కంటెంట్‌కు వెళ్లండి

Jonathan

83 వచనాలు · 10 కుటుంబ సభ్యులు

Jonathan ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యోనాతాను తీవ్రమైన కోపంతో బల్ల దగ్గర నుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందుకు అతని కోసం దుఃఖిస్తూ, ఆ అమావాస్య పండుగ మరుసటిరోజు అతడు భోజనం చేయలేదు.

  2. ఉదయాన యోనాతాను దావీదును కలుసుకోడానికి ఒక పనివానిని తీసుకుని పొలంలోనికి వెళ్లాడు.

  3. అయితే వాడు యోనాతాను వేసిన బాణం పడ్డ చోటికి వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి, “నీ అవతల బాణం ఉంది కదా?

  4. నీవు ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్లు” అన్నాడు. పనివాడు బాణాలను ఏరుకుని తన యాజమాని దగ్గరకు వాటిని తీసుకువచ్చాడు.

  5. విషయం ఏమీ వానికి తెలియదు. యోనాతానుకు దావీదుకు మాత్రమే ఆ విషయం తెలుసు.

  6. యోనాతాను తన ఆయుధాలను వాని చేతికిచ్చి వీటిని పట్టణానికి తీసుకెళ్లమని చెప్పి వానిని పంపివేశాడు.

  7. అప్పుడు యోనాతాను, “యెహోవా నీకు నాకు మధ్య, నీ సంతానానికి నా సంతానానికి మధ్య ఎప్పటికీ సాక్షిగా ఉండును గాక. మనమిద్దరం యెహోవా నామాన్ని బట్టి ప్రమాణం చేసుకున్నాం కాబట్టి మనస్సులో నెమ్మది కలిగి వెళ్లు” అని దావీదుతో చెప్పగా దావీదు బయలుదేరి వెళ్లిపోయాడు. యోనాతాను పట్టణానికి తిరిగి వెళ్లాడు.

  8. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను హోరేషులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి దేవుని బట్టి అతన్ని బలపరుస్తూ,

  9. వీరిద్దరు యెహోవా ఎదుట నిబంధన చేసుకున్న తర్వాత యోనాతాను ఇంటికి వెళ్లిపోయాడు కాని దావీదు హోరేషులోనే ఉన్నాడు.

  10. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి అతని కుమారులైన యోనాతాను అబీనాదాబు మల్కీ-షూవలను చంపేశారు.

  11. “ఏ జరిగిందో నాకు చెప్పు” అని దావీదు అడిగాడు. అప్పుడతడు, “యుద్ధరంగం నుండి సైనికులంతా పారిపోయారు. వారిలో ఎంతోమంది చనిపోయారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను కూడా చనిపోయారు” అని సమాధానం ఇచ్చాడు.

  12. అందుకు దావీదు, “సౌలు, అతని కుమారుడు యోనాతాను కూడా చనిపోయారని నీకెలా తెలుసు?” అని వార్త తెచ్చిన యువకుని అడిగాడు.

  13. సౌలు, అతని కుమారుడు యోనాతాను, యెహోవా సైన్యం ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఖడ్గంతో చంపబడ్డారని విని, వారి కోసం సాయంకాలం వరకు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉపవాసం ఉన్నారు.

  14. సౌలు గురించి అతని కుమారుడైన యోనాతాను గురించి దావీదు ఒక శోకగీతాన్ని వ్రాసి,

  15. “హతుల రక్తం ఒలికించకుండా, బలవంతుల శరీరంలో చొచ్చుకుపోకుండా, యోనాతాను విల్లు వెనుదిరగలేదు, సౌలు ఖడ్గం అసంతృప్తిగా వెనుదిరగలేదు.

  16. సౌలు యోనాతానులు తమ బ్రతుకంతా ప్రేమ కలిగి దయ కలిగినవారిగా ఉన్నారు. చావులోనూ ఒకరిని ఒకరు విడిచిపెట్టలేదు. వారు గ్రద్దల కన్నా వేగం గలవారు, సింహాల కన్నా బలవంతులు.

  17. “యుద్ధరంగంలో బలవంతులు ఎలా పడిపోయారో కదా! నీ పర్వతాలమీద యోనాతాను హతమైపోయాడు.

  18. నా సోదరుడా, యోనాతానా! నీకోసం నేనెంతో దుఃఖిస్తున్నాను; నీవు నాకెంతో ప్రియమైనవాడవు. నాపై నీకున్న ప్రేమ ఎంతో అద్భుతమైనది, అది స్త్రీలు చూపించే దానికన్నా అద్భుతమైనది.

  19. (సౌలు కుమారుడైన యోనాతానుకు రెండు కాళ్లు కుంటివైన ఒక కుమారుడు ఉన్నాడు. యెజ్రెయేలు నుండి సౌలు గురించి యోనాతాను గురించి వార్త వచ్చినప్పుడు వానికి అయిదు సంవత్సరాలు. అతని ఆయా వానిని తీసుకుని పారిపోయే తొందరలో ఉన్నప్పుడు అతడు క్రిందపడి కుంటివాడయ్యాడు. వాని పేరు మెఫీబోషెతు.)

  20. ఒకసారి దావీదు, “యోనాతాను బట్టి నేను దయ చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు.

  21. అప్పుడు రాజు, “దేవుడు నాకు దయచూపించినట్లుగా నేను దయచూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు. అందుకు సీబా రాజుతో, “యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు; అతని రెండు కాళ్లు కుంటివి” అని చెప్పాడు.

  22. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చి అతని ఎదుట తల నేలకు వంచి నమస్కరించాడు. దావీదు, “మెఫీబోషెతూ!” అని పిలిచాడు. అతడు, “నేను నీ సేవకుడిని” అని సమాధానం ఇచ్చాడు.

  23. దావీదు అతనితో, “భయపడకు, నీ తండ్రి యోనాతాను బట్టి నేను నీ మీద దయ చూపిస్తాను. నీ తాత సౌలుకు చెందిన భూమంతటిని నీకు మరలా ఇప్పిస్తాను, నీవు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అన్నాడు.

  24. దావీదు సౌలు కుమారుడైన యోనాతానుతో యెహోవా ఎదుట చేసిన ప్రమాణం కారణంగా సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును రాజు వారికి అప్పగించలేదు.

  25. దావీదు వెళ్లి యాబేషు గిలాదువారి దగ్గరి నుండి సౌలు, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తీసుకువచ్చాడు. (గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు యోనాతానులను చంపి బేత్-షాను పట్టణపు వీధుల్లో వ్రేలాడదీసినప్పుడు యాబేషు గిలాదువారు వారి మృతదేహాలను దొంగిలించారు.)