కంటెంట్‌కు వెళ్లండి

Jonathan

83 వచనాలు · 10 కుటుంబ సభ్యులు

Jonathan ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యోనాతాను దావీదును తన ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి అతడు దావీదుతో ఒక నిబంధన చేసుకున్నాడు.

  2. యోనాతాను తాను కప్పుకుని ఉన్న వస్త్రాన్ని, దానితో పాటు తన కత్తిని విల్లును నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.

  3. సౌలు దావీదును చంపమని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితో చెప్పాడు. అయితే యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టము.

  4. కాబట్టి యోనాతాను దావీదును హెచ్చరిస్తూ, “నా తండ్రియైన సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీవు ఉదయానే జాగ్రత్తపడి రహస్య స్ధలంలో దాక్కొని ఉండు.

  5. యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదు గురించి మంచిగా మాట్లాడి, “నీ సేవకుడైన దావీదు నీ పట్ల ఏ తప్పు చేయలేదు గాని ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నీవు అతనికి ఏ హాని చేయవద్దు.

  6. సౌలు యోనాతాను మాటలు విని, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అతనికి మరణశిక్ష విధించను” అని చెప్పాడు.

  7. అప్పుడు యోనాతాను దావీదును పిలిచి అన్ని సంగతులను అతనికి చెప్పి, దావీదును సౌలు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు గతంలో ఉన్నట్లే దావీదు అతని దగ్గర ఉన్నాడు.

  8. తర్వాత దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చి, “నేనేమి చేశాను? నా నేరమేంటి? నా ప్రాణం తీయడానికి వెదికేంతగా నీ తండ్రి పట్ల నేను చేసిన పాపమేంటి?” అని అడిగాడు.

  9. అప్పుడు దావీదు, “నేను నీ దయ పొందానని నీ తండ్రికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి అతడు ‘యోనాతాను బాధపడతాడు కాబట్టి అతనికి తెలియకూడదు’ అని అనుకుని ఉంటాడు. అయితే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నిజంగా నాకు మరణానికి మధ్య ఒక్క అడుగు మాత్రమే ఉంది” అని ప్రమాణం చేసి చెప్పాడు.

  10. యోనాతాను, “నీకోసం నేను ఏం చేయాలో చెప్పు అది నేను చేస్తాను” అని దావీదుతో చెప్పాడు.

  11. అందుకు దావీదు యోనాతానుతో, “రేపు అమావాస్య, అప్పుడు నేను తప్పకుండా రాజుతో పాటు కలిసి భోజనం చేయాలి; కాని ఎల్లుండి సాయంత్రం వరకు పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు.

  12. యోనాతాను, “అలా ఎప్పుడూ అనవద్దు. నా తండ్రి నీకు హాని చేయాలని చూస్తున్నట్టు నాకు తెలిస్తే నీతో చెప్పకుండా ఉంటానా?” అన్నాడు.

  13. అందుకు దావీదు యోనాతానును, “నీ తండ్రి నీతో కఠినంగా మాట్లాడితే దానిని నాకు ఎవరు చెప్తారు?” అని అడిగాడు.

  14. యోనాతాను దావీదుతో, “పొలంలోనికి వెళ్దాం రా” అన్నప్పుడు ఇద్దరు కలిసి పొలంలోనికి వెళ్లారు.

  15. తర్వాత యోనాతాను దావీదుతో, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సాక్షి, రేపుగాని ఎల్లుండి గాని ఈ సమయానికి నా తండ్రిని కలుసుకుంటాను. అతడు నీ పట్ల సానుకూలంగా ఉంటే ఆ విషయాన్ని నీకు తెలియచేయకుండా ఉంటానా?

  16. అయితే నా తండ్రి నీకు హాని చేసే ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు తెలిసి కూడా నీకు చెప్పి నిన్ను క్షేమంగా పంపించకపోతే యెహోవా యోనాతానుకు గొప్ప హాని కలిగించును గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉండును గాక.

  17. “యెహోవా దావీదు యొక్క శత్రువులు లెక్క అప్పగించేలా చేయును గాక” అని చెప్తూ యోనాతాను దావీదు కుటుంబంతో నిబంధన చేశాడు.

  18. యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించాడు కాబట్టి తనకున్న ప్రేమను బట్టి దావీదు చేత మరల ప్రమాణం చేయించాడు.

  19. యోనాతాను దావీదుతో, “రేపు అమావాస్య. నీ చోటు ఖాళీగా ఉంటుంది కాబట్టి నీవు లేవని తెలుస్తుంది గదా.

  20. ఎప్పటిలాగానే రాజు గోడ దగ్గర ఉన్న తన స్థానంలో యోనాతానుకు ఎదురుగా కూర్చున్నాడు. అబ్నేరు సౌలు ప్రక్కన కూర్చున్నాడు. అయితే దావీదు కూర్చునే చోటు ఖాళీగా ఉంది.

  21. అయితే అమావాస్య తర్వాతి రోజు అనగా నెలలో రెండవ రోజున దావీదు చోటు ఖాళీగా ఉండడం చూసి సౌలు, “నిన్న, ఈ రోజు యెష్షయి కుమారుడు భోజనానికి ఎందుకు రాలేదు?” అని యోనాతానును అడిగాడు.

  22. అందుకు యోనాతాను, “బేత్లెహేము వెళ్లడానికి అనుమతి ఇవ్వమని నన్ను దావీదు ఎంతో ప్రాధేయపడి,

  23. అప్పుడు సౌలు యోనాతాను మీద చాలా కోప్పడి, “వక్రబుద్ధితో తిరుగుబాటుచేసేదాని కుమారుడా, నీకు నిన్ను కన్న తల్లికి అవమానం కలిగేలా నీవు యెష్షయి కుమారుని పక్షం ఉన్నావని నాకు తెలియదనుకున్నావా?

  24. అప్పుడు యోనాతాను, “అతడు మరణశిక్ష ఎందుకు పొందాలి? అతడు ఏమి చేశాడు?” అని సౌలును అడిగాడు.

  25. కానీ సౌలు అతన్ని చంపడానికి ఈటె విసిరాడు. తన తండ్రి దావీదును చంపాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడని అప్పుడు యోనాతాను గ్రహించాడు.