కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. పాడైపోయిన దేశాల మధ్య ఈజిప్టువారు దిక్కులేని వారవుతారు. శిథిలమైన పట్టణాల మధ్య వారి పట్టణాలు పడి ఉంటాయి.

  2. ఈజిప్టు దేశంలో అగ్ని రగిలించబడి దాని సహాయకులంతా నలిపివేయబడినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.

  3. “ ‘ఆ రోజున దూతలు నా దగ్గర నుండి ఓడలలో బయలుదేరి నిర్భయంగా ఉన్న కూషును భయపెడతారు. ఈజిప్టుకు తీర్పు తీర్చబడిన రోజున వారికెంతో భయాందోళనలు కలుగుతాయి. అది తప్పనిసరిగా వస్తుంది.

  4. “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘బబులోను రాజైన నెబుకద్నెజరుచేత నేను ఈజిప్టువారి అల్లరిమూకలను అంతం చేస్తాను.

  5. ప్రజల్లో అతి క్రూరులైన తన సైన్యాన్ని తీసుకుని ఆ దేశాన్ని నాశనం చెయ్యడానికి అతడు వస్తాడు. వారు ఈజిప్టు వారిపై తమ ఖడ్గాలు దూసి దేశమంతా శవాలతో నింపుతారు.

  6. నైలు నదిని ఎండిపోయేలా చేసి ఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మేస్తాను. విదేశీయులచేత నేను ఆ దేశాన్ని అందులోని సమస్తాన్ని పాడుచేస్తాను. యెహోవానైన నేనే మాట ఇచ్చాను.

  7. “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘విగ్రహాలను నాశనం చేసి మెంఫిసులో ఒక్క విగ్రహం కూడా మిగలకుండా చేస్తాను. ఈజిప్టు దేశంలో ఒక్క యువరాజు కూడా ఉండడు, ఆ దేశమంతా భయం పుట్టిస్తాను.

  8. పత్రూసు పాడుచేస్తాను, సోయనులో అగ్ని పుట్టిస్తాను తేబేసుకు శిక్ష విధిస్తాను.

  9. ఈజిప్టుకు కోటయైన సీను మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. తేబేసు అల్లరిమూకలను నిర్మూలం చేస్తాను.

  10. ఈజిప్టు దేశంలో మంట పుట్టిస్తాను. సీను వేదనతో మెలికలు తిరుగుతుంది. తేబేసు తుఫాను తాకిడికి చిన్నాభిన్నం అవుతుంది; మెంఫిసు నిరంతరం బాధలో ఉంటుంది.

  11. హెలియోపొలిస్, పీ-బెసెతు యువకులు కత్తివేటుకు కూలిపోతారు, ఆ పట్టణస్థులు బందీలవుతారు.

  12. ఈజిప్టు కాడిని నేను విరిచినప్పుడు తహ్పన్హేసులో పగలే చీకటి కమ్ముతుంది; దాని బల గర్వం అణచివేయబడుతుంది. దానిని మబ్బులు క్రమ్ముతాయి దాని కుమార్తెలు బందీగా వెళ్తారు.

  13. కాబట్టి నేను ఈజిప్టువారికి శిక్ష విధిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”

  14. యెహెజ్కేలు 30:20సుమారు క్రీ.పూ. 588

    పదకొండవ సంవత్సరం మొదటి నెల ఏడవ రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:

  15. యెహెజ్కేలు 30:21సుమారు క్రీ.పూ. 588

    “మనుష్యకుమారుడా, నేను ఈజిప్టు రాజైన ఫరో చేతిని విరగ కొట్టాను. అది బాగవ్వడానికి ఎవరూ దానికి కట్టు కట్టరు, అది కత్తి పట్టుకోడానికి కావలసినంత బలంగా మారడానికి బద్దపెట్టి కట్టరు.

  16. యెహెజ్కేలు 30:22సుమారు క్రీ.పూ. 588

    కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని అయ్యాను. బాగా ఉన్న చేతిని విరిగిపోయిన చేతిని రెండింటిని నేను విరగ్గొట్టి అతని చేతిలో నుండి కత్తి పడిపోయేలా చేస్తాను.

  17. యెహెజ్కేలు 30:23సుమారు క్రీ.పూ. 588

    ఈజిప్టువారిని ఇతర జనాంగాల్లోకి చెదరగొట్టి వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను.

  18. యెహెజ్కేలు 30:24సుమారు క్రీ.పూ. 588

    నేను బబులోను రాజు చేతులను బలపరచి నా ఖడ్గాన్ని అతని చేతికి అందిస్తాను. నేను ఫరో చేతులను విరగ్గొట్టినప్పుడు బబులోను రాజు ఎదుట చావు దెబ్బ తిన్నవానిలా అతడు మూల్గుతాడు.

  19. యెహెజ్కేలు 30:25సుమారు క్రీ.పూ. 588

    నేను బబులోను రాజు చేతులను బలపరుస్తాను, కాని ఫరో చేతులు చచ్చుబడిపోతాయి. ఈజిప్టు దేశం మీద ఆడించడానికి నేను నా ఖడ్గాన్ని బబులోను రాజు చేతికి ఇచ్చినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.

  20. యెహెజ్కేలు 30:26సుమారు క్రీ.పూ. 588

    ఈజిప్టువారిని ఇతర ప్రజల్లో చెదరగొట్టి వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”

  21. యెహెజ్కేలు 31:1సుమారు క్రీ.పూ. 588

    పదకొండవ సంవత్సరం మూడవ నెల మొదటి తేది యెహోవా వాక్కు నాకు వచ్చి:

  22. యెహెజ్కేలు 31:2సుమారు క్రీ.పూ. 588

    “మనుష్యకుమారుడా, నీవు ఈజిప్టు రాజైన ఫరోతో అతని పరివారంతో ఇలా చెప్పు: “ ‘ఘనతలో నీకు సాటి ఎవరు?

  23. యెహెజ్కేలు 31:3సుమారు క్రీ.పూ. 588

    అష్షూరును చూడు, ఒకప్పుడు లెబానోను దేవదారులా, అందమైన కొమ్మలతో అడవిలా ఉండేది; దాని చిటారు కొమ్మ మిగతా చెట్ల కన్నా ఎత్తుగా ఉండేది.

  24. యెహెజ్కేలు 31:4సుమారు క్రీ.పూ. 588

    సమృద్ధియైన జలాలు దానిని పోషించాయి, లోతైన నీటి ఊటలు దానిని ఎత్తుగా పెరిగేలా చేశాయి; వాటి ప్రవాహాలు దాని మొదలు చుట్టూ ప్రవహించాయి, పొలంలో ఉన్న చెట్లన్నిటికి దాని కాలువలు నీరు అందించాయి.

  25. యెహెజ్కేలు 31:5సుమారు క్రీ.పూ. 588

    కాబట్టి పొలం లోని చెట్లన్నిటి కన్నా ఆ చెట్టు ఎత్తుగా ఎదిగింది; నీరు సమృద్ధిగా ఉన్నందున, దాని కొమ్మలు విస్తరించి, పెద్ద శాఖలుగా ఎదిగాయి.