- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 25:3సుమారు క్రీ.పూ. 590
వారితో ఇలా చెప్పు, ‘అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా పరిశుద్ధాలయం అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలు దేశం పాడైపోతున్నప్పుడు, యూదా వారు బందీలుగా వెళ్తున్నప్పుడు మీరు “ఆహా!” అన్నారు.
- యెహెజ్కేలు 25:4సుమారు క్రీ.పూ. 590
కాబట్టి నేను మిమ్మల్ని తూర్పు ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగిస్తాను. వారు గుడారాలు వేసుకుని మీ మధ్య నివసిస్తారు; వారు మీ పండ్లు తిని మీ పాలు త్రాగుతారు.
- యెహెజ్కేలు 25:5సుమారు క్రీ.పూ. 590
రబ్బా పట్టణాన్ని ఒంటెల శాలగా మారుస్తాను. అమ్మోనీయుల దేశాన్ని గొర్రె దొడ్డిగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
- యెహెజ్కేలు 25:6సుమారు క్రీ.పూ. 590
ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీరు చప్పట్లు కొట్టి కాళ్లతో నేలను తన్ని ఇశ్రాయేలు దేశానికి జరిగిన దానిని గురించి మీ మనస్సులోని దురుద్దేశంతో సంతోషించారు.
- యెహెజ్కేలు 25:7సుమారు క్రీ.పూ. 590
అందుకే నేను మీకు విరోధినై మిమ్మల్ని ప్రజలకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను. ఇతర ప్రజల్లో ఉండకుండా నేను మిమ్మల్ని తుడిచివేస్తాను, దేశాల నుండి నిర్మూలిస్తాను. నేను మిమ్మల్ని నాశనం చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
- యెహెజ్కేలు 25:8సుమారు క్రీ.పూ. 590
“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘మోయాబీయులు శేయీరు పట్టణస్థులు, “యూదా వారు కూడా ఇతర జనాల్లాగానే తయారయ్యారు” అన్నారు కాబట్టి,
- యెహెజ్కేలు 25:9సుమారు క్రీ.పూ. 590
మోయాబుకు ఘనతను తెచ్చే పొలిమేర పట్టణాలైన బేత్-యెషిమోతు బయల్-మెయోను కిర్యతాయిములతో మొదలుపెట్టి సరిహద్దు పట్టణాలన్నిటిని
- యెహెజ్కేలు 25:10సుమారు క్రీ.పూ. 590
అమ్మోనీయులతో పాటు తూర్పు ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగిస్తాను, అప్పుడు జనాల్లో అమ్మోనీయులు జ్ఞాపకానికి రారు.
- యెహెజ్కేలు 25:11సుమారు క్రీ.పూ. 590
మోయాబుకు నేను శిక్ష విధిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
- యెహెజ్కేలు 25:12సుమారు క్రీ.పూ. 590
“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘ఎదోమీయులు యూదా వారి మీద పగతీర్చుకున్నారు. అలా చేసి వారు దోషులయ్యారు,
- యెహెజ్కేలు 25:13సుమారు క్రీ.పూ. 590
కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఎదోము మీద నా చేయి చాపి మనుష్యులను పశువులను చంపి సమస్తాన్ని నిర్మూలం చేస్తాను. తేమాను పట్టణం నుండి దేదాను వరకు ప్రజలంతా కత్తివేటుకు కూలిపోతారు.
- యెహెజ్కేలు 25:14సుమారు క్రీ.పూ. 590
నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము మీద నా పగ తీర్చుకుంటాను. నా కోపం నా ఉగ్రతకు అనుగుణంగా వారు ఎదోముకు చేస్తారు. అప్పుడు నా ఉగ్రత ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.’ ”
- యెహెజ్కేలు 25:15సుమారు క్రీ.పూ. 590
“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘ఫిలిష్తీయులు పగతీర్చుకున్నారు తమ హృదయాల్లో ఉన్న ద్వేషంతో పాత పగలతో యూదాను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
- యెహెజ్కేలు 25:16సుమారు క్రీ.పూ. 590
కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఫిలిష్తీయుల మీద నేను చేయి చాపి కెరేతీయులను తుడిచివేస్తాను. సముద్రతీరాన నివసించే మిగిలిన వారికి కూడా నాశనం చేస్తాను.
- యెహెజ్కేలు 25:17సుమారు క్రీ.పూ. 590
నా ఉగ్రతతో వారిని శిక్షించి వారి మీద పూర్తిగా పగ తీర్చుకుంటాను. వారి మీద నేను పగ తీర్చుకున్నప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
- యెహెజ్కేలు 26:1సుమారు క్రీ.పూ. 588
పదకొండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది:
- యెహెజ్కేలు 26:2సుమారు క్రీ.పూ. 588
“మనుష్యకుమారుడా, యెరూషలేము గురించి తూరు, ‘ఆహా! జనాంగాలకు గుమ్మం విరిగిపోయింది, దాని తలుపులు నా కోసం తెరచుకొని ఉన్నాయి; ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది కాబట్టి నేను వృద్ధి చెందుతాను’ అని చెప్పింది.
- యెహెజ్కేలు 26:3సుమారు క్రీ.పూ. 588
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తూరు పట్టణమా, నేను నీకు విరోధిని. సముద్రంలో అలలు పొంగినట్లు అనేక జనాంగాలను నీ మీదికి రప్పిస్తాను.
- యెహెజ్కేలు 26:4సుమారు క్రీ.పూ. 588
వారు తూరు గోడలు కూల్చివేసి దాని గోపురాలను పడగొడతారు; దాని మీద ఉన్న మట్టిని నేను తుడిచివేసి, వట్టి బండలా మిగిలేలా చేస్తాను.
- యెహెజ్కేలు 26:5సుమారు క్రీ.పూ. 588
సముద్రం దానిని చుట్టుముట్టినప్పుడు అది చేపల వలలు ఆరబెట్టే స్థలంగా మారుతుంది. నేనే మాట ఇచ్చాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అది జనాంగాలకు దోపుడు సొమ్ముగా మారుతుంది,
- యెహెజ్కేలు 26:6సుమారు క్రీ.పూ. 588
పొలంలో ఉన్న దాని కుమార్తెలు ఖడ్గం పాలవుతారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.
- యెహెజ్కేలు 26:7సుమారు క్రీ.పూ. 588
“ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఉత్తరం నుండి నేను రాజుల రాజు, బబులోను రాజైన నెబుకద్నెజరును గుర్రాలు రథాలు, గుర్రపురౌతులు గొప్ప సైన్యంతో తూరు మీదికి రప్పించబోతున్నాను.
- యెహెజ్కేలు 26:8సుమారు క్రీ.పూ. 588
అతడు ఖడ్గంతో ప్రధాన భూభాగంలో మీ నివాసాలను నాశనం చేస్తాడు; అతడు మీకు వ్యతిరేకంగా ముట్టడి పనులను ఏర్పాటు చేస్తాడు, మీ గోడలకు ముట్టడి దిబ్బలను ఏర్పాటు చేస్తాడు.
- యెహెజ్కేలు 26:9సుమారు క్రీ.పూ. 588
అతడు మీ గోడల మీదికి తన పడగొట్టే యంత్రాలను పంపుతాడు, తన ఆయుధాలతో మీ గోపురాలను కూల్చివేస్తాడు.
- యెహెజ్కేలు 26:10సుమారు క్రీ.పూ. 588
అతనికి ఉన్న గుర్రాలు రేపిన దుమ్ము నిన్ను కమ్ముతుంది. ఒకడు పగిలిన గోడలున్న పట్టణంలోకి ప్రవేశించినట్లు అతడు నీ గుమ్మాల్లోకి వచ్చినప్పుడు గుర్రపురౌతుల నుండి రథచక్రాల నుండి వచ్చే శబ్దానికి నీ గోడలు అదురుతాయి.