కంటెంట్‌కు వెళ్లండి

Wicked గురించి బైబిల్ వచనాలు: Worship of, offensive to God

8 వచనాలు · 18 కోణాలు

Worship of, offensive to God గురించి వచనాలు

  1. దుష్టులతో దేవుడు ఇలా అంటున్నారు: “నా న్యాయవిధులు ఉచ్చరించే నా నిబంధనను మీ పెదాల మీదికి తీసుకునే హక్కు మీకెక్కడిది?

  2. నా సూచనను మీరు అసహ్యించుకుంటారు, నా మాటల్ని మీ వెనుకకు పారవేస్తారు.

  3. సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి; గొమొర్రా ప్రజలారా! మన దేవుని ఉపదేశాన్ని శ్రద్ధగా వినండి.

  4. యెహోవా ఇలా అంటున్నారు, “విస్తారమైన మీ బలులు నాకెందుకు? దహనబలులుగా ఇచ్చిన పొట్టేళ్లు, బాగా క్రొవ్విన జంతువుల క్రొవ్వు నాకు వెగటు కలిగించాయి; ఎద్దుల, గొర్రెపిల్లల, మేకపోతుల రక్తంలో నాకు ఆనందం లేదు.

  5. మీరు నా సన్నిధికి వస్తున్నప్పుడు, నా ఆవరణాలను త్రొక్కడానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు?

  6. విలువలేని అర్పణలు తీసుకురావడం ఆపండి! మీ ధూపం నాకు అసహ్యం కలిగిస్తుంది. అమావాస్యలు, సబ్బాతులు, ప్రత్యేక సమావేశాలు మీ దుష్ట సమావేశాలు నేను భరించలేను.

  7. మీ అమావాస్య ఉత్సవాలు, నియమించబడిన పండుగలు నా పూర్ణాత్మతో నేను అసహ్యిస్తున్నాను. అవి నాకు భారంగా ఉన్నాయి; వాటిని భరించలేక అలిసిపోయాను.

  8. ప్రార్థనలో మీరు మీ చేతులు చాచినప్పుడు, మిమ్మల్ని చూడకుండ కళ్లు కప్పుకుంటాను; మీరు చాలా ప్రార్థనలు చేసినా నేను వినను. “మీ చేతులు రక్తంతో నిండిపోయాయి!