Skip to content

Wicked గురించి బైబిల్ వచనాలు

724 వచనాలు · 18 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారి కాళ్లు వారిని వలలోనికి నడిపిస్తాయి; వారు వలలో పడతారు.

  2. బోను వారి మడమను పట్టుకుంటుంది; ఉచ్చు వారిని గట్టిగా పట్టుకుంటుంది.

  3. వారి కోసం నేల మీద ఉరి అమర్చబడింది; వారి దారిలో ఉచ్చు ఉంది.

  4. భయాలు ప్రతి దిక్కునుండి వారిని ఆవరిస్తాయి, అడుగడుగునా వారిని వెంటాడతాయి.

  5. విపత్తు వారి కోసం ఆకలితో ఉంది; వారు పడిపోతే ఆపద వారి కోసం సిద్ధంగా ఉంది.

  6. అది వారి చర్మ భాగాలను తినివేస్తుంది; మరణం యొక్క మొదటి సంతానం వారి అవయవాలను మ్రింగివేస్తుంది.

  7. వారి గుడారంలో ఉన్న భద్రత నుండి వారు పెరికివేయబడ్డారు. భయం కలిగించే రాజు దగ్గరకు కొనిపోబడతారు.

  8. అగ్ని వారి గుడారంలో నివసిస్తుంది. వారి నివాసం మీద మండే గంధకం చెదిరిపోతుంది.

  9. క్రింద వారి వేర్లు ఎండిపోతాయి పైన వారి కొమ్మలు వాడిపోతాయి.

  10. భూమి మీద వారి జ్ఞాపకం నశించిపోతుంది; నేలమీద వారి పేరే ఉండదు.

  11. వెలుగులో నుండి చీకటిలోకి వారు నడిపించబడతారు లోకం నుండి వారు తరిమివేయబడతారు.

  12. తమ ప్రజల్లో వారికి సంతానం గాని వారసులు గాని ఉండరు, ఒకప్పుడు వారు నివాసమున్న స్థలాల్లో బ్రతికి ఉన్నవారు ఎవరు లేరు.

  13. వారి దుస్థితిని చూసిన పశ్చిమ ప్రజలు ఆందోళన చెందుతారు; తూర్పున ఉన్నవారు భయంతో నిండి ఉంటారు.

  14. ఖచ్చితంగా దుర్మార్గుల నివాసం ఇలాగే ఉంటుంది; దేవుని ఎరుగనివారి స్థలం కూడా ఇలానే ఉంటుంది.”

  15. దుర్మార్గుల ఉల్లాసం కొద్దిసేపే అని, భక్తిహీనుల సంతోషం ఒక క్షణమే ఉంటుందని నీకు తెలుసు.

  16. భక్తిహీనుల గర్వం ఆకాశాలను అంటినా వారి తల మేఘాలను తాకినా,

  17. వారి మలంలా వారు కూడా ఎప్పటికి కనబడకుండా నశిస్తారు; వారిని చూసినవారు, ‘వారెక్కడ ఉన్నారు?’ అని అడుగుతారు.

  18. కలలా వారు చెదిరిపోయి కనుమరుగవుతారు, రాత్రి స్వప్నంలా వారు చెదిరిపోతారు.

  19. వారిని చూసిన కన్ను మరలా వారిని చూడదు; వారి స్థలం వారిని మరలా చూడదు.

  20. వారి పిల్లలు పేదవారి సహాయం అడుగుతారు; వారి చేతులు తమ ఆస్తిని తిరిగి ఇచ్చేస్తాయి.

  21. వారి ఎముకల్లో నిండి ఉన్న యవ్వన బలం వారితో పాటు మట్టిపాలవుతుంది.

  22. “చెడుతనం వారి నోటికి తీయగా ఉన్నా, నాలుక క్రింద వారు దాన్ని దాచినా,

  23. భరించలేకపోయినా దాన్ని విడిచిపెట్టలేదు తమ నోటిలో భద్రం చేసుకున్నారు,

  24. వారి ఆహారం వారి కడుపులో పులిసిపోతుంది; అది వారిలో నాగుపాముల విషంలా మారుతుంది.

  25. వారు మ్రింగిన ఐశ్వర్యాన్ని కక్కివేస్తారు; దేవుడు వారి కడుపు లోనిది కక్కిస్తారు.