Skip to content

Wicked గురించి బైబిల్ వచనాలు

724 వచనాలు · 18 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు ఎంత తరచుగా గాలి ముందు ఉనకలా, తుఫానుకు కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు?

  2. ‘దేవుడు దుష్టుల శిక్షను వారి పిల్లల కోసం దాచి ఉంచుతాడు’ అని చెప్పబడింది. వారు చేసిన దానిని వారే అనుభవించేలా, దుష్టులకు ఆయనను తిరిగి చెల్లించనివ్వండి.

  3. వారి కళ్లు వారి నాశనాన్ని చూడాలి; సర్వశక్తిమంతుని ఉగ్రత పాత్రను వారు త్రాగాలి.

  4. వారికి నియమించబడిన నెలలు ముగిసిపోయినప్పుడు వారు విడిచి వెళ్లే తమ కుటుంబాల గురించి వారేమి శ్రద్ధ తీసుకోగలరు?

  5. “అత్యంత ఉన్నతమైన వారికి ఆయన తీర్పు తీరుస్తారు, అలాంటి దేవునికి తెలివిని ఎవరైనా బోధించగలరా?

  6. ఒక వ్యక్తి పూర్ణ శక్తి, సంపూర్ణ భద్రత, అభివృద్ధి,

  7. బాగా పోషించబడిన శరీరం, ఎముకల్లో సమృద్ధి మూలిగ కలిగి ఉండి చస్తాడు.

  8. మరొకరు ఎన్నడు ఏ మంచిని అనుభవించకుండానే, మనోవేదనతో చనిపోతారు.

  9. మట్టిలో వారు ఒకరి ప్రక్కన ఒకరు పడుకుంటారు, వారిద్దరిని పురుగులు కప్పివేస్తాయి.

  10. “మీరేమి ఆలోచిస్తున్నారో, నామీద ఏ కుట్రలు చేస్తున్నారో నాకు తెలుసు.

  11. ‘ఇప్పుడు గొప్పవారి గృహం ఎక్కడ, దుష్టులు నివసించిన గుడారాలు ఎక్కడ?’ అని మీరంటారు.

  12. ప్రయాణం చేసేవారిని మీరు ఎప్పుడు అడగలేదా? వారు చెప్పినవాటిని మీరు గుర్తుపట్టలేదా?

  13. అవేమంటే, విపత్తు దినం నుండి దుష్టులు వదిలి వేయబడతారు, ఉగ్రత దినం నుండి ఎలా తప్పించుకుంటారు?

  14. వారి ముఖం మీదనే వారి ప్రవర్తన గురించి ఎవరు ఖండిస్తారు? వారు చేసిన వాటికి ఎవరు వారికి తిరిగి చెల్లిస్తారు?

  15. వారు సమాధికి మోయబడతారు, వారి సమాధులపై నిఘా పెట్టబడుతుంది.

  16. లోయలోని మట్టి వారికి తీపి; మనుష్యులంతా వారిని వెంబడిస్తారు, అలాగే లెక్కలేనంత జనసమూహం వారికి ముందుగా వెళ్తారు.

  17. నీ దుష్టత్వం గొప్పది కాదా? నీ పాపాలు అంతులేనివి కావా?

  18. “దేవునికి లొంగి ఆయనతో నీవు సమాధానంగా ఉండు; దీనివలన నీకు వృద్ధి కలుగుతుంది.

  19. ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అంగీకరించు ఆయన మాటలను నీ హృదయంలో నిలుపుకో.

  20. ఒకవేళ నీవు సర్వశక్తిమంతుని వైపు తిరిగితే, నీవు మళ్ళీ పునరుద్ధరించబడతావు: నీ గుడారంలో నుండి దుష్టత్వాన్ని నీవు తొలగించి

  21. నీ బంగారాన్ని మట్టిలో ఓఫీరు బంగారాన్ని కనుమల రాళ్లలో పారవేస్తే,

  22. అప్పుడు సర్వశక్తిమంతుడు నీకు బంగారం, నీకు ప్రశస్తమైన వెండి అవుతాడు.

  23. అప్పుడు నీవు ఖచ్చితంగా సర్వశక్తిమంతునిలో ఆనందిస్తావు దేవుని వైపు నీ ముఖాన్ని ఎత్తుతావు.

  24. నీవు ఆయనకు ప్రార్థన చేస్తావు, ఆయన నీ మనవి వింటారు, నీవు నీ మ్రొక్కుబడులను చెల్లిస్తావు.

  25. నీవు ఏది నిర్ణయించుకొంటే అది నీకు జరుగుతుంది, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది.