- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 23:4సుమారు క్రీ.పూ. 593
వారిలో పెద్దదాని పేరు ఒహోలా, దాని చెల్లి పేరు ఒహోలీబా. నేను వారిని పెళ్ళి చేసుకోగా వారు నాకు కుమారులను, కుమార్తెలను కన్నారు. ఒహోలా అంటే సమరయ, ఒహోలీబా అంటే యెరూషలేము.
- యెహెజ్కేలు 23:5సుమారు క్రీ.పూ. 593
“ఒహోలా నాదానిగా ఉన్నప్పుడే వ్యభిచారం చేసింది; అది తన ప్రేమికులైన అష్షూరు వారిని మోహించింది.
- యెహెజ్కేలు 23:6సుమారు క్రీ.పూ. 593
వారు నీలిరంగు వస్త్రాలను ధరించిన యోధులు, అధికారులు సైన్యాధిపతులు, వారందరూ అందమైన యువకులు, గుర్రాలు స్వారీ చేసేవారు.
- యెహెజ్కేలు 23:7సుమారు క్రీ.పూ. 593
అది ఒక వేశ్యలా అష్షూరీయులలో ముఖ్యులైన వారి ఎదుట తిరుగుతూ వారందరితో వ్యభిచరిస్తూ వారు నిలబెట్టిన విగ్రహాలన్నిటిని పూజించి అపవిత్రురాలైంది.
- యెహెజ్కేలు 23:8సుమారు క్రీ.పూ. 593
అది ఈజిప్టులో ప్రారంభించిన వ్యభిచారాన్ని ఇంకా వదల్లేదు, దాని యవ్వనంలోనే పురుషులు దానితో పడుకున్నప్పుడు, దాని కన్య చనుమొనలను నలిపి, దానితో తమ కామాన్ని తీర్చుకున్నారు.
- యెహెజ్కేలు 23:9సుమారు క్రీ.పూ. 593
“కాబట్టి అది మోహించిన దాని ప్రేమికులైన అష్షూరువారి చేతికే దానిని అప్పగించాను.
- యెహెజ్కేలు 23:10సుమారు క్రీ.పూ. 593
వారు దానిని నగ్నంగా నిలబెట్టారు, దాని కుమారులను కుమార్తెలను బంధించి దాన్ని ఖడ్గంతో చంపారు. స్త్రీలందరిలో అది ఒక సామెతగా అయ్యింది, దానికి శిక్ష విధించబడింది.
- యెహెజ్కేలు 23:11సుమారు క్రీ.పూ. 593
“దాని చెల్లి ఒహోలీబా ఇదంతా చూసింది, అయినాసరే కామంలో వ్యభిచారంలో దాని అక్కను మించి దిగజారిపోయింది.
- యెహెజ్కేలు 23:12సుమారు క్రీ.పూ. 593
అది కూడా అష్షూరు వారిలో సైన్యాధిపతులు, అధికారులను, నీలిరంగు వస్త్రాలను ధరించిన యోధులు, గుర్రాలు స్వారీ చేసేవారిని, అందమైన యువకులను మోహించింది.
- యెహెజ్కేలు 23:13సుమారు క్రీ.పూ. 593
అది కూడా తనను తాను అపవిత్రపరచుకోవడం నేను చూశాను; వారిద్దరు ఒకే దారిలో వెళ్లారు.
- యెహెజ్కేలు 23:14సుమారు క్రీ.పూ. 593
“అయితే అది వ్యభిచారాన్ని మరింత ఎక్కువగా చేసింది. అది గోడపై ఎరుపు రంగులో చిత్రీకరించబడిన కల్దీయుల పురుషుల చిత్రాలను చూసింది.
- యెహెజ్కేలు 23:15సుమారు క్రీ.పూ. 593
వారు నడుములకు దట్టీలు, తలలపై తలపాగాలు ధరించిన బబులోను రథ అధికారుల్లా, కల్దీయ సంతానంలా కనిపించారు.
- యెహెజ్కేలు 23:16సుమారు క్రీ.పూ. 593
అది వారిని చూడగానే వారిని మోహించి, కల్దీయలో ఉన్న వారి దగ్గరకు దూతలను పంపింది.
- యెహెజ్కేలు 23:17సుమారు క్రీ.పూ. 593
అప్పుడు బబులోనువారు దాని పడక సుఖాన్ని కోరి వచ్చి వ్యభిచరించి దానిని అపవిత్రం చేశారు. అది వారిచే అపవిత్రపరచబడిన తర్వాత, దాని మనస్సుకు వారంటే అసహ్యం వేసింది.
- యెహెజ్కేలు 23:18సుమారు క్రీ.పూ. 593
అదలా తన వ్యభిచారాన్ని బహిరంగంగా నిర్వహిస్తూ, తన నగ్న శరీరాన్ని బహిర్గతం చేసినప్పుడు, నేను దాని సోదరిని వదిలేసినట్టే, దీని మీద అసహ్యం కలిగి దీన్ని కూడా వదిలేశాను.
- యెహెజ్కేలు 23:19సుమారు క్రీ.పూ. 593
అయినప్పటికీ అది ఈజిప్టులో వేశ్యగా ఉన్న తన యవ్వన రోజులను గుర్తుచేసుకుని మరింత వ్యభిచారం చేసింది.
- యెహెజ్కేలు 23:20సుమారు క్రీ.పూ. 593
గాడిదల్లాంటి పురుషాంగం గుర్రాల్లాంటి వీర్య స్ఖలనం ఉన్న తన ప్రేమికులను అది మోహించింది.
- యెహెజ్కేలు 23:21సుమారు క్రీ.పూ. 593
కాబట్టి ఈజిప్టులో నీ రొమ్ములను చనుమొనలను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని నీ యవ్వనపు అశ్లీల ప్రవర్తన కొనసాగించాలని ఎంతో ఆశించావు.
- యెహెజ్కేలు 23:22సుమారు క్రీ.పూ. 593
“కాబట్టి ఒహోలీబా, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీ ప్రేమికులనే నీకు వ్యతిరేకంగా రేపుతాను, నీవు అసహ్యం కలిగి వదిలేసిన వారినే అన్ని వైపుల నుండి నీ మీదికి రప్పిస్తాను.
- యెహెజ్కేలు 23:23సుమారు క్రీ.పూ. 593
బబులోనీయులు, కల్దీయులందరూ, పేకోదు, షోవ, కోవ యొక్క పురుషులు, వారితో ఉన్న అష్షూరీయులందరు, అందమైన యువకులు, అధికారులు, అధిపతులు, రథ అధికారులు ఉన్నత స్థాయి పురుషులు, గుర్రపు స్వారీ చేసే వీరందరిని రప్పిస్తాను.
- యెహెజ్కేలు 23:24సుమారు క్రీ.పూ. 593
వారు ఆయుధాలతో రథాలతో బండ్లతో జనసమూహంతో నీ మీదికి వస్తారు. పెద్ద డాళ్లు, చిన్న డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి అన్ని వైపుల నుండి నిన్ను చుట్టుముడతారు. శిక్షించడానికి నేను నిన్ను వారికి అప్పగిస్తాను, వారు తమ పద్ధతిలో నిన్ను శిక్షిస్తారు.
- యెహెజ్కేలు 23:25సుమారు క్రీ.పూ. 593
నేను రోషంతో నా కోపాన్ని చూపించగా కోపాగ్రతతో వారు నిన్ను శిక్షిస్తారు. వారు నీ ముక్కు నీ చెవులు నరికివేస్తారు, నీలో మిగిలి ఉన్నవారు కత్తివేటుకు కూలిపోతారు. నీ కుమారులను కుమార్తెలను వారు తీసుకెళ్తారు, నీలో మిగిలిన వారు అగ్నిచేత కాల్చబడతారు.
- యెహెజ్కేలు 23:26సుమారు క్రీ.పూ. 593
వారు నీ బట్టలు లాగివేసి నీ విలువైన ఆభరణాలు తీసుకెళ్తారు.
- యెహెజ్కేలు 23:27సుమారు క్రీ.పూ. 593
కాబట్టి ఈజిప్టులో నీవు మొదలుపెట్టిన అశ్లీల ప్రవర్తన, వ్యభిచారం నీలో ఉండకుండా చేస్తాను. ఇకపై నీవు ఈజిప్టును జ్ఞాపకం చేసుకోవు, నీవు వీటిపై నీ దృష్టిని పెట్టవు.
- యెహెజ్కేలు 23:28సుమారు క్రీ.పూ. 593
“ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు ద్వేషించిన వారికి నీవు అసహ్యించుకునే వారికి నిన్ను అప్పగిస్తున్నాను.