కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 26:11సుమారు క్రీ.పూ. 588

    అతడు తన గుర్రాల డెక్కలతో నీ వీధులన్నిటిని అణగద్రొక్కిస్తాడు. కత్తితో నీ ప్రజలను చంపుతాడు. నీ బలమైన స్తంభాలు నేల కూలిపోతాయి.

  2. యెహెజ్కేలు 26:12సుమారు క్రీ.పూ. 588

    వారు నీ సంపదను దోచుకుంటారు నీ వస్తువులను దొంగిలిస్తారు. వారు నీ గోడలను కూల్చివేసి, నీ విలాసవంతమైన భవనాలను పడగొట్టి, నీ రాళ్లను కలపను సముద్రంలోకి విసిరివేస్తారు.

  3. యెహెజ్కేలు 26:13సుమారు క్రీ.పూ. 588

    నేను నీ సంగీతాన్ని ఆపివేస్తాను. నీ సితార శబ్దం ఇకపై వినపడదు.

  4. యెహెజ్కేలు 26:14సుమారు క్రీ.పూ. 588

    నేను నిన్ను వట్టి బండగా చేస్తాను, నీవు చేపల వలలు పరిచే స్థలం అవుతావు. నీవు ఎప్పటికీ కట్టబడవు, ఎందుకంటే యెహోవానైన నేనే చెప్పాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  5. యెహెజ్కేలు 26:15సుమారు క్రీ.పూ. 588

    “తూరు గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు కూలిపోయినప్పుడు నీలో నుండి వచ్చే గాయపడినవారి కేకలు, నీ మధ్య జరుగుతున్న ఊచకోతను విని తీరప్రాంతాలు వణకవా?

  6. యెహెజ్కేలు 26:16సుమారు క్రీ.పూ. 588

    తీరప్రాంతపు అధికారులందరూ తమ సింహాసనాల మీది నుండి దిగి, వారి వస్త్రాలను, చేతికుట్టుతో చేసిన వస్త్రాలను తీసివేసి, భయంతో నేలపై కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి ఆందోళన చెందుతారు.

  7. యెహెజ్కేలు 26:17సుమారు క్రీ.పూ. 588

    నీ గురించి విలాప గీతం ఎత్తి ఇలా పాడతారు: “ ‘సముద్ర ప్రజలతో నిండిన గొప్ప పట్టణమా! నీవెలా నాశనమైపోయావు! నీవు నీ నివాసులు సముద్రాల మీద బలవంతులుగా ఉన్నారు, అక్కడ నివసించిన వారందరిపై నీవు నీ భయాన్ని ఉంచావు.

  8. యెహెజ్కేలు 26:18సుమారు క్రీ.పూ. 588

    ఇప్పుడు నీవు కూలిపోయిన రోజున తీరప్రాంతాలు కంపిస్తున్నాయి. నీవు పతనాన్ని చూసి సముద్ర ద్వీపాలు భయపడుతున్నాయి.’

  9. యెహెజ్కేలు 26:19సుమారు క్రీ.పూ. 588

    “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నివాసులు లేని పట్టణాల్లా నిన్ను నేను నిర్మానుష్యంగా మార్చినప్పుడు, నిన్ను మహా సముద్రం ముంచివేసేలా నీ మీదికి అగాధ జలాలను రప్పిస్తాను. నిన్ను మహా సముద్రం నిన్ను ముంచివేస్తున్నప్పుడు,

  10. యెహెజ్కేలు 26:20సుమారు క్రీ.పూ. 588

    చాలా కాలం క్రితం పాతాళంలోకి దిగి వెళ్లిన వారి దగ్గరకు నేను నిన్ను పడవేస్తాను. నేను నిన్ను భూమి క్రింద ఉన్న స్థలంలో ప్రాచీన శిథిలాల మధ్య పాతాళంలోకి దిగి వెళ్లిన వారితో నివసించేలా చేస్తాను, అప్పుడు నీవు సజీవులు నివసించే చోటికి తిరిగి రావు.

  11. యెహెజ్కేలు 26:21సుమారు క్రీ.పూ. 588

    నేను నీకు భయంకరమైన ముగింపు ఇస్తాను, నీవు ఇకపై ఉండవు. నీ గురించి ఎంత వెదికినా నీవు ఎప్పటికీ కనిపించవు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”

  12. యెహెజ్కేలు 27:1సుమారు క్రీ.పూ. 588

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  13. యెహెజ్కేలు 27:2సుమారు క్రీ.పూ. 588

    “మనుష్యకుమారుడా, తూరు పట్టణం గురించి విలాప గీతం పాడు:

  14. యెహెజ్కేలు 27:3సుమారు క్రీ.పూ. 588

    సముద్ర ద్వారం దగ్గర ఉన్న తూరుతో చెప్పు, అనేక తీర ప్రాంతాల ప్రజలకు వ్యాపారిగా ఉన్న తూరుతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘తూరూ, నీవంటావు, “అందంలో నేను పరిపూర్ణమైన దానిని.”

  15. యెహెజ్కేలు 27:4సుమారు క్రీ.పూ. 588

    నీ సరిహద్దులు సముద్రం మధ్యలో ఉన్నాయి; నీ భవన నిర్మాణకులు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు.

  16. యెహెజ్కేలు 27:5సుమారు క్రీ.పూ. 588

    శెనీరు దేశపు సరళ పలకలతో వారు నీ ఓడలు తయారుచేస్తారు; లెబానోను దేవదారు చెక్కతో వారు ఓడ స్తంభాలు తయారుచేస్తారు.

  17. యెహెజ్కేలు 27:6సుమారు క్రీ.పూ. 588

    బాషాను సింధూర చెక్కతో వారు నీ తెడ్లు తయారుచేస్తారు. కుప్ర తీరం నుండి తెచ్చిన తమాల కలపతో వారు నీకు పీటలు తయారుచేసి ఏనుగు దంతంతో అలంకరించారు.

  18. యెహెజ్కేలు 27:7సుమారు క్రీ.పూ. 588

    ఈజిప్టు నుండి వచ్చిన కుట్టుపని చేసిన సన్నని నార నీ తెరచాపగా జెండాగా పని చేశాయి; ఎలీషా తీరాల నుండి తెచ్చిన నీలం ఊదా రంగుల బట్ట నీ అంతస్తుల పైకప్పులు.

  19. యెహెజ్కేలు 27:8సుమారు క్రీ.పూ. 588

    తూరూ, సీదోను వారు అర్వాదు వారు నీ తెడ్లు వేసేవారు; నీ మనుష్యుల్లో నిపుణులైనవారు నీ నావికులు.

  20. యెహెజ్కేలు 27:9సుమారు క్రీ.పూ. 588

    నీ ఓడను బాగుచేయడానికి గెబాలుకు చెందిన పెద్దలు, అనుభవజ్ఞులైన చేతి పనివారు ఉన్నారు. సముద్రంలో నీ వస్తువులు కొనడానికి, సముద్రపు నావికుల ఓడలన్నీ నీ రేవులో ఉన్నాయి.

  21. యెహెజ్కేలు 27:10సుమారు క్రీ.పూ. 588

    “ ‘పర్షియా మనుష్యులారా, లిడియా, పూతుకు చెందినవారు నీ సైన్యంలో సైనికులుగా పని చేశారు. వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీసి, నీకు వైభవాన్ని తెస్తున్నారు.

  22. యెహెజ్కేలు 27:11సుమారు క్రీ.పూ. 588

    అర్వాదు వారు, హెలెకు వారు అన్నివైపులా నీ గోడలకు కాపలా కాసారు; గమ్మాదీయులు నీ గోపురాలలో ఉన్నారు. వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీశారు; వారు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు.

  23. యెహెజ్కేలు 27:12సుమారు క్రీ.పూ. 588

    “ ‘నీ గొప్ప సంపదను బట్టి తర్షీషు వారు నీతో వ్యాపారం చేశారు; వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి మీ సరుకు తీసుకున్నారు.

  24. యెహెజ్కేలు 27:13సుమారు క్రీ.పూ. 588

    “ ‘గ్రీసు, తుబాలు, మెషెకు వారు నీతో వ్యాపారం చేశారు; మనుష్యులను, ఇత్తడి వస్తువులను ఇచ్చి మీ వస్తువులను కొన్నారు.

  25. యెహెజ్కేలు 27:14సుమారు క్రీ.పూ. 588

    “ ‘బేత్ తోగర్మా వారు మీ సరుకు కోసం రథ గుర్రాలు, అశ్వికదళ గుర్రాలు కంచరగాడిదలను ఇచ్చారు.