కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నిస్సందేహంగా నిజమైన దైవభక్తిని గురించిన మర్మం గొప్పది, అది ఏంటంటే: ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యారు, పవిత్రాత్మ ఆయనను నీతిమంతుడని నిరూపించాడు, దేవదూతలు ఆయనను చూశారు, ఆయన గురించి భూరాజ్యాలన్నిటిలో ప్రజలు ప్రకటించారు, ఆయన గురించి లోకమంతా నమ్మింది, ఆయనను దేవుడు మహిమలోనికి తీసుకెళ్లారు.

  2. వారు ప్రజలను పెళ్ళి చేసుకోవద్దని నిషేధిస్తారు, సత్యాన్ని తెలుసుకున్నవారు, నమ్మినవారు కృతజ్ఞతా పూర్వకంగా తినడానికి దేవుడు సృజించిన ఆహారపదార్థాలలో కొన్నిటిని తినకూడదని వారు ఆజ్ఞాపిస్తారు.

  3. కాని, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, కాబట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించి తీసుకుంటే దేన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు.

  4. ఎందుకంటే దేవుని వాక్యం వలన కృతజ్ఞతా ప్రార్థనల వలన అది పవిత్రపరచబడింది.

  5. అందుకే మనుష్యులందరికి, మరి ముఖ్యంగా విశ్వసించిన వారందరికి రక్షకుడైన సజీవ దేవునిలో మా నిరీక్షణ ఉంచి, మేము ప్రయాసపడుతూ గట్టిగా కృషి చేస్తున్నాము.

  6. కాని ఏ విధవరాలికైన పిల్లలు గాని మనుమలు గాని ఉంటే, ఆ పిల్లలు ముందుగా తమ కుటుంబంపట్ల శ్రద్ధ వహించడం, తమ తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా తాము పాటించే ధర్మాన్ని ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి, ఇది దేవుని సంతోషపరుస్తుంది.

  7. నిజంగా ఒంటరియైన, అవసరంలో ఉన్న విధవరాలు దేవునిపై ఆధారపడి రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ సహాయం కోసం దేవున్ని అడుగుతూ ఉంటుంది.

  8. ఎటువంటి పక్షపాతాన్ని చూపించకుండ, ఎవరి పట్ల భేదం చూపకుండ నీవు ఈ సూచనలు పాటించాలని, దేవుని ఎదుట క్రీస్తు యేసు సన్నిధిలో ఎన్నుకోబడిన దేవదూతల ఎదుట నేను నిన్ను హెచ్చరిస్తున్నాను.

  9. దేవుని నామాన్ని మేము చేసిన బోధలను ప్రజలు దూషించకుండ ఉండడానికి, దాసులుగా బానిసత్వపు కాడి క్రింద ఉన్న విశ్వాసులైన వారందరు తమ యజమానులను గౌరవించదగినవారిగా భావించాలి.

  10. అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.

  11. అన్నిటికి జీవాన్ని ఇచ్చే దేవుని ఎదుట, పొంతి పిలాతు ఎదుట మంచి సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ముందు నేను నీకు నిర్ధేశించాను.

  12. ఈ లోకంలో ధనవంతులైన వారిని గర్వంతో ఉండవద్దని, స్థిరంగా ఉండని సంపదలపై తమ నమ్మకాన్ని ఉంచక, వారి సంతోషం కోసం కావలసిన వాటన్నిటిని సమృద్ధిగా ఇచ్చే దేవునిలోనే నిరీక్షణ ఉంచమని ఆజ్ఞాపించు.

  13. క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానాన్ని అనుసరించి దేవుని చిత్తప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు,

  14. నా ప్రియ కుమారుడైన తిమోతికి వ్రాయునది:

  15. నా పితరులు సేవించినట్లే, స్వచ్ఛమైన మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, రాత్రింబవళ్ళు మానక నిన్ను నా ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుంటున్నాను.

  16. ఈ కారణంగానే, నేను నీపై చేతులు ఉంచడం వలన నీవు పొందిన దేవుని కృపా వరాన్ని మరింత రగిలించి వృద్ధి చేయమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను.

  17. దేవుడు మనకు పిరికితనాన్ని కలిగించే ఆత్మను ఇవ్వలేదు కాని శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించారు.

  18. కాబట్టి నీవు మన ప్రభువు కోసం సాక్ష్యమివ్వడానికి గాని ఆయన కోసం బందీనై ఉన్న నా గురించి కాని సిగ్గుపడకు. దానికి బదులు దేవుని శక్తినిబట్టి సువార్త కోసం నాతో పాటు కలిసి శ్రమలను అనుభవించడానికి సిద్ధపడు.

  19. దీనిని బట్టే నేను నేరస్థునిలా బంధించబడ్డాను. కాని దేవుని వాక్యం బంధించబడలేదు.

  20. ఆమోదించబడినవానిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్య వాక్యాన్ని సరిగా బోధించేవానిగా నిన్ను నీవు దేవునికి నిరూపించుకోవడానికి ప్రయాసపడు.

  21. అయితే దేవుని యొక్క పునాది స్థిరంగా నిలిచి ఉండి, దానిపై ఈ విధంగా ముద్ర వేయబడి ఉంది: “తన వారు ఎవరో ప్రభువుకు తెలుసు, ప్రభువు నామాన్ని ఒప్పుకునే ప్రతివారు దుష్టత్వం నుండి తొలగిపోవాలి.”

  22. దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి.

  23. ద్రోహులుగా, మొండివారిగా, అహంకారులుగా, దేవునికి బదులు సుఖానుభవాన్ని ప్రేమించేవారిగా,

  24. ప్రతి లేఖనం దేవుని ప్రేరణ చేతనే కలిగింది, అది బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, నీతిలో నడిపించడానికి ఉపయోగపడుతుంది.

  25. ఈ లేఖనాలను బట్టి, దేవుని సేవకుడు ప్రతి సత్కార్యం చేయడానికి పూర్తిగా సిద్ధపడి ఉండాలి.