కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 28:4సుమారు క్రీ.పూ. 588

    నీకున్న జ్ఞానంతో వివేకంతో నీకోసం సంపద సంపాదించుకుని నీ ఖజానాలో వెండి బంగారాలను పోగు చేసుకున్నావు.

  2. యెహెజ్కేలు 28:5సుమారు క్రీ.పూ. 588

    వ్యాపారంలో నీకున్న గొప్ప నైపుణ్యంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు, నీ సంపదను బట్టి నీవు హృదయంలో గర్వించావు.

  3. యెహెజ్కేలు 28:6సుమారు క్రీ.పూ. 588

    “ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: “ ‘దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు కాబట్టి,

  4. యెహెజ్కేలు 28:7సుమారు క్రీ.పూ. 588

    నేను నీమీదికి విదేశీయులను, అత్యంత క్రూరులైన జనాంగాలను రప్పించబోతున్నాను; నీ జ్ఞానంతో నీవు సౌందర్యంగా నిర్మించుకున్న వాటి మీద ఖడ్గాన్ని దూసి, నీ వైభవాన్ని ద్వంసం చేస్తారు.

  5. యెహెజ్కేలు 28:8సుమారు క్రీ.పూ. 588

    వారు నిన్ను పాతాళంలో పడవేస్తారు. సముద్రం మధ్యలో భయంకరంగా చనిపోతావు.

  6. యెహెజ్కేలు 28:9సుమారు క్రీ.పూ. 588

    నిన్ను చంపేవారి ఎదుట “నేను దేవుడిని” అని చెప్తావా? నిన్ను చంపేవారి చేతుల్లో నీవు మనిషివే కాని దేవుడవు కావు.

  7. యెహెజ్కేలు 28:10సుమారు క్రీ.పూ. 588

    సున్నతిలేనివారు చనిపోయినట్లు నీవు విదేశీయుల చేతిలో చస్తావు అని చెప్పింది నేనే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

  8. యెహెజ్కేలు 28:11సుమారు క్రీ.పూ. 588

    యెహోవా వాక్కు నాకు వచ్చి:

  9. యెహెజ్కేలు 28:12సుమారు క్రీ.పూ. 588

    “మనుష్యకుమారుడా, తూరు రాజు గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘నీవు పరిపూర్ణతకు ముద్రగా, జ్ఞానంతో నిండి ఎంతో అందంగా ఉండేవాడివి.

  10. యెహెజ్కేలు 28:13సుమారు క్రీ.పూ. 588

    దేవుని తోటయైన, ఏదెనులో నీవు ఉండేవాడివి; ప్రతి ప్రశస్తమైన రాయితో నీవు అలంకరించబడ్డావు. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని, మరకతం, నీలమణి, పద్మరాగం, అన్ని బంగారంతో నీకోసం తయారుచేయబడ్డాయి; నీవు సృజించబడిన రోజున అవి నీకోసం సిద్ధపరచబడ్డాయి.

  11. యెహెజ్కేలు 28:14సుమారు క్రీ.పూ. 588

    అభిషేకం పొందిన కావలి కెరూబులా నేను నిన్ను నియమించాను దేవుని పరిశుద్ధ పర్వతం మీద నీవున్నావు. నీవు కాలుతున్న రాళ్ల మధ్య నడిచావు.

  12. యెహెజ్కేలు 28:15సుమారు క్రీ.పూ. 588

    నీవు సృష్టించబడిన రోజు నుండి నీలో దుష్టత్వం కనిపించిన రోజు వరకు నీ ప్రవర్తన నిందారహితంగా ఉంది.

  13. యెహెజ్కేలు 28:16సుమారు క్రీ.పూ. 588

    అయితే నీ వ్యాపారం విస్తరించి నీవు హింసతో నిండిపోయి పాపం చేశావు. కాబట్టి నేను నిన్ను అపవిత్రపరచి దేవుని పర్వతం మీద ఉండకుండా వెళ్లగొట్టాను, కావలి కెరూబుల కాలుతున్న రాళ్ల మధ్య నీవిక ఉండకుండా నిన్ను నాశనం చేస్తాను.

  14. యెహెజ్కేలు 28:17సుమారు క్రీ.పూ. 588

    నీ సౌందర్యం చూసుకుని నీ హృదయం గర్వించింది నీ వైభవం కారణంగా నీ జ్ఞానం కలుషితమయ్యింది, కాబట్టి నేను నిన్ను భూమి మీద పడవేస్తాను. రాజులు నిన్ను చూసేలా నేను నిన్ను వారి ఎదుట ఉంచుతాను.

  15. యెహెజ్కేలు 28:18సుమారు క్రీ.పూ. 588

    నీ అన్యాయమైన వ్యాపారంతో నీవు చేసిన అనేక పాపాల వలన, నీ పరిశుద్ధాలయాలను అపవిత్రం చేశావు. కాబట్టి నీలో అగ్ని పుట్టిస్తాను. అది నిన్ను కాల్చివేస్తుంది, చూస్తున్న వారందరి ఎదుట నేను నిన్ను నేల మీద బూడిదగా చేస్తాను.

  16. యెహెజ్కేలు 28:19సుమారు క్రీ.పూ. 588

    నిన్ను ఎరిగిన జనులంతా నిన్ను బట్టి వణికిపోతారు; నీవు భయానక ముగింపుకు వచ్చావు నీవు పూర్తిగా నాశనమైపోతావు.’ ”

  17. యెహెజ్కేలు 28:20సుమారు క్రీ.పూ. 588

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  18. యెహెజ్కేలు 28:21సుమారు క్రీ.పూ. 588

    “మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు త్రిప్పుకుని దాని గురించి ప్రవచించి ఇలా చెప్పు:

  19. యెహెజ్కేలు 28:22సుమారు క్రీ.పూ. 588

    ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్య నేను ఘనత పొందుతాను. నేను నీకు శిక్ష విధించి నీలో నా పరిశుద్ధతను కనుపరిచినప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.

  20. యెహెజ్కేలు 28:23సుమారు క్రీ.పూ. 588

    పట్టణం మీదికి తెగులు పంపించి నీ వీధుల్లో రక్తం పారేలా చేస్తాను. అన్ని వైపుల నుండి నీ మీదికి వచ్చే కత్తివేటుకు వారు చనిపోతారు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.

  21. యెహెజ్కేలు 28:24సుమారు క్రీ.పూ. 588

    “ ‘ఇశ్రాయేలీయుల పొరుగువారు ఇకపై గుచ్చుకుని బాధించే కంపలుగా పదునైన ముళ్ళుగా ఉండరు. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.

  22. యెహెజ్కేలు 28:25సుమారు క్రీ.పూ. 588

    “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ప్రజల్లో చెదరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చినప్పుడు వారి ద్వారా నేను ఆ ప్రజల ఎదుట పరిశుద్ధుడనని రుజువవుతాను. నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన వారి దేశంలో వారు నివసిస్తారు.

  23. యెహెజ్కేలు 28:26సుమారు క్రీ.పూ. 588

    అందులో వారు నిశ్చింతగా నివసించి ఇల్లు కట్టుకుని ద్రాక్షతోటలు నాటతారు. వారిని హింసించిన వారి పొరుగువారందరిని నేను శిక్షించిన తర్వాత వారు నిర్భయంగా నివసిస్తారు. అప్పుడు నేనే తమ దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”

  24. యెహెజ్కేలు 29:1సుమారు క్రీ.పూ. 589

    పదవ సంవత్సరం పదవనెల పన్నెండవ రోజు యెహోవా వాక్కు నాకు వచ్చి:

  25. యెహెజ్కేలు 29:2సుమారు క్రీ.పూ. 589

    “మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని ఈజిప్టు రాజైన ఫరోవైపు త్రిప్పి అతని గురించి ఈజిప్టు దేశమంతటి గురించి ప్రవచించి ఇలా చెప్పు: