కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కొలొస్సయిలో ఉన్న దేవుని పరిశుద్ధ ప్రజలకు, క్రీస్తులో విశ్వాసులైన సహోదరీ సహోదరులకు,

  2. క్రీస్తు యేసులో మీరు కలిగి ఉన్న విశ్వాసం గురించి, దేవుని ప్రజలందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి మేము విన్నాము, కాబట్టి మేము మీ కోసం ప్రార్థన చేసినప్పుడెల్లా, మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.

  3. అదే విధంగా, మీరు సువార్తను విని, దేవుని కృప గురించి నిజంగా గ్రహించిన రోజు నుండి అది మీ మధ్యలో ఫలించి వృద్ధి చెందుతున్న ప్రకారమే, ఈ సువార్త లోకమంతా ఫలిస్తూ వృద్ధిచెందుతుంది.

  4. ప్రతి మంచి పనిలో సఫలమవుతూ, దేవుని జ్ఞానంలో ఎదుగుతూ అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా జీవించాలని,

  5. వెలుగు రాజ్యంలో పరిశుద్ధ ప్రజల స్వాస్థ్యంలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని ఎన్నికచేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము.

  6. కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు.

  7. ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం.

  8. మీకు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తెలియజేయడానికి, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను బట్టి సంఘానికి సేవకుడినయ్యాను.

  9. యూదేతరుల మధ్యలో నుండి దేవుడు ఎన్నికచేసిన వారికి ఈ మర్మం యొక్క సంపూర్ణ మహిమైశ్వర్యం ఎలాంటిదో, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై ఉన్నారనే విషయం తెలియజేయబడింది.

  10. వారు క్రీస్తు అనే దేవుని మర్మాన్ని స్పష్టంగా తెలుసుకొని, సంపూర్ణ గ్రహింపు అనే గొప్ప సంపదను కలిగి ఉండి, హృదయాల్లో ధైర్యపరచబడి ప్రేమలో ఐక్యత కలిగి ఉండాలనేదే నా లక్ష్యము.

  11. ఏ విధంగా అంటే, బాప్తిస్మంలో మీరు ఆయనతో పాటు పాతిపెట్టబడి, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని క్రియలను మీరు విశ్వసించుట ద్వారా ఆయనతో పాటు మీరు కూడా మృతులలో నుండి లేచారు.

  12. వారు శిరస్సు నుండి సంబంధాన్ని పోగొట్టుకుంటారు; అయితే ఆ శిరస్సు వలన మొత్తం శరీరం కీళ్ళతో నరములతో ఒకటిగా అతుకబడి, దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతుంది.

  13. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కాబట్టి, పైనున్న వాటిపై మీ హృదయాలను ఉంచండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి వైపున కూర్చుని ఉన్నారు.

  14. ఎందుకంటే, మీరు చనిపోయారు, కాబట్టి మీ జీవం క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉంది.

  15. వీటి కారణంగానే దేవుని ఉగ్రత వస్తుంది.

  16. కాబట్టి, పరిశుద్ధులును ప్రియమైన వారునైన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్లా మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి.

  17. ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కోసం మీరు పిలువబడ్డారు, కాబట్టి క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి.

  18. మీరు మాటల్లో కాని పనులలో కాని, ఏమి చేసినా ప్రభువైన యేసు నామంలో చేయండి, తండ్రియైన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.

  19. తండ్రులారా, మీ పిల్లల మనస్సు నిరుత్సాహపడేటట్లు వారికి కోపం రేపకండి.

  20. బానిసలారా, మీ భూసంబంధ యజమానులకు లోబడి ఉండండి; వారి కనుదృష్టి మీమీద ఉన్నప్పుడు వారి దయను పొందాలని కాకుండా చిత్తశుద్ధి గల హృదయంతో, ప్రభువుకు భయపడుతూ అన్ని విషయాల్లో వారికి లోబడి ఉండండి.

  21. నేను సంకెళ్ళతో ఉండడానికి కారణమైన క్రీస్తు మర్మాన్ని మేము ప్రకటించడానికి, మా సువార్త పరిచర్యకు దేవుడు ద్వారాలను తెరవాలని మాకోసం కూడా ప్రార్థన చేయండి.

  22. యూస్తు అనబడే యేసు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. దేవుని రాజ్యం కోసం నాతో ఉన్న జతపనివారి మధ్యలో, యూదులు వీరు మాత్రమే ఉన్నారు. వీరు నాకు ఆదరణ కలిగిస్తున్నారు.

  23. క్రీస్తు యేసు సేవకుడును మీలో ఒకడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు పరిపూర్ణులుగా ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి పూర్తి నిశ్చయతగలవారై స్థిరంగా ఉండాలని, ఇతడు ఎప్పుడు మీ కోసం తన ప్రార్థనలో పోరాడుతూ ఉంటాడు.

  24. తండ్రియైన దేవునికి ప్రభువైన యేసు క్రీస్తుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి,

  25. మేము ప్రార్థించిన ప్రతిసారి మీ అందరి గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.