Skip to content

Wicked గురించి బైబిల్ వచనాలు

724 వచనాలు · 18 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు సూర్యరశ్మిలో సమృద్ధి నీరు కలిగిన వాటిలా పచ్చగా ఉంటూ, వాటి తీగలు వారి తోటమీద అల్లుకుంటూ విస్తరిస్తారు.

  2. దాని వేర్లు రాళ్ల చుట్టూ చుట్టుకొని, రాళ్ల మధ్యకు చొచ్చుకుపోవాలని చూస్తుంది.

  3. ఆ చోటు నుండి అది తెంచివేయబడినప్పుడు, ఆ చోటు ‘నేను నిన్నెప్పుడు చూడలేదు’ అంటూ దానిని నిరాకరిస్తుంది.

  4. బందిపోటు దొంగల గుడారాలు ప్రశాంతంగా ఉంటాయి, దేవునికి కోపం పుట్టించే వారు సురక్షితంగా ఉంటారు, వారి దేవుడు వారి చేతిలోనే ఉన్నాడు.

  5. అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని ఎవరు తీసుకురాగలరు? ఎవరు తీసుకురాలేరు!

  6. ఇక చెడును నీటిలా త్రాగే నీచులు, అవినీతిపరులు, ఆయన దృష్టికి ఇంకెంత అల్పులు!

  7. దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధ అనుభవిస్తాడు. క్రూరమైనవాడు తనకు నియమించిన సంవత్సరాలన్నీ బాధ అనుభవిస్తాడు.

  8. భయంకరమైన శబ్దాలు వాని చెవుల్లో మ్రోగుతాయి. అంతా క్షేమంగా ఉన్నప్పుడు నాశనం చేసేవారు అతనిపై దాడి చేస్తారు.

  9. చీకటిని తప్పించుకుంటాడనే నమ్మకం అతనికి లేదు; అతడు ఖడ్గం పాలవుతాడు.

  10. అతడు ఆహారం కోసం రాబందులా చుట్టూ తిరుగుతాడు; చీకటి రోజులు సమీపించాయని అతనికి తెలుసు.

  11. శ్రమ వేదన అతన్ని భయపెడతాయి; యుద్ధానికి సిద్ధమైన రాజులా అవి అతన్ని ముంచెత్తుతాయి,

  12. ఎందుకంటే, అతడు దేవునికి విరోధంగా చేయి చాపాడు సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల గర్వంగా ప్రవర్తించాడు.

  13. అతడు మందంగా ఉన్న బలమైన డాలుతో ధిక్కారంగా దేవుని మీదికి దండెత్తుతాడు.

  14. “వాని ముఖం క్రొవ్వుపట్టి ఉన్నప్పటికీ అతని నడుము క్రొవ్వుతో ఉబ్బినప్పటికి,

  15. అతడు పాడైపోయిన పట్టణాల్లో ఎవరు నివసించని ఇళ్ళలో, శిధిలమైపోతున్న ఇళ్ళలో నివసిస్తాడు.

  16. ఇక ఎప్పటికీ అతడు ధనవంతునిగా ఉండడు అతని సంపద నిలబడదు. అతని ఆస్తులు భూమిలో విస్తరించవు.

  17. అతడు చీకటిని తప్పించుకోలేడు అతని లేత మొక్కలను అగ్ని కాల్చివేస్తుంది, దేవుని నోటి ఊపిరిచేత అతడు చనిపోతాడు.

  18. అతడు వ్యర్థమైన దానిని నమ్మి తనను తాను మోసగించుకోవద్దు ఎందుకంటే అతనికి ప్రతిఫలం ఏమి ఉండదు.

  19. అతని కాలం పూర్తి కాక ముందే వాడిపోతాడు, అతని కొమ్మలు వృద్ధిచెందవు.

  20. పిందెలు రాలిపోయే ద్రాక్ష చెట్టులా, పువ్వులు రాలిపోయే ఒలీవ చెట్టులా అతడు ఉంటాడు.

  21. భక్తిలేనివారి సహచరులు నిస్సారంగా ఉంటారు, లంచాలు ప్రేమించేవారి గుడారాలను అగ్ని కాల్చివేస్తుంది.

  22. వారు దుష్టత్వాన్ని గర్భం ధరించి చెడును కంటారు. వారి కడుపున మోసం పుడుతుంది.”

  23. “దుర్మార్గుల దీపం ఆర్పివేయబడుతుంది; వారి అగ్నిజ్వాలలు మండవు.

  24. వారి గుడారంలో వెలుగు చీకటిగా అవుతుంది; వారి దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.

  25. వారి బలమైన అడుగులు బలహీనపడతాయి; వారి సొంత ఆలోచనలే వారిని పడగొడతాయి.