కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 20:16సుమారు క్రీ.పూ. 593

    Because they despised my judgments, and walked not in my statutes, but polluted my sabbaths: for their heart went after their idols.

  2. యెహెజ్కేలు 20:17సుమారు క్రీ.పూ. 593

    అయినా వారి మీద జాలిపడి వారిని నాశనం చేయలేదు, అరణ్యంలోనే వారిని అంతం చేయలేదు.

  3. యెహెజ్కేలు 20:18సుమారు క్రీ.పూ. 593

    వారు అరణ్యంలో ఉన్నప్పుడు నేను వారి పిల్లలతో, “మీ తండ్రుల కట్టడలను పాటించవద్దు; వారి పద్ధతులను అనుసరిస్తూ వారి విగ్రహాలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు.

  4. యెహెజ్కేలు 20:19సుమారు క్రీ.పూ. 593

    మీ దేవుడైన యెహోవాను నేనే; నా శాసనాలను అనుసరిస్తూ నా ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పాటించండి.

  5. యెహెజ్కేలు 20:20సుమారు క్రీ.పూ. 593

    సబ్బాతును పరిశుద్ధంగా పాటించండి; నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా అవి మీకూ నాకు మధ్య సూచనగా ఉంటాయి” అని చెప్పాను.

  6. యెహెజ్కేలు 20:21సుమారు క్రీ.పూ. 593

    “ ‘అయినా వారి పిల్లలు నాపై తిరగబడ్డారు: వారు అనుసరించి బ్రతకాలని చెప్పి నేను ఇచ్చిన నా శాసనాలను వారు పాటించకుండా నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా నా సబ్బాతును అపవిత్రం చేశారు. కాబట్టి వారు అరణ్యంలో ఉండగానే నా ఉగ్రతను వారి మీద కుమ్మరించి కోపాన్ని తీర్చుకోవాలని అనుకున్నాను.

  7. యెహెజ్కేలు 20:22సుమారు క్రీ.పూ. 593

    అయితే నేను ఏ ఇతర ప్రజలమధ్య ప్రత్యక్షమయ్యానో ఏ ఇతర ప్రజల నుండి వారిని బయటకు రప్పించానో ఆ ప్రజలమధ్య నా నామం అపవిత్రపరచబడకుండా నా చేయి వెనుకకు తీసి నా వాగ్దానం నెరవేర్చాను.

  8. యెహెజ్కేలు 20:23సుమారు క్రీ.పూ. 593

    వారు నా ధర్మశాస్త్రానికి లోబడకుండా నా శాసనాలను తృణీకరించి నా సబ్బాతును అపవిత్రపరచి తమ తండ్రులు పెట్టిన విగ్రహాలను పూజించారు, కాబట్టి నేను వారిని ఇతర ప్రజలమధ్య చెదరగొట్టి అన్ని దేశాలకు వారిని చెదరగొడతానని అరణ్యంలో వారికి ప్రమాణం చేశాను.

  9. యెహెజ్కేలు 20:24సుమారు క్రీ.పూ. 593

    Because they had not executed my judgments, but had despised my statutes, and had polluted my sabbaths, and their eyes were after their fathers' idols.

  10. యెహెజ్కేలు 20:25సుమారు క్రీ.పూ. 593

    కాబట్టి నేనే యెహోవానని వారు తెలుసుకునేలా నేను వారికి మంచివి కాని శాసనాలు, వారు బ్రతకడానికి ఉపయోగపడని విధులు ఇచ్చాను;

  11. యెహెజ్కేలు 20:26సుమారు క్రీ.పూ. 593

    వారు తమ మొదటి సంతానాన్ని బలి ఇచ్చి తమను తాము అపవిత్రం చేసుకోనిచ్చాను. నేనే యెహోవానని వారు తెలుసుకునేలా వారిని భయాందోళనలకు గురిచేస్తాను.’

  12. యెహెజ్కేలు 20:27సుమారు క్రీ.పూ. 593

    “కాబట్టి మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ విషయంలో కూడా మీ పూర్వికులు నాకు నమ్మకద్రోహం చేసి నన్ను దూషించారు:

  13. యెహెజ్కేలు 20:28సుమారు క్రీ.పూ. 593

    నేను వారిని ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలోకి నేను వారిని తీసుకువచ్చిన తర్వాత కూడా ఎత్తైన కొండను గాని గుబురుగా ఉన్న చెట్టును గాని వారు చూడగానే వాటికి బలులు అర్పణలు అర్పిస్తూ, పరిమళ ధూపాలను వేస్తూ పానార్పణలు చేస్తూ నాకు కోపం పుట్టించారు.

  14. యెహెజ్కేలు 20:29సుమారు క్రీ.పూ. 593

    అప్పుడు నేను వారితో ఇలా అన్నాను: మీరు వెళ్లే ఈ ఉన్నత స్థలం ఏమిటి?’ ” అని అడిగాను. (ఇప్పటికి అది బామా అనే పిలువబడుతుంది.)

  15. యెహెజ్కేలు 20:30సుమారు క్రీ.పూ. 593

    “కాబట్టి ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీ పూర్వికులు చేసిన విధంగా మీరు కూడా అసహ్యమైన విగ్రహాలతో వ్యభిచారం చేస్తారా?

  16. యెహెజ్కేలు 20:31సుమారు క్రీ.పూ. 593

    నేటి వరకు మీరు అర్పణలు అర్పించి, మీ పిల్లలను అగ్నిగుండాలు దాటించి మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటిని పూజించి అపవిత్రులవుతున్నారు. ఇశ్రాయేలీయులారా, నన్ను విచారించడానికి నేను మిమ్మల్ని అనుమతించాలా? నా జీవం తోడు నా నుండి మీకు ఏ ఆలోచనా దొరకదు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  17. యెహెజ్కేలు 20:32సుమారు క్రీ.పూ. 593

    “ ‘ “మేము కట్టెను, రాయిని సేవించే దేశాల్లా, ప్రపంచంలోని జనాంగాల్లా ఉండాలని కోరుకుంటున్నాము” అని మీరంటున్నారు. కాని మీ మనస్సులో ఉన్నట్లు ఎప్పటికీ జరగదు.

  18. యెహెజ్కేలు 20:33సుమారు క్రీ.పూ. 593

    నా జీవం తోడు, నేను బలిష్టమైన చేతితో, చాచిన బాహువుతో, వెల్లువెత్తుతున్న కోపంతో నిన్ను పరిపాలిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  19. యెహెజ్కేలు 20:34సుమారు క్రీ.పూ. 593

    నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి రప్పిస్తాను మీరు చెదిరిపోయి ఉన్న దేశాల నుండి బలమైన చేతితో, చాచిన బాహువుతో, వెల్లువెత్తుతున్న ఉగ్రతతో మిమ్మల్ని సమకూరుస్తాను.

  20. యెహెజ్కేలు 20:35సుమారు క్రీ.పూ. 593

    నేను మిమ్మల్ని జనాలు ఉన్న అరణ్యంలోకి తీసుకువస్తాను, అక్కడ ముఖాముఖిగా నేను మీకు తీర్పు తీరుస్తాను.

  21. యెహెజ్కేలు 20:36సుమారు క్రీ.పూ. 593

    ఈజిప్టు దేశపు అరణ్యంలో నేను మీ పూర్వికులకు తీర్పు ఇచ్చినట్టే మీకు కూడా తీరుస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  22. యెహెజ్కేలు 20:37సుమారు క్రీ.పూ. 593

    మీరు నా చేతికర్ర క్రింద దాటి వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని గమనించి మిమ్మల్ని ఒడంబడిక బంధంలోనికి తీసుకువస్తాను.

  23. యెహెజ్కేలు 20:38సుమారు క్రీ.పూ. 593

    నా మీద తిరుగుబాటు చేసేవారిని దోషులను మీలో ఉండకుండా చేస్తాను. వారు ఉంటున్న దేశంలో నుండి వారిని బయటకు రప్పిస్తాను కాని వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు. అప్పుడు మీరు నేనే యెహోవానని తెలుసుకుంటారు.

  24. యెహెజ్కేలు 20:39సుమారు క్రీ.పూ. 593

    “ ‘ఇశ్రాయేలు ఇంటివారలారా! ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు నా మాట వినకపోతే మీరు వెళ్లి మీ విగ్రహాలను పూజించండి. కాని మీ అర్పణల వలన విగ్రహాల వలన నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేయకండి.

  25. యెహెజ్కేలు 20:40సుమారు క్రీ.పూ. 593

    ఇశ్రాయేలీయులకు ఉన్నత పర్వతమైన నా పరిశుద్ధ పర్వతం మీద దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరు నాకు సేవ చేస్తారు, అక్కడే నేను వారిని అంగీకరిస్తాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అక్కడ మీ పరిశుద్ధ బలులతో పాటు మీ అర్పణలు, మీ ప్రత్యేక కానుకలన్నిటిని నేను అంగీకరిస్తాను.