Samuel గురించి బైబిల్ వచనాలు: His integrity as judge and ruler
His integrity as judge and ruler గురించి వచనాలు
అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో, “మీరు నాతో చెప్పిన వాటన్నిటిని నేను విని మీమీద ఒకరిని రాజుగా నియమించాను.
మిమ్మల్ని ముందుండి నడిపించడానికి మీకు ఒక రాజు ఉన్నాడు. నేనైతే తలనెరిసి ముసలివాడినయ్యాను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. చిన్ననాటి నుండి ఈ రోజు వరకు నేను మిమ్మల్ని నడిపించాను.
ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎవరి ఎద్దునైనా తీసుకున్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకున్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధ పెట్టానా? న్యాయాన్ని చూడకుండ కళ్లు మూసుకోవడానికి ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా? నేను అలా చేసి ఉంటే యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వారు నా మీద సాక్ష్యం చెప్పండి, అప్పుడు నేను మీకు వాటిని తిరిగి ఇచ్చేస్తాను” అన్నాడు.
అందుకు వారు, “నీవు మాకు ఏ అన్యాయం చేయలేదు ఏ బాధ కలిగించలేదు; ఎవరి దగ్గర నుండి నీవు దేన్ని తీసుకోలేదు” అని చెప్పారు.
అప్పుడు సమూయేలు వారితో, “అటువంటిది నా దగ్గర ఏదీ మీకు దొరకదని యెహోవా ఆయన అభిషేకం చేయించిన వాడు ఈ రోజు మీమీద సాక్షులుగా ఉన్నారు” అన్నాడు. “యెహోవాయే సాక్షి” అని వారు జవాబిచ్చారు.
దేవునికి చెందిన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు, యెహోవా నామాన ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు; వారు దేవునికి ప్రార్థన చేశారు, ఆయన జవాబిచ్చారు.
అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “మోషే, సమూయేలు నా ముందు నిలబడినా, నా హృదయం ఈ ప్రజల వైపుకు వెళ్లదు. వారిని నా సన్నిధి నుండి దూరంగా పంపివేయి! వారిని వెళ్లనివ్వు!
ఇంకా నేనేం చెప్పాలి? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనేవారి గురించి, ప్రవక్తల గురించి వివరించడానికి నాకు సమయం లేదు.