కంటెంట్‌కు వెళ్లండి

Mephibosheth

14 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Merib-baal

Mephibosheth ను ప్రస్తావించే వచనాలు

  1. (సౌలు కుమారుడైన యోనాతానుకు రెండు కాళ్లు కుంటివైన ఒక కుమారుడు ఉన్నాడు. యెజ్రెయేలు నుండి సౌలు గురించి యోనాతాను గురించి వార్త వచ్చినప్పుడు వానికి అయిదు సంవత్సరాలు. అతని ఆయా వానిని తీసుకుని పారిపోయే తొందరలో ఉన్నప్పుడు అతడు క్రిందపడి కుంటివాడయ్యాడు. వాని పేరు మెఫీబోషెతు.)

  2. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చి అతని ఎదుట తల నేలకు వంచి నమస్కరించాడు. దావీదు, “మెఫీబోషెతూ!” అని పిలిచాడు. అతడు, “నేను నీ సేవకుడిని” అని సమాధానం ఇచ్చాడు.

  3. నీవు, నీ కుమారులు నీ పనివారు అతని కోసం ఆ భూమిని సాగుచేసి నీ యాజమాని మనుమడికి కావలసిన ఆహారాన్ని ఆ పంట నుండి తీసుకురావాలి. కాని నీ యాజమాని మనుమడైన మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు” అని చెప్పాడు. (సీబాకు పదిహేను మంది కుమారులు, ఇరవైమంది పనివారున్నారు.)

  4. అప్పుడు సీబా, “నా ప్రభువైన రాజు తన సేవకుడనైన నాకు చేయమని ఆజ్ఞాపించిన దాన్నంతా చేస్తాను” అన్నాడు. అప్పటినుండి మెఫీబోషెతు ఒక రాకుమారునిలా రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ వచ్చాడు.

  5. మెఫీబోషెతుకు చిన్నకుమారుడు ఉన్నాడు. అతని పేరు మీకా. సీబా ఇంట్లో ఉన్నవారందరు మెఫీబోషెతుకు సేవకులు.

  6. మెఫీబోషెతు యెరూషలేములో నివసించి నిత్యం రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉన్నాడు. అతని రెండు కాళ్లు కుంటివి.

  7. దావీదు కొండమీద కొంత దూరం వెళ్లినప్పుడు, మెఫీబోషెతు సేవకుడైన సీబా అతన్ని కలవడానికి వేచి ఉన్నాడు. అతడు కళ్లకు గంతలు కట్టివున్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. వాటి మీద 200 రొట్టెలు, 100 ఎండు ద్రాక్ష గెలలు, 100 అంజూర పండ్లు ఉన్న కొమ్మలు, ఒక ద్రాక్షరసపు తిత్తి ఉన్నాయి.

  8. అప్పుడు రాజు సీబాతో, “మెఫీబోషెతుకు చెందినదంతా ఇప్పుడు నీది” అని అన్నాడు. అందుకు సీబా, “నా ప్రభువా రాజా, మీ దయ నాపై ఉండును గాక, మీకు నా దండాలు” అన్నాడు.

  9. సౌలు మనుమడు మెఫీబోషెతు కూడా రాజును కలుసుకోడానికి వచ్చాడు. రాజు వెళ్లిన రోజు నుండి అతడు క్షేమంగా తిరిగివచ్చిన రోజు వరకు మెఫీబోషెతు తన కాళ్లు కడుక్కోలేదు. గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు.

  10. దావీదును కలుసుకోవటానికి అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు రాజు, “మెఫీబోషెతూ, నీవు నాతో కూడా ఎందుకు వెళ్లలేదు?” అని అతన్ని అడిగాడు.

  11. అందుకు మెఫీబోషెతు, “నా ప్రభువైన రాజు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చాడు కాబట్టి అతడే అంతా తీసుకోవచ్చు” అన్నాడు.

  12. దావీదు సౌలు కుమారుడైన యోనాతానుతో యెహోవా ఎదుట చేసిన ప్రమాణం కారణంగా సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును రాజు వారికి అప్పగించలేదు.

  13. యోనాతాను కుమారుడు: మెరీబ్-బయలు, ఇతడు మీకాకు తండ్రి.

  14. యోనాతాను కుమారుడు: మెరీబ్-బయలు, ఇతడు మీకాకు తండ్రి.