Skip to content

Samuel గురించి బైబిల్ వచనాలు

135 వచనాలు · 22 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు సమూయేలు వారితో, “అటువంటిది నా దగ్గర ఏదీ మీకు దొరకదని యెహోవా ఆయన అభిషేకం చేయించిన వాడు ఈ రోజు మీమీద సాక్షులుగా ఉన్నారు” అన్నాడు. “యెహోవాయే సాక్షి” అని వారు జవాబిచ్చారు.

  2. అయితే సమూయేలు అతన్ని, “నీవు చేసిన పని ఏమిటి?” అని అడిగాడు. అందుకు సౌలు, “నిర్ణయించిన సమయానికి నీవు రాకపోవడం, ప్రజలు నా దగ్గర నుండి చెదిరిపోవడం, ఫిలిష్తీయులు మిక్మషులో సమావేశమవ్వడం చూసి,

  3. ‘నేను ఇంకా యెహోవా దయను పొందక ముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద దాడిచేస్తారేమో’ అని అనుకున్నాను. కాబట్టి బలవంతంగా నేనే దహనబలి అర్పించాను” అన్నాడు.

  4. అందుకు సమూయేలు, “నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా నీవు బుద్ధిలేని పని చేశావు; నీ రాజ్యాన్ని ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచాలని యెహోవా తలంచారు.

  5. అయితే ఇప్పుడు నీ రాజ్యం నిలబడదు. ఎందుకంటే యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు చేయలేదు. కాబట్టి యెహోవా ఒక మనుష్యుని కనుగొన్నాడు, అతడు తన హృదయానుసారుడైన మనుష్యుడు. ఆయన అతన్ని తన ప్రజల మీద రాజుగా నియమించారు” అన్నాడు.

  6. తర్వాత సమూయేలు గిల్గాలు విడిచిపెట్టి బెన్యామీనీయుల గిబియాకు వచ్చాడు; సౌలు తన దగ్గర ఉన్న మనుష్యులను లెక్కపెట్టగా వారు దాదాపు ఆరువందలమంది ఉన్నారు.

  7. అలా దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చి సౌలు తనకు చేసినదంతా అతనికి చెప్పాడు. అప్పుడు అతడు అతనితో పాటు సమూయేలు బయలుదేరి నాయోతుకు వచ్చి అక్కడ నివసించారు.

  8. కొంతకాలానికి సమూయేలు చనిపోయాడు, ఇశ్రాయేలీయులందరు ఒకచోట చేరి అతని కోసం ఏడ్చారు; రామాలో అతని ఇంటి దగ్గర అతన్ని సమాధి చేసిన తర్వాత దావీదు బయలుదేరి పారాను ఎడారిలోనికి వెళ్లాడు.

  9. సమూయేలు చనిపోగా ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులు అతని గురించి దుఃఖించి అతని పట్టణమైన రామాలో అతన్ని సమాధి చేశారు. గతంలో సౌలు మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని దేశం నుండి వెళ్లగొట్టాడు.

  10. ఫిలిష్తీయులు దండెత్తివచ్చి షూనేములో శిబిరం ఏర్పాటు చేసుకున్నప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిని సమకూర్చి గిల్బోవలో శిబిరం ఏర్పాటు చేశాడు.

  11. సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినప్పుడు అతని హృదయం భయంతో నిండిపోయింది.

  12. సౌలు యెహోవా దగ్గర విచారణ చేశాడు కాని కలల ద్వారా గాని ఊరీము ద్వారా గాని ప్రవక్తల ద్వారా గాని అతనికి సమాధానం రాలేదు.

  13. సౌలు తన సహాయకులకు, “మీరు వెళ్లి మృతుల ఆత్మలతో మాట్లాడే స్త్రీని వెదకండి, అప్పుడు నేను వెళ్లి ఆమె దగ్గర విచారణ చేస్తాను” అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వారు, “ఎన్-దోరులో ఒక స్త్రీ ఉంది” అని చెప్పారు.

  14. కాబట్టి సౌలు మారువేషం వేసుకుని వేరే బట్టలు ధరించి ఇద్దరు మనుష్యులతో పాటు బయలుదేరి రాత్రివేళ ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, “చనిపోయినవారి ఆత్మతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పేవాన్ని రప్పించు” అని అడిగాడు.

  15. అయితే ఆ స్త్రీ అతనితో, “సౌలు ఏమి చేశాడో నీకు తెలుసు కదా; అతడు మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని దేశంలో ఉండకుండ వారిని తొలగించాడు. నాకు మరణం వచ్చేలా నా ప్రాణానికి ఎందుకు ఉచ్చు బిగిస్తున్నావు?” అన్నది.

  16. అందుకు సౌలు ఆమెతో, “సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, ఇలా చేసినందుకు నీవు శిక్షించబడవు” అని యెహోవాను బట్టి ప్రమాణం చేశాడు.

  17. అప్పుడు ఆ స్త్రీ, “నీతో మాట్లాడడానికి నేనెవరిని రప్పించాలి?” అని అడిగింది. అందుకతడు, “సమూయేలును రప్పించు” అన్నాడు.

  18. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు చాలా గట్టిగా కేక వేసి, “నీవు సౌలువే కదా నీవు నన్నెందుకు మోసం చేశావు?” అని సౌలును అడిగింది.

  19. అందుకు రాజు ఆమెతో, “భయపడకు, నీకు ఏమి కనబడింది?” అని అడిగాడు. ఆమె, “దేవుళ్ళలో ఒకడు భూమిలో నుండి పైకి రావడం నేను చూశాను” అని చెప్పింది.

  20. అందుకు, “అతని రూపం ఎలా ఉంది?” అని అడిగాడు. ఆమె, “దుప్పటి కప్పుకున్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడు” అన్నది. సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని మోకరించి సాష్టాంగపడ్డాడు.

  21. అప్పుడు సమూయేలు సౌలును, “నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టావు?” అని అడిగాడు. అందుకు సౌలు, “నేను చాలా బాధల్లో ఉన్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వస్తే దేవుడు నా నుండి దూరమయ్యారు. ప్రవక్తల ద్వారా గాని కలల ద్వారా గాని ఆయన నాకు ఏ సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఏం చేయాలో నాకు చెప్తావని నిన్ను పిలిచాను” అన్నాడు.

  22. అందుకు సమూయేలు, “యెహోవా నిన్ను విడిచిపెట్టి నీకు శత్రువైనప్పుడు నీవు నన్ను ఎందుకు అడుగుతావు?

  23. యెహోవా నా ద్వారా ప్రవచించిన దానిని నెరవేర్చారు. యెహోవా నీ చేతి నుండి రాజ్యాన్ని తీసివేసి దానిని నీ పొరుగువాడైన దావీదుకు ఇచ్చారు.

  24. నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకుండా అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపాన్ని అమలు చేయలేదు కాబట్టి యెహోవా ఈ రోజు నీకు ఈ విధంగా చేస్తున్నారు.

  25. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తారు, రేపు నీవు నీ కుమారులు నాతో పాటు ఉంటారు. యెహోవా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని కూడా ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తారు” అని సౌలుతో చెప్పాడు.