కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సహోదరీ సహోదరులందరికి మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి సమాధానం, విశ్వాసంతో కూడిన ప్రేమ కలుగును గాక.

  2. మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.

  3. మీరు గుర్తుకొచ్చినప్పుడెల్లా నేను దేవునికి వందనాలు చెప్తున్నాను.

  4. యేసు క్రీస్తు దయను బట్టి మీ అందరి గురించి నేనెంత ఆశ కలిగి ఉన్నానో దేవుడే సాక్ష్యం ఇస్తారు.

  5. Being filled with the fruits of righteousness, which are by Jesus Christ, unto the glory and praise of God.

  6. And in nothing terrified by your adversaries: which is to them an evident token of perdition, but to you of salvation, and that of God.

  7. ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి, దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;

  8. అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చించి అన్ని నామముల కంటే పై నామాన్ని ఆయనకిచ్చారు,

  9. ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.

  10. ఎందుకంటే దేవుని మంచి ఉద్దేశాలను నెరవేర్చడానికి మీరు ఇష్టపడడానికి, వాటిని చేయడానికి, మీలో కార్యాన్ని జరిగించేది దేవుడే.

  11. తద్వారా మీరు నిందలేనివారిగా, శుద్ధులుగా, “చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో, మీరు దోషంలేని దేవుని బిడ్డలు” అవుతారు. మీరు జీవవాక్యాన్ని స్థిరంగా పట్టుకుని ఉన్నప్పుడు, మీరు ఆకాశంలోని నక్షత్రాల్లా వారి మధ్యలో ప్రకాశిస్తారు. అప్పుడు నేను వృధాగా పరుగు పెట్టలేదు లేదా శ్రమపడలేదని క్రీస్తు దినాన నేను అతిశయించగలను.

  12. ప్రతి ఒక్కరు తమ సొంత పనులపైనే ఆసక్తి చూపిస్తున్నారు, కాని యేసు క్రీస్తు పనులపై కాదు.

  13. అతడు అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్నాడు కాని దేవుడు అతన్ని కనికరించారు. అతన్నే కాదు నాకు దుఃఖం మీద దుఃఖం కలుగకుండా నన్ను కూడా కనికరించారు.

  14. ఎందుకంటే, మనం సున్నతి పొందినవారం, దేవుని ఆత్మ చేత ఆయనను ఆరాధిస్తాం, క్రీస్తు యేసులో అతిశయపడతాం, శరీరంపై నమ్మకం ఉంచండి.

  15. క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్రం వలన కలిగే నా నీతిని కాకుండా, క్రీస్తులోని విశ్వాసాన్నిబట్టి దేవుడు దయ చేసిన నీతిని కలిగి ఆయనలో కనబడాలని,

  16. క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి, లక్ష్యం వైపే పరుగెడుతున్నాను.

  17. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరం ఇదే భావాన్ని కలిగి ఉందాము. అప్పుడు దేని గురించైనా మీరు వేరుగా ఆలోచిస్తే, దాన్ని కూడా దేవుడు మీకు స్పష్టం చేస్తారు.

  18. వారి గమ్యం నాశనం, వారి కడుపే వారికి దేవుడు, తాము సిగ్గుపడవలసిన వాటిలో వారు గర్వపడుతున్నారు. భూసంబంధమైన వాటిపైనే తమ మనస్సు ఉంచుతున్నారు.

  19. దేన్ని గురించి వేదన పడకండి, కాని ప్రతి విషయంలో ప్రార్థనావిజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి.

  20. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయాలను మీ తలంపులను కాపాడుతుంది.

  21. మీరు నా నుండి ఏవి నేర్చుకున్నారో, పొందారో లేదా విన్నారో లేదా నాలో ఏమి చూశారు వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీతో ఉంటారు.

  22. నేను సమృద్ధిగా పూర్తిగా పొందాను. మీరు పంపిన కానుకలు ఎపఫ్రొదితు నుండి అందుకున్నాను. అవి దేవునికి ఇష్టమైన పరిమళ అర్పణ, అంగీకారమైన త్యాగము.

  23. నా దేవుడు తన మహిమైశ్వర్యం ఆధారంగా క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు.

  24. మన తండ్రియైన దేవునికి మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.

  25. దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి వ్రాయునది: