కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 20:41సుమారు క్రీ.పూ. 593

    ఇతర ప్రజల నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మీరు చెదరిపోయిన ఆయా దేశాల్లో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ ధూపంలా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. ఇతర ప్రజల ఎదుట మీ మధ్య నన్ను నేను పరిశుద్ధ పరుచుకుంటాను.

  2. యెహెజ్కేలు 20:42సుమారు క్రీ.పూ. 593

    మీ పూర్వికులకు ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశమైన ఇశ్రాయేలీయుల దేశానికి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.

  3. యెహెజ్కేలు 20:43సుమారు క్రీ.పూ. 593

    అక్కడ మీరు మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకున్న పనులన్నిటిని జ్ఞాపకం చేసుకుని మీరు చేసిన చెడు అంతటిని బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.

  4. యెహెజ్కేలు 20:44సుమారు క్రీ.పూ. 593

    ఇశ్రాయేలీయులారా! మీ దుర్మార్గాన్ని బట్టి మీ చెడు పనులను బట్టి కాకుండా నా నామాన్ని బట్టే మీకు ఇలా చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

  5. యెహెజ్కేలు 20:45సుమారు క్రీ.పూ. 593

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  6. యెహెజ్కేలు 20:46సుమారు క్రీ.పూ. 593

    “మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని దక్షిణం వైపు త్రిప్పుకుని దక్షిణ దేశానికి ప్రకటించు; దక్షిణ అరణ్యాన్ని గురించి ప్రవచించు.

  7. యెహెజ్కేలు 20:47సుమారు క్రీ.పూ. 593

    దక్షిణ అరణ్యంలో ఇలా చెప్పు: ‘యెహోవా మాట విను. ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను నీలో అగ్ని రాజేస్తాను. అది నీలో ఉన్న పచ్చని చెట్లను ఎండిన చెట్లను అన్నిటిని కాల్చివేస్తుంది. ఆ అగ్ని ఆరిపోదు. దక్షిణ దిక్కునుండి ఉత్తరదిక్కు వరకు భూతలమంతా కాలిపోతుంది.

  8. యెహెజ్కేలు 20:48సుమారు క్రీ.పూ. 593

    ఆ అగ్నిని రగిలించింది యెహోవానైన నేనేనని అందరు తెలుసుకుంటారు; దాన్ని ఎవరూ ఆర్పలేరు.’ ”

  9. యెహెజ్కేలు 20:49సుమారు క్రీ.పూ. 593

    అప్పుడు నేను ఇలా అన్నాను, “ప్రభువైన యెహోవా, వారు నా గురించి, ‘ఇతడు కేవలం ఉపమానాలు చెప్పేవాడే కదా?’ అని అంటున్నారు.”

  10. యెహెజ్కేలు 21:1సుమారు క్రీ.పూ. 593

    అప్పుడు యెహోవా వాక్కు నాకు వచ్చి:

  11. యెహెజ్కేలు 21:2సుమారు క్రీ.పూ. 593

    “మనుష్యకుమారుడా, యెరూషలేము వైపు నీ ముఖం త్రిప్పుకుని పరిశుద్ధాలయం గురించి ఇశ్రాయేలు దేశాన్ని గురించి ప్రవచించి ఇలా చెప్పు:

  12. యెహెజ్కేలు 21:3సుమారు క్రీ.పూ. 593

    యెహోవా ఇలా చెప్తున్నారు: ‘ఓ ఇశ్రాయేలూ, నేను నీకు విరోధంగా ఉన్నాను. ఒర నుండి నా ఖడ్గాన్ని దూసి నీలో ఉన్న నీతిమంతులను, దుర్మార్గులను హతమారుస్తాను.

  13. యెహెజ్కేలు 21:4సుమారు క్రీ.పూ. 593

    నీతిమంతులను, దుర్మార్గులను చంపబోతున్నాను కాబట్టి, దక్షిణం నుండి ఉత్తరం వరకు వారందరినీ చంపే వరకు నా ఖడ్గం ఒరలో పెట్టబడదు.

  14. యెహెజ్కేలు 21:5సుమారు క్రీ.పూ. 593

    అప్పుడు యెహోవానైన నేనే నా ఖడ్గాన్ని మళ్ళీ ఒరలో పెట్టకుండా దూసానని ప్రజలందరూ తెలుసుకుంటారు.’

  15. యెహెజ్కేలు 21:6సుమారు క్రీ.పూ. 593

    “కాబట్టి మనుష్యకుమారుడా, మూల్గు! నీ విరిగిన మనస్సుతో తీవ్రమైన దుఃఖంతో వారి ముందు మూలుగు.

  16. యెహెజ్కేలు 21:7సుమారు క్రీ.పూ. 593

    ‘నీవెందుకు మూల్గుతున్నావు?’ అని వారు అడిగినప్పుడు, నీవు వారితో, ‘శ్రమ దినం వస్తుందనే భయంకరమైన వార్త నాకు వినబడింది! ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది, ప్రతి చేయి బలహీనం అవుతుంది. ప్రతి ఆత్మ సొమ్మసిల్లుతుంది, ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది’ అని చెప్తావు. అది వస్తోంది! అది తప్పక జరుగుతుందని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”

  17. యెహెజ్కేలు 21:8సుమారు క్రీ.పూ. 593

    మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  18. యెహెజ్కేలు 21:9సుమారు క్రీ.పూ. 593

    “మనుష్యకుమారుడా, నీవు ప్రవచించి ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం పదును పెట్టబడి మెరుగు పెట్టబడింది.

  19. యెహెజ్కేలు 21:10సుమారు క్రీ.పూ. 593

    వధించడానికి పదును పెట్టబడింది, మెరుపులా మెరిసేలా మెరుగు పెట్టబడింది! “ ‘నా కుమారుని రాజదండాన్ని బట్టి మనం సంతోషిద్దామా? అలాంటి ప్రతి దండాన్ని ఆ ఖడ్గం తృణీకరిస్తుంది.

  20. యెహెజ్కేలు 21:11సుమారు క్రీ.పూ. 593

    “ ‘ఆ ఖడ్గం మెరుగుపరచడానికి, చేతితో పట్టుకోడానికి నియమించబడింది; హతం చేసేవాడు పట్టుకోడానికి, అది పదును పెట్టబడి, మెరుగు పెట్టబడి సిద్ధంగా ఉంది.

  21. యెహెజ్కేలు 21:12సుమారు క్రీ.పూ. 593

    మనుష్యకుమారుడా, మొరపెట్టు, రోదించు ఆ ఖడ్గం నా ప్రజలమీదికి ఇశ్రాయేలు అధిపతులందరి మీదికి వస్తున్నది. నా ప్రజలతో పాటు వారు కూడా ఖడ్గంతో చంపబడతారు. కాబట్టి నీ రొమ్ము కొట్టుకో.

  22. యెహెజ్కేలు 21:13సుమారు క్రీ.పూ. 593

    “ ‘పరీక్ష తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఖడ్గం తృణీకరించిన రాజదండం కూడా కొనసాగకపోతే ఎలా? అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’

  23. యెహెజ్కేలు 21:14సుమారు క్రీ.పూ. 593

    “కాబట్టి మనుష్యకుమారుడా, ప్రవచించు, నీ రెండు చేతులతో చప్పట్లు కొట్టు. ఖడ్గం రెండు సార్లు దాడి చేయును గాక మూడుసార్లు అయినా దాడి చేయును గాక. అది వధ కొరకైన ఖడ్గం, మహా వధ కొరకైన ఖడ్గం, అన్ని వైపుల నుండి వారి మీద దాడి చేస్తుంది.

  24. యెహెజ్కేలు 21:15సుమారు క్రీ.పూ. 593

    తద్వార వారి హృదయాలు భయంతో కరిగిపోవును గాక, చాలామంది హతమవుదురు గాక, వారి గుమ్మాలన్నిటి దగ్గర నేను ఖడ్గాన్ని నిలబెట్టాను. చూడండి! అది తళతళ మెరుస్తూ ఉంది, అది వధ కోసం దూయబడింది.

  25. యెహెజ్కేలు 21:16సుమారు క్రీ.పూ. 593

    ఖడ్గమా! కుడివైపు వేటు వేయి, తర్వాత ఎడమవైపు వేటు వేయి. ఎటువైపు త్రిప్పబడితే అటు వేటు వేయి.