కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 27:15సుమారు క్రీ.పూ. 588

    “ ‘దేదాను వారు నీతో వ్యాపారం చేశారు, చాలా తీర ప్రాంతాల ప్రజలు నీ సరుకు కొన్నారు; వారు మీకు దంతపు దంతాలు, తునికి కలప ఇచ్చారు.

  2. యెహెజ్కేలు 27:16సుమారు క్రీ.పూ. 588

    “ ‘నీ దగ్గర ఉన్న అనేక వస్తువుల కారణంగా అరామీయులు నీతో వ్యాపారం చేశారు. వారు పచ్చరాళ్లను, ఊదా రంగు నూలుతో కుట్టుపని చేసిన వస్త్రాలు, సన్నని నారబట్టలు, కెంపులు రత్నాలు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.

  3. యెహెజ్కేలు 27:17సుమారు క్రీ.పూ. 588

    “ ‘యూదా వారు, ఇశ్రాయేలీయులు నీతో వ్యాపారం చేశారు. వారు మిన్నీతు గోధుమలు, మిఠాయిలు, తేనె, ఒలీవనూనె ఇచ్చి నీ సరుకు కొన్నారు.

  4. యెహెజ్కేలు 27:18సుమారు క్రీ.పూ. 588

    “ ‘దమస్కు నీ దగ్గర అనేక వస్తువులు విలువైన సరుకు ఉన్న కారణంగా నీతో వ్యాపారం చేసింది. వారు హెల్బోను నుండి ద్రాక్షరసం, జహరు నుండి ఉన్ని,

  5. యెహెజ్కేలు 27:19సుమారు క్రీ.పూ. 588

    వారు ఇజాలు నుండి ద్రాక్షరసం పీపాలు ఇచ్చి, అచ్చుపోసిన ఇనుము, లవంగపట్ట, వోమ ఇచ్చి మీ సరుకులు కొన్నారు.

  6. యెహెజ్కేలు 27:20సుమారు క్రీ.పూ. 588

    “ ‘దేదాను వారు నీతో జీను దుప్పట్ల వ్యాపారం చేశారు.

  7. యెహెజ్కేలు 27:21సుమారు క్రీ.పూ. 588

    “ ‘అరేబియా వారు కేదారు యువరాజులందరూ నీతో వ్యాపారం చేశారు. గొర్రెపిల్లలు పొట్టేళ్లు మేకలు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.

  8. యెహెజ్కేలు 27:22సుమారు క్రీ.పూ. 588

    “ ‘షేబ రాయమా వర్తకులు నీతో వ్యాపారం చేశారు. అన్ని రకాల సుగంధద్రవ్యాలు విలువైన రాళ్లు బంగారం ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.

  9. యెహెజ్కేలు 27:23సుమారు క్రీ.పూ. 588

    “ ‘హారాను వారు కన్నెహు వారు ఏదెను వారు షేబ వర్తకులు అష్షూరు కిల్మదు వర్తకులు నీతో వ్యాపారం చేశారు.

  10. యెహెజ్కేలు 27:24సుమారు క్రీ.పూ. 588

    వారు వ్యాపారం చేసి అందమైన వస్త్రాలు, నీలం బట్టలు, కుట్టుపని చేసిన బట్టలు, తివాచీలు బాగా పేనిన గట్టి త్రాళ్లు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.

  11. యెహెజ్కేలు 27:25సుమారు క్రీ.పూ. 588

    “ ‘తర్షీషు ఓడలు నీ సరుకులు మోసుకెళ్లేవి. నీవు విస్తారమైన సరుకులతో సముద్రం మీద కూర్చున్నావు.

  12. యెహెజ్కేలు 27:26సుమారు క్రీ.పూ. 588

    నీ తెడ్లు నడిపేవారు మహా సముద్రంలోకి నిన్ను తీసుకెళ్లారు. కాని తూర్పు గాలి వీచి సముద్రం మధ్యలో నిన్ను నాశనం చేస్తుంది.

  13. యెహెజ్కేలు 27:27సుమారు క్రీ.పూ. 588

    అప్పుడు నీ సంపద, సరుకులు వస్తువులు, నీ నావికులు, ఓడ నాయకులు నీ ఓడలు బాగుచేసేవారు, నీ వ్యాపారులు నీ సైనికులందరూ, నీతో ఉన్న ప్రతి ఒక్కరూ నీ ఓడ ధ్వంసమైన రోజున సముద్రం మధ్యలో మునిగిపోతారు.

  14. యెహెజ్కేలు 27:28సుమారు క్రీ.పూ. 588

    నీ నావికులు వేసే కేకలకు తీరప్రాంతాలు కంపిస్తాయి.

  15. యెహెజ్కేలు 27:29సుమారు క్రీ.పూ. 588

    తెడ్డు నడిపే వారందరూ నావికులు, ఓడ నాయకులు తమ ఓడల మీద నుండి దిగివచ్చి తీరాన నిలబడతారు.

  16. యెహెజ్కేలు 27:30సుమారు క్రీ.పూ. 588

    వారంతా గొంతెత్తి నీ గురించి ఏడుస్తారు; తమ తలలపై బూడిద చల్లుకుని బూడిదలో దొర్లుతారు.

  17. యెహెజ్కేలు 27:31సుమారు క్రీ.పూ. 588

    నీ గురించి వారు తమ తలలు గొరిగించుకుని గోనెపట్టలు కట్టుకుని తీవ్రమైన దుఃఖంతో నీ గురించి ఏడుస్తారు;

  18. యెహెజ్కేలు 27:32సుమారు క్రీ.పూ. 588

    వారు నీ గురించి ఏడుస్తూ విలాప గీతం పాడతారు: “సముద్రం మధ్యలో మునిగిపోయిన తూరు పట్టణమా! నీకు సాటియైన పట్టణమేదీ?”

  19. యెహెజ్కేలు 27:33సుమారు క్రీ.పూ. 588

    సముద్రం మీద నీ వస్తువులు తీసుకెళ్తూ, అనేకమందిని తృప్తిపరిచావు; నీ విస్తారమైన సంపదతో నీ వ్యాపార వస్తువులతో భూరాజులను ఐశ్వర్యవంతులను చేశావు.

  20. యెహెజ్కేలు 27:34సుమారు క్రీ.పూ. 588

    ఇప్పుడు లోతైన జలాల్లో మునిగి సముద్రంలో నాశనమయ్యావు; నీ వస్తువులు నీ సహచరులు నీతో పాటే మునిగిపోయారు.

  21. యెహెజ్కేలు 27:35సుమారు క్రీ.పూ. 588

    తీరప్రాంతాలలో ఉన్నవారంతా నీ గురించి దిగులుపడతారు; వారి రాజులు వణకుతారు. వారి ముఖాలు చిన్నబోయాయి.

  22. యెహెజ్కేలు 27:36సుమారు క్రీ.పూ. 588

    వివిధ ప్రజల మధ్యలో వర్తకులు నిన్ను ఎగతాళి చేస్తారు. నీవు భయంకరమైన ముగింపుకు వచ్చావు, పూర్తిగా నాశనం అవుతావు.’ ”

  23. యెహెజ్కేలు 28:1సుమారు క్రీ.పూ. 588

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  24. యెహెజ్కేలు 28:2సుమారు క్రీ.పూ. 588

    “మనుష్యకుమారుడా, తూరు పాలకునితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘గర్వించిన హృదయంతో నీవు, “నేనొక దేవుడిని; సముద్రం మధ్యలో ఒక దేవుని సింహాసనం మీద నేను కూర్చున్నాను” అని అన్నావు. దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు, కాని నీవు కేవలం ఒక మనిషివి మాత్రమే దేవునివి కాదు.

  25. యెహెజ్కేలు 28:3సుమారు క్రీ.పూ. 588

    నీవు దానియేలు కన్నా జ్ఞానివా? నీకు తెలియని రహస్యం ఏదీ లేదా?