 593
“మనుష్యకుమారుడా, నీవు దానికి తీర్పు తీరుస్తావా? రక్తం చిందించిన ఈ పట్టణానికి నీవు తీర్పు తీరుస్తావా? అలా అయితే నీవు దాని అసహ్యమైన ఆచారాలన్నిటిని బట్టి దానిని నిలదీస్తూ
- యెహెజ్కేలు 22:3సుమారు క్రీ.పూ. 593
ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తన మధ్య రక్తాన్ని చిందిస్తూ, విగ్రహాలను తయారుచేస్తూ తనను తాను అపవిత్రం చేసుకునే నగరమా,
- యెహెజ్కేలు 22:4సుమారు క్రీ.పూ. 593
నీవు చిందించిన రక్తాన్ని బట్టి నీవు అపరాధివి అయ్యావు, నీవు తయారుచేసిన విగ్రహాల వలన నీవు అపవిత్రం అయ్యావు. నీవే నీ దినాలు దగ్గర పడేలా చేసుకున్నావు, నీ సంవత్సరాలు ముగింపుకు వచ్చాయి. కాబట్టి నేను నిన్ను ఇతర జనాంగాల మధ్య హాస్యాస్పదంగా చేసి, అన్ని దేశాల ఎదుట నవ్వులపాలు చేస్తాను.
- యెహెజ్కేలు 22:5సుమారు క్రీ.పూ. 593
అపకీర్తి పొందిన పట్టణమా, కలత చెందినదానా, నీకు దగ్గరగా ఉన్నవారు, దూరంగా ఉన్నవారు నిన్ను ఎగతాళి చేస్తారు.
- యెహెజ్కేలు 22:6సుమారు క్రీ.పూ. 593
“ ‘చూడండి, నీలో ఉన్న ఇశ్రాయేలు నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి హత్యలు చేయాలని నిర్ణయించుకున్నారు.
- యెహెజ్కేలు 22:7సుమారు క్రీ.పూ. 593
నీలో వారు తండ్రిని తల్లిని అవమానించారు; నీలో వారు పరదేశులను అణచివేశారు, తండ్రిలేనివారిని, విధవరాండ్రను చులకనగా చూశారు.
- యెహెజ్కేలు 22:8సుమారు క్రీ.పూ. 593
నీవు నా పరిశుద్ధ వస్తువులను తృణీకరించి నా సబ్బాతులను అపవిత్రం చేశావు.
- యెహెజ్కేలు 22:9సుమారు క్రీ.పూ. 593
అపవాదులు వేసేవారు, రక్తం చిందించేవారు నీలో ఉన్నారు; పర్వత క్షేత్రాల దగ్గర తిని, అసభ్యకరమైన పనులు చేసేవారు నీలో ఉన్నారు.