కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 23:29సుమారు క్రీ.పూ. 593

    వారు ద్వేషంతో నిన్ను బాధిస్తారు. నీవు వేటి కోసం కష్టపడ్డావో వాటన్నిటిని తీసుకుంటారు. వారు నిన్ను నగ్నంగా వదిలివేయగా నీ వేశ్యాత్వం వలన కలిగిన అవమానం బహిర్గతమవుతుంది.

  2. యెహెజ్కేలు 23:30సుమారు క్రీ.పూ. 593

    నీవు దేశాలను మోహించి, వారి విగ్రహాలతో నిన్ను నీవు అపవిత్రం చేసుకున్నావు, నీ అశ్లీలత, వ్యభిచారం వల్లనే ఇది నీ మీదికి వచ్చింది.

  3. యెహెజ్కేలు 23:31సుమారు క్రీ.పూ. 593

    నీ సోదరి వెళ్లిన దారిలోనే నీవు వెళ్లావు; కాబట్టి నేను దాని గిన్నెనే నీ చేతిలో పెడతాను.

  4. యెహెజ్కేలు 23:32సుమారు క్రీ.పూ. 593

    “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నీ అక్క త్రాగిన గిన్నె లోనిదే నీవు త్రాగుతావు, అది లోతైన పెద్ద గిన్నె; అది అపహాస్యం ఎగతాళిని తెస్తుంది, అందులో త్రాగాల్సింది చాలా ఉంటుంది.

  5. యెహెజ్కేలు 23:33సుమారు క్రీ.పూ. 593

    నీవు మత్తుతో, విచారంతో నిండిపోతావు, నీ సోదరియైన సమరయ గిన్నె, శిథిలం నిర్మానుష్యంతో నిండిన గిన్నె.

  6. యెహెజ్కేలు 23:34సుమారు క్రీ.పూ. 593

    అడుగు వరకు దానిలోనిది త్రాగి ఆ పాత్రను ముక్కలు చేసి, వాటితో నీ రొమ్ములు చీల్చుకుంటావు. ఇది నేనే చెప్పాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  7. యెహెజ్కేలు 23:35సుమారు క్రీ.పూ. 593

    “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు నన్ను మరచిపోయి నాకు వెన్ను చూపావు, నీ అశ్లీల ప్రవర్తనకు వ్యభిచారానికి తగిన శిక్షను నీవు భరించాలి.”

  8. యెహెజ్కేలు 23:36సుమారు క్రీ.పూ. 593

    యెహోవా నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఒహోలాకు, ఒహోలీబాకు నీవు తీర్పు తీరుస్తావా? వారు చేసిన అసహ్యమైన పనులను వారికి తెలియజేయి.

  9. యెహెజ్కేలు 23:37సుమారు క్రీ.పూ. 593

    వారు వ్యభిచారులు, వారి చేతికి రక్తం అంటింది. వారు విగ్రహాలతో వ్యభిచరించారు; నాకు కన్న బిడ్డలను వారు విగ్రహాలకు ఆహారంగా అర్పించారు.

  10. యెహెజ్కేలు 23:38సుమారు క్రీ.పూ. 593

    వారు నాకు కూడా ఇలా చేశారు: అదే సమయంలో వారు నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు; నా సబ్బాతులను కూడా అపవిత్రం చేశారు.

  11. యెహెజ్కేలు 23:39సుమారు క్రీ.పూ. 593

    వారు తాము పెట్టుకున్న విగ్రహాలకు తమ పిల్లలను అర్పించిన రోజే వారు నా పరిశుద్ధాలయంలో ప్రవేశించి దానిని అపవిత్రం చేశారు. నా నివాసంలో వారు ఈ విధంగానే చేశారు.

  12. యెహెజ్కేలు 23:40సుమారు క్రీ.పూ. 593

    “వారు దూర ప్రాంతాల నుండి వచ్చిన పురుషుల కోసం దూతలను కూడా పంపారు. వారు వచ్చినప్పుడు వారి కోసం నీవు స్నానం చేసి కళ్లకు కాటుక పెట్టుకుని నగలు ధరించావు.

  13. యెహెజ్కేలు 23:41సుమారు క్రీ.పూ. 593

    అందమైన మంచం మీద కూర్చుని దాని ఎదురుగా ఉన్న బల్లమీద నా పరిమళద్రవ్యాన్ని ఒలీవల నూనెను పెట్టావు.

  14. యెహెజ్కేలు 23:42సుమారు క్రీ.పూ. 593

    “అప్పుడే కోలాహలం చేసే గుంపు ఆమె చుట్టూ వినిపించింది; అల్లరిమూకలోని వారితో పాటు ఎడారి మార్గాన త్రాగుబోతులు వచ్చారు. వారు ఈ అక్కచెల్లెళ్ల చేతులకు కడియాలను తొడిగి వారి తలకు అందమైన కిరీటాలు పెట్టారు.

  15. యెహెజ్కేలు 23:43సుమారు క్రీ.పూ. 593

    వ్యభిచారం చేసి అలసిపోయిన దాని గురించి ఇలా అన్నాను, ‘అది వారితో చేసినట్లే వారు దానితో వ్యభిచారం చేశారు.’

  16. యెహెజ్కేలు 23:44సుమారు క్రీ.పూ. 593

    వేశ్యతో గడిపినట్లుగా వారు ఆమెతో గడిపారు. అలాగే వేశ్యలైన ఒహోలాతో, ఒహోలీబాతో గడిపారు.

  17. యెహెజ్కేలు 23:45సుమారు క్రీ.పూ. 593

    వీరిద్దరు వ్యభిచారం చేసి హత్యలు చేశారు కాబట్టి నీతిమంతులైన న్యాయాధిపతులు వీరికి తగిన శిక్ష విధిస్తారు.

  18. యెహెజ్కేలు 23:46సుమారు క్రీ.పూ. 593

    “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: వారి మీదికి నేను అల్లరిమూకను రప్పిస్తాను. శత్రువులు వారిని భయపెట్టి దోచుకుంటారు.

  19. యెహెజ్కేలు 23:47సుమారు క్రీ.పూ. 593

    అల్లరిమూక వారిని రాళ్లు రువ్వి చంపుతుంది. ఖడ్గంతో చంపుతారు. వారి కుమారులు కుమార్తెలను చంపి వారి ఇళ్ళను కాల్చివేస్తారు.

  20. యెహెజ్కేలు 23:48సుమారు క్రీ.పూ. 593

    “కాబట్టి స్త్రీలందరూ మిమ్మల్ని అనుకరించకుండా హెచ్చరికగా ఉండేలా నేను దేశంలోని అసభ్య అంతం చేస్తాను.

  21. యెహెజ్కేలు 23:49సుమారు క్రీ.పూ. 593

    మీరు మీ అసభ్య ప్రవర్తనకు శిక్ష అనుభవిస్తారు, విగ్రహారాధన పాపానికి పర్యవసానాలను భరిస్తారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.”

  22. యెహెజ్కేలు 24:1సుమారు క్రీ.పూ. 590

    తొమ్మిదో సంవత్సరం పదవనెల పదవ రోజున యెహోవా వాక్కు నాకు వచ్చి:

  23. యెహెజ్కేలు 24:2సుమారు క్రీ.పూ. 590

    “మనుష్యకుమారుడా, ఈ తేదీని నమోదు చేయి ఎందుకంటే బబులోను రాజు ఈ రోజే యెరూషలేమును ముట్టడించాడు.

  24. యెహెజ్కేలు 24:3సుమారు క్రీ.పూ. 590

    తిరుగుబాటు చేసే ఈ ప్రజల గురించి ఉపమానరీతిగా ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక కుండ తెచ్చి దానిలో నీళ్లు పోసి, దానిని పొయ్యిమీద పెట్టు.

  25. యెహెజ్కేలు 24:4సుమారు క్రీ.పూ. 590

    తొడ ముక్కలు, జబ్బ ముక్కల వంటి మంచి ముక్కలు దానిలో వేసి మంచి ఎముకలతో దానిని నింపు;