కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎందుకంటే దేవుడు మనల్ని ఉగ్రతను అనుభవించడానికి నియమించలేదు కాని, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే నియమించారు.

  2. మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము.

  3. సమాధానకర్తయైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక.

  4. తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయ సంఘానికి,

  5. తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.

  6. సహోదరీ సహోదరులారా, మేము మీ గురించి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీ విశ్వాసం అంతకంతకు పెరుగుతుంది, మీ అందరికి ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ మరింత అధికమవుతూ ఉంది.

  7. కాబట్టి మీరు పొందుతున్న హింసలలో శ్రమలలో మీరు చూపుతున్న ఓర్పు విశ్వాసం గురించి దేవుని సంఘాల్లో మేము గొప్పగా చెప్తున్నాము.

  8. దీన్ని బట్టి దేవుడు ఇచ్చిన తీర్పు న్యాయమైనదని తెలియజేయడానికి రుజువుగా, మీరు అనుభవించిన శ్రమల వలన మీరు దేవుని రాజ్యానికి అర్హులు అవుతారు.

  9. దేవుడు న్యాయవంతుడు కాబట్టి మిమ్మల్ని హింసించినవారిని తగిన విధంగా శిక్షిస్తారు,

  10. దేవుని ఎరుగని వారిని, మన ప్రభువైన యేసు యొక్క సువార్తకు లోబడని వారిని ఆయన శిక్షిస్తారు.

  11. దీన్ని హృదయంలో ఉంచుకుని, మన దేవుడు మీకిచ్చిన పిలుపుకు మిమ్మల్ని ఆయన యోగ్యులుగా చేయాలని, ఆయన తన శక్తిచేత మీ ప్రతి ఉత్తమమైన కోరికను ఫలింపచేయాలని, మీ ప్రతి పని విశ్వాసం వలన జరగాలని మేము మీ కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము.

  12. తద్వారా మన దేవుని యొక్క ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపను బట్టి మన ప్రభువైన యేసు నామం మీలో, మీరు ఆయనలో మహిమపరచబడాలని మేము ప్రార్థిస్తున్నాము.

  13. వాడు దేవునిగా పిలువబడే ప్రతిదాన్ని, పూజించబడే వాటన్నిటిని వ్యతిరేకించి, తనను తాను వాటన్నిటికంటే పైగా హెచ్చించుకొంటూ, తనంతట తానే దేవాలయంలో కూర్చుని, తానే దేవుడనని ప్రకటించుకుంటాడు.

  14. ఈ కారణంగా, వారు అబద్ధాన్ని నమ్మేలా దేవుడు వారి మీదకు బలమైన భ్రమను పంపాడు.

  15. ప్రభువు ప్రేమించిన సహోదరీ సహోదరులారా, మేము మీ కోసం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీరు రక్షణ పొందడానికి సత్యాన్ని నమ్మడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మ చేత పరిశుద్ధపరచడానికి ప్రారంభం నుండి ఏర్పరచుకున్నారు.

  16. మన ప్రభువైన యేసు క్రీస్తును మన తండ్రియైన దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చేత మనకు నిత్య ప్రోత్సాహాన్ని స్థిరమైన నిరీక్షణను ఇచ్చి,

  17. ప్రభువు మీ హృదయాలను దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన సహనం వైపు నడిపించును గాక.

  18. మన రక్షకుడైన దేవుని, మన నిరీక్షణయైన క్రీస్తు యేసు ఆజ్ఞ వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు,

  19. విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది:

  20. దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమను గురించిన సువార్తకు అనుగుణమైనదే, ఈ స్వచ్ఛమైన బోధ.

  21. కాబట్టి నిత్య రాజుగా ఉన్న, అమరుడగు అదృశ్యుడైన ఒకే దేవునికి ఘనత మహిమలు నిరంతరం కలుగును గాక ఆమేన్.

  22. ఇలాంటివి మంచివి; మన రక్షకుడైన దేవునికి ప్రీతికరమైనవి.

  23. ఎందుకంటే, దేవుడు ఒక్కడే; క్రీస్తు యేసు ఒక్కడే మానవునిగా ఉండి, దేవునికి మానవులకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉన్నారు.

  24. ఒకడు తన సొంత కుటుంబాన్నే సరిదిద్దుకోలేనప్పుడు, అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు?

  25. త్వరలో నీ దగ్గరకు రావాలని ఆశిస్తున్నాను, ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా కాని సత్యానికి పునాదిగా స్తంభంగా ఉన్న జీవంగల దేవుని సంఘమైన దేవుని గృహంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియజేయాలనే నేను ఈ సూచనలు వ్రాస్తున్నాను.