- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1900–1700 BC
Jacob, Joseph & Egypt
Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 26:26సుమారు క్రీ.పూ. 1804
ఇంతలో అబీమెలెకు, అతని స్నేహితుడు అహుజతు, సేనాధిపతి ఫీకోలు, గెరారు నుండి ఇస్సాకు దగ్గరకు వచ్చారు.
- ఆదికాండము 26:27సుమారు క్రీ.పూ. 1804
ఇస్సాకు వారిని, “మీరెందుకు నా దగ్గరకు వచ్చారు, నాకు వ్యతిరేకంగా ఉంటూ నన్ను పంపివేశారు కదా?” అని అడిగాడు.
- ఆదికాండము 26:28సుమారు క్రీ.పూ. 1804
వారు జవాబిస్తూ ఇలా అన్నారు, “యెహోవా నీతో ఉండడం మేము స్పష్టంగా చూశాం; కాబట్టి, ‘మాకు నీకు మధ్య ప్రామాణిక ఒప్పందం ఉండాలి’ అని మేము అనుకున్నాము. కాబట్టి మనం ఒప్పందం చేసుకుందాము.
- ఆదికాండము 26:29సుమారు క్రీ.పూ. 1804
మేము నీకు ఏ హాని చేయలేదు కాని మిమ్మల్ని మంచిగా చూసుకుని సమాధానంతో పంపించాం, కాబట్టి నీవు మాకు ఏ హాని చేయకూడదు. ఇప్పుడు నీవు యెహోవాచేత ఆశీర్వదించబడ్డావు.”
- ఆదికాండము 26:30సుమారు క్రీ.పూ. 1804
అప్పుడు ఇస్సాకు వారికి విందు చేశాడు, వారు తిని త్రాగారు.
- ఆదికాండము 26:31సుమారు క్రీ.పూ. 1804
మర్నాడు వేకువజామున వారు లేచి, ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్నారు. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపాడు, వారు అక్కడినుండి సమాధానంతో వెళ్లారు.
- ఆదికాండము 26:32సుమారు క్రీ.పూ. 1804
ఆ రోజు ఇస్సాకు సేవకులు వచ్చి అతనితో వారు త్రవ్విన మరో బావి గురించి ఇలా చెప్పారు. వారు, “మాకు నీళ్లు కనిపించాయి!” అని చెప్పారు.
- ఆదికాండము 26:33సుమారు క్రీ.పూ. 1804
అతడు ఆ బావికి షేబ అని పేరు పెట్టాడు, అందుకే ఇప్పటివరకు ఆ పట్టణం పేరు బెయేర్షేబ.
- ఆదికాండము 26:34సుమారు క్రీ.పూ. 1796
ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో, హిత్తీయుడైన బెయేరి కుమార్తె యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు.
- ఆదికాండము 26:35సుమారు క్రీ.పూ. 1796
ఈ ఇద్దరు ఇస్సాకు రిబ్కాల దుఃఖానికి కారకులయ్యారు.
- ఆదికాండము 27:1సుమారు క్రీ.పూ. 1760
ఇస్సాకు వృద్ధుడైనప్పుడు, అతడు ఇక చూడలేనంతగా తన కళ్ళు మసకబారినప్పుడు, తన పెద్దకుమారుడైన ఏశావును, “నా కుమారుడా” అని పిలిచాడు. అతడు, “చిత్తం, నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు.
- ఆదికాండము 27:2సుమారు క్రీ.పూ. 1760
ఇస్సాకు ఇలా అన్నాడు, “నేను వృద్ధున్ని అని నాకు తెలుసు, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు.
- ఆదికాండము 27:3సుమారు క్రీ.పూ. 1760
కాబట్టి నీవు నీ ఆయుధాలను అంటే నీ అంబులపొదిని విల్లును తీసుకుని అడవికి వెళ్లి జంతువును వేటాడి నాకు మాంసం తెచ్చిపెట్టు.
- ఆదికాండము 27:4సుమారు క్రీ.పూ. 1760
నాకు ఇష్టమైన భోజనం రుచిగా సిద్ధం చేసి తీసుకురా, నేను చనిపోకముందు తిని నిన్ను దీవిస్తాను” అని చెప్పాడు.
- ఆదికాండము 27:5సుమారు క్రీ.పూ. 1760
అయితే ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో మాట్లాడుతున్నప్పుడు రిబ్కా విన్నది. ఏశావు వేటాడేందుకు బహిరంగ పొలానికి వెళ్లిపోయాక,
- ఆదికాండము 27:6సుమారు క్రీ.పూ. 1760
రిబ్కా తన కుమారుడైన యాకోబుతో, “ఇదిగో, నీ తండ్రి నీ అన్న ఏశావుతో చెప్పడం నేను విన్నాను,
- ఆదికాండము 27:7సుమారు క్రీ.పూ. 1760
‘నేను చనిపోకముందు దానిని తిని యెహోవా సన్నిధిలో నిన్ను దీవిస్తాను’ అందుకు నీవు నా కోసం వేటాడి మాంసం తెచ్చి రుచికరమైన భోజనం సిద్ధం చేసి తీసుకురా అని చెప్పాడు.
- ఆదికాండము 27:8సుమారు క్రీ.పూ. 1760
కాబట్టి నా కుమారుడా! నా మాట జాగ్రతగా విని, నేను చెప్పినట్టు చేయి:
- ఆదికాండము 27:9సుమారు క్రీ.పూ. 1760
మన మందలో నుండి రెండు మంచి మేక పిల్లలను తీసుకురా, నేను నీ తండ్రికి ఇష్టమైన భోజనం వండి పెడతాను.
- ఆదికాండము 27:10సుమారు క్రీ.పూ. 1760
అప్పుడు నీ తండ్రి తినడానికి దానిని తీసుకెళ్లు, అప్పుడు అతడు చనిపోకముందు నిన్ను దీవిస్తాడు” అని చెప్పింది.
- ఆదికాండము 27:11సుమారు క్రీ.పూ. 1760
యాకోబు తన తల్లి రిబ్కాతో, “నా అన్న ఏశావు వెంట్రుకలు గలవాడు, నాకు నునుపైన చర్మం ఉంది.
- ఆదికాండము 27:12సుమారు క్రీ.పూ. 1760
ఒకవేళ నా తండ్రి నన్ను తాకిచూస్తే ఎలా? అతన్ని మోసం చేసినవాడనై, నా మీదికి ఆశీర్వాదానికి బదులు శాపం తెచ్చుకున్నవాన్ని అవుతాను” అని అన్నాడు.
- ఆదికాండము 27:13సుమారు క్రీ.పూ. 1760
అతని తల్లి అతనితో, “నా కుమారుడా, ఆ శాపం నా మీదికే రానివ్వు. కేవలం నేను చెప్పింది చేయి; వెళ్లి వాటిని నా కోసం తీసుకురా” అని చెప్పింది.
- ఆదికాండము 27:14సుమారు క్రీ.పూ. 1760
కాబట్టి అతడు వెళ్లి వాటిని తన తల్లి దగ్గరకు తెచ్చాడు, ఆమె అతని తండ్రికి ఇష్టమైన భోజనం వండింది.
- ఆదికాండము 27:15సుమారు క్రీ.పూ. 1760
తర్వాత రిబ్కా ఇంట్లో ఉన్న తన పెద్దకుమారుడైన ఏశావు యొక్క శ్రేష్ఠమైన బట్టలు తీసుకుని తన చిన్న కుమారుడైన యాకోబుకు తొడిగించింది.