కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 24:5సుమారు క్రీ.పూ. 590

    మందలో శ్రేష్ఠమైన వాటిని తీసుకో! దానిలోని ఎముకలు బాగా ఉడికేలా దాని క్రింద కట్టెలతో మంట ఎక్కువగా పెట్టి వాటిని మరిగించి బాగా ఉడకబెట్టు.

  2. యెహెజ్కేలు 24:6సుమారు క్రీ.పూ. 590

    “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘హంతకులున్న పట్టణానికి శ్రమ, మడ్డి ఉన్న కుండకు శ్రమ, దాని తుప్పు పోదు. ఏ వరుసలో వచ్చినా సరే దానిలో నుండి మాంసాన్ని ముక్క తర్వాత ముక్కగా తీయండి.

  3. యెహెజ్కేలు 24:7సుమారు క్రీ.పూ. 590

    “ ‘అది చిందించిన రక్తం దాని మధ్యనే ఉంది: మట్టితో కప్పివేయడానికి వీలుగా అది రక్తాన్ని నేలమీద క్రుమ్మరించకుండ, వట్టి బండ మీద క్రుమ్మరించింది;

  4. యెహెజ్కేలు 24:8సుమారు క్రీ.పూ. 590

    ఉగ్రతను రేపి ప్రతీకారం తీసుకోవడానికి దాని రక్తం కప్పివేయబడకుండ వట్టి బండ మీద క్రుమ్మరించాను.

  5. యెహెజ్కేలు 24:9సుమారు క్రీ.పూ. 590

    “ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘హంతకులున్న పట్టణానికి శ్రమ! నేను మరి ఎక్కువగా కట్టెలు పేర్చుతాను.

  6. యెహెజ్కేలు 24:10సుమారు క్రీ.పూ. 590

    కట్టెలు పేర్చి అగ్ని రాజేయండి. మసాలాలు కలిపి మాంసం బాగా ఉడకబెట్టండి; ఎముకలు పూర్తిగా ఉడకనివ్వండి;

  7. యెహెజ్కేలు 24:11సుమారు క్రీ.పూ. 590

    తర్వాత దానికున్న మలినం కరిగిపోయి, మడ్డి పూర్తిగా పోయేలా ఆ కుండ వేడెక్కి దాని రాగి మెరిసే వరకు దానిని బొగ్గుల మీద ఉంచండి.

  8. యెహెజ్కేలు 24:12సుమారు క్రీ.పూ. 590

    అలసిపోయేంత వరకు ప్రయత్నించినా అగ్నితో కాల్చినా సరే దాని మడ్డి తొలగిపోలేదు.

  9. యెహెజ్కేలు 24:13సుమారు క్రీ.పూ. 590

    “ ‘నీ అతి కామాతురతయే నీకున్న అపవిత్రత. నిన్ను పవిత్రపరచడానికి నేను ప్రయత్నించాను కాని నీవు శుద్ధి కాలేదు కాబట్టి నా ఉగ్రత నీమీద తీర్చుకునే వరకు నీవు పవిత్రం కావు.

  10. యెహెజ్కేలు 24:14సుమారు క్రీ.పూ. 590

    “ ‘యెహోవానైన నేను మాట ఇచ్చాను. అది నెరవేర్చే సమయం వచ్చింది. నేను వెనక్కి తీసుకోను; నేను జాలిపడను పశ్చాత్తాపపడను. నీ ప్రవర్తనను బట్టి, నీ పనులను బట్టి నీకు శిక్ష విధించబడుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

  11. యెహెజ్కేలు 24:15సుమారు క్రీ.పూ. 590

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  12. యెహెజ్కేలు 24:16సుమారు క్రీ.పూ. 590

    “మనుష్యకుమారుడా, ఒక్క దెబ్బతో నీ కళ్లల్లో ఆనందాన్ని నీ నుండి తీసివేయబోతున్నాను. విలపించవద్దు ఏడవవద్దు కన్నీరు కార్చవద్దు.

  13. యెహెజ్కేలు 24:17సుమారు క్రీ.పూ. 590

    చనిపోయినవారి కోసం దుఃఖించకుండ నిశ్శబ్దంగా నిట్టూర్చు. నీ తలపాగాను కట్టుకుని నీ కాళ్లకు చెప్పులు వేసుకో; నీ మీసం గెడ్డం కప్పుకోవద్దు; సంతాపంగా ఇతరులు తెచ్చిన ఆహారం తినవద్దు.”

  14. యెహెజ్కేలు 24:18సుమారు క్రీ.పూ. 590

    కాబట్టి నేను ఉదయం ప్రజలతో మాట్లాడాను, సాయంత్రం నా భార్య చనిపోయింది. మరుసటిరోజు ఉదయం నాకు ఆజ్ఞాపించినట్లే నేను చేశాను.

  15. యెహెజ్కేలు 24:19సుమారు క్రీ.పూ. 590

    అప్పుడు ప్రజలు నన్ను ఇలా అడిగారు, “నీవు చేస్తున్న వాటినుండి మేము తెలుసుకోవలసిన వాటిని మాకు చెప్పవా?”

  16. యెహెజ్కేలు 24:20సుమారు క్రీ.పూ. 590

    అప్పుడు నేను వారితో ఇలా అన్నాను, “యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:

  17. యెహెజ్కేలు 24:21సుమారు క్రీ.పూ. 590

    ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీకు గర్వకారణంగా, మీ కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేదిగా, మీరు అభిమానించే నా పరిశుద్ధాలయాన్ని నేను అపవిత్రం చేయబోతున్నాను. మీరు వెనుక విడిచిపెట్టిన మీ కుమారులు, కుమార్తెలు కత్తివేటుకు కూలిపోతారు.

  18. యెహెజ్కేలు 24:22సుమారు క్రీ.పూ. 590

    అప్పుడు నేను చేసినట్లే మీరు కూడా చేస్తారు. మీ మీసం గడ్డం కప్పుకోరు; సంతాపంగా ఇతరులు తెచ్చిన ఆహారం తినరు.

  19. యెహెజ్కేలు 24:23సుమారు క్రీ.పూ. 590

    మీ తలపాగాలు మీ తలల మీద నుండి తీయరు మీ చెప్పులు మీ కాళ్లకే ఉంటాయి. మీరు దుఃఖించరు ఏడవరు కానీ మీలో మీరే మూల్గుతూ మీ పాపాల కారణంగా క్రుంగిపోతారు.

  20. యెహెజ్కేలు 24:24సుమారు క్రీ.పూ. 590

    యెహెజ్కేలు నీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిందంతా మీరూ చేస్తారు. ఇది జరిగినప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”

  21. యెహెజ్కేలు 24:25సుమారు క్రీ.పూ. 590

    “మనుష్యకుమారుడా, నేను వారి ఆశ్రయాన్ని, వారి ఆనందాన్ని కీర్తిని, వారి కళ్లకు ఇష్టమైన దానిని, వారి హృదయ ఆశలను అలాగే వారి కుమారులను కుమార్తెలను తీసివేసే రోజు వస్తుంది.

  22. యెహెజ్కేలు 24:26సుమారు క్రీ.పూ. 590

    ఆ రోజున నీకు వార్త చెప్పడానికి ఒకడు తప్పించుకుని నీ దగ్గరకు వస్తాడు.

  23. యెహెజ్కేలు 24:27సుమారు క్రీ.పూ. 590

    అప్పుడు నీవు మౌనంగా ఉండకుండా తప్పించుకుని వచ్చిన వానితో నోరు తెరిచి స్పష్టంగా మాట్లాడతావు. నేనే యెహోవానని వారు తెలుసుకోవడానికి ఇలా నీవు వారికి ఒక సూచనగా ఉంటావు.”

  24. యెహెజ్కేలు 25:1సుమారు క్రీ.పూ. 590

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  25. యెహెజ్కేలు 25:2సుమారు క్రీ.పూ. 590

    “మనుష్యకుమారుడా, అమ్మోనీయుల వైపు నీ ముఖాన్ని త్రిప్పి వారి గురించి ప్రవచించు.