కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 19:5సుమారు క్రీ.పూ. 594

    “ ‘అది చూసిన దాని తల్లి తన ఆశ నిరాశ అయ్యిందని తన పిల్లల్లో మరో దానిని తీసుకుని బలమైన సింహంగా తయారుచేసింది.

  2. యెహెజ్కేలు 19:6సుమారు క్రీ.పూ. 594

    ఇది కూడా కొదమ సింహమై, మిగిలిన కొదమ సింహాలతో పాటు తిరుగుతూ వేటాడడం నేర్చుకొని మనుష్యులను తినే జంతువుగా మారింది.

  3. యెహెజ్కేలు 19:7సుమారు క్రీ.పూ. 594

    అది వారి బలమైన కోటలను పడగొట్టి వారి పట్టణాలను పాడుచేసింది. దాని గర్జన విని దేశంతో పాటు దేశంలో ఉన్నదంతా పాడైపోయింది.

  4. యెహెజ్కేలు 19:8సుమారు క్రీ.పూ. 594

    నాలుగు వైపుల ఉన్న దేశాల ప్రజలందరూ దానిని పట్టుకోవడానికి వచ్చి దాని కోసం తమ వలలు పన్ని తమ గోతిలో దానిని చిక్కించుకున్నారు.

  5. యెహెజ్కేలు 19:9సుమారు క్రీ.పూ. 594

    దానికి గాలం తగిలించి బోనులో పెట్టి బబులోను రాజు దగ్గరకు దానిని తీసుకెళ్లారు. ఇశ్రాయేలీయుల పర్వతాలమీద దాని గర్జన ఎన్నటికీ వినబడకుండా వారు దానిని చెరసాలలో ఉంచారు.

  6. యెహెజ్కేలు 19:10సుమారు క్రీ.పూ. 594

    “ ‘నీ తల్లి నీ ద్రాక్షతోటలో నీటి ప్రక్కన నాటబడిన ద్రాక్షవల్లిలాంటిది; నీరు సమృద్ధిగా ఉన్నందున అది ఫలించి అనేక కొమ్మలతో నిండి ఉంది.

  7. యెహెజ్కేలు 19:11సుమారు క్రీ.పూ. 594

    పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన బలమైన కొమ్మలు దానికున్నాయి. అది మేఘాలను తాకే అంతగా పైకి పెరిగింది దానికున్న అనేక కొమ్మలతో ఏపుగా పెరిగింది.

  8. యెహెజ్కేలు 19:12సుమారు క్రీ.పూ. 594

    అయితే మహా కోపంతో అది పెరికి వేయబడి నేల మీద పారవేయబడింది. తూర్పు గాలి వీచగా దాని పండ్లు వాడిపోయాయి; బలమైన దాని కొమ్మలు అగ్నిలో పడి కాలిపోయాయి.

  9. యెహెజ్కేలు 19:13సుమారు క్రీ.పూ. 594

    ఇప్పుడది అరణ్యంలో పూర్తిగా ఎండిపోయిన నీళ్లు లేని ఎడారిలో నాటబడింది.

  10. యెహెజ్కేలు 19:14సుమారు క్రీ.పూ. 594

    దాని కొమ్మల్లో నుండి అగ్ని వ్యాపించి దాని పండ్లను కాల్చివేసింది. పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన బలమైన కొమ్మ ఒక్కటి కూడా మిగల్లేదు.’ ఇదే విలాప వాక్యం; దీనినే విలాప గీతంగా పాడతారు.”

  11. యెహెజ్కేలు 20:1సుమారు క్రీ.పూ. 593

    ఏడవ సంవత్సరం అయిదవ నెల పదవ రోజున ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహోవాను సంప్రదించడానికి నా దగ్గరకు వచ్చి నా ఎదుట కూర్చున్నారు.

  12. యెహెజ్కేలు 20:2సుమారు క్రీ.పూ. 593

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  13. యెహెజ్కేలు 20:3సుమారు క్రీ.పూ. 593

    “మనుష్యకుమారుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నన్ను సంప్రదించడానికి మీరు వచ్చారా? నా జీవం తోడు, నేను మీకే ఆలోచన చెప్పను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’

  14. యెహెజ్కేలు 20:4సుమారు క్రీ.పూ. 593

    “వారికి న్యాయం తీరుస్తావా? మనుష్యకుమారుడా, వారికి న్యాయం తీరుస్తావా? వారి పూర్వికులు చేసిన అసహ్యమైన ఆచారాలు వారికి తెలియజేసి,

  15. యెహెజ్కేలు 20:5సుమారు క్రీ.పూ. 593

    వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను ఇశ్రాయేలును ఏర్పరచుకున్న రోజున, నేను యాకోబు వారసులకు ప్రమాణం చేసిన రోజున ఈజిప్టులో వారికి నన్ను ప్రత్యక్షపరచుకుని ప్రమాణం చేసి, “మీ దేవుడనైన యెహోవాను నేనే” అని వారికి ప్రకటించాను.

  16. యెహెజ్కేలు 20:6సుమారు క్రీ.పూ. 593

    వారిని ఈజిప్టు దేశంలో నుండి బయటకు తీసుకువచ్చి నేను వారికి ఏర్పాటుచేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అన్ని దేశాల్లో సుందరమైన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రమాణం చేశాను.

  17. యెహెజ్కేలు 20:7సుమారు క్రీ.పూ. 593

    అప్పుడు నేను, “నేనే మీ దేవుడనైన యెహోవాను. మీలో ప్రతివాడు తనకిష్టమైన అసహ్యమైన పనులను విడిచిపెట్టాలి. ఈజిప్టువారి విగ్రహాలను పూజించి అపవిత్రులు కావద్దని వారికి ఆజ్ఞాపించాను.”

  18. యెహెజ్కేలు 20:8సుమారు క్రీ.పూ. 593

    “ ‘అయితే వారు నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేశారు; తమకిష్టమైన అసహ్యమైన పనులు చేయడం మానలేదు, ఈజిప్టువారి విగ్రహాలను పూజించడం మానలేదు. కాబట్టి వారు ఈజిప్టు దేశంలో ఉండగానే నేను నా ఉగ్రతను వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకున్నాను.

  19. యెహెజ్కేలు 20:9సుమారు క్రీ.పూ. 593

    అయితే నా నామం కోసం వారిని ఈజిప్టు నుండి బయటకు రప్పించాను. వారు నివసించిన జనాంగాల దృష్టిలో, ఎవరి ఎదుట నన్ను నేను ఇశ్రాయేలీయులకు బయలుపరచుకున్నానో వారి ఎదుట నా పేరు అపవిత్రం కాకూడదని అలా చేశాను.

  20. యెహెజ్కేలు 20:10సుమారు క్రీ.పూ. 593

    వారిని ఈజిప్టు దేశం నుండి బయటకు రప్పించి అరణ్యంలోకి తీసుకువచ్చి,

  21. యెహెజ్కేలు 20:11సుమారు క్రీ.పూ. 593

    వారికి నా శాసనాలను ఇచ్చి, నా ధర్మశాస్త్రాన్ని వారికి తెలియజేశాను. వాటిని అనుసరించిన మనుష్యులే బ్రతుకుతారు.

  22. యెహెజ్కేలు 20:12సుమారు క్రీ.పూ. 593

    యెహోవానైన నేనే వారిని పవిత్రపరచానని వారు తెలుసుకునేలా, నాకు వారికి మధ్య సూచనగా సబ్బాతులను నియమించాను.

  23. యెహెజ్కేలు 20:13సుమారు క్రీ.పూ. 593

    “ ‘అరణ్యంలో ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి, నా శాసనాలను తృణీకరించి, వాటికి లోబడేవారు బ్రతుకుతారని నేనిచ్చిన నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా నేను నియమించిన సబ్బాతులను పూర్తిగా అపవిత్రం చేశారు. కాబట్టి వారిపై నా ఉగ్రత కుమ్మరించి వారిని అరణ్యంలో నాశనం చేయాలనుకున్నాను.

  24. యెహెజ్కేలు 20:14సుమారు క్రీ.పూ. 593

    అయితే కోసం నేను ఎవరి దృష్టిలో వారిని బయటకు తీసుకువచ్చానో ఆ జాతుల దృష్టిలో నా నామం అపవిత్రం కాకుండా ఉండేందుకు నేను అనుకున్న ప్రకారం చేయలేదు.

  25. యెహెజ్కేలు 20:15సుమారు క్రీ.పూ. 593

    తమకిష్టమైన విగ్రహాలను పూజించాలని నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండ నా శాసనాలను అనుసరించకుండ నా సబ్బాతులను అపవిత్రం చేసినందుకు, నేను వారికి ఇస్తానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, అన్ని దేశాల్లో అతి సుందరమైన దేశంలోనికి నేను వారిని తీసుకురానని వారు అరణ్యంలో ఉండగానే నా చేయి పైకెత్తి వారితో ప్రమాణం చేశాను.