Skip to content

Reproof గురించి బైబిల్ వచనాలు

165 వచనాలు · 70 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది.బహుశ షమినీతు ఎనిమిది తంతుల వాయిద్యం కావచ్చు.దావీదు కీర్తన. యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి మీ ఉగ్రతలో నన్ను శిక్షించకండి.

  2. యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది. యెహోవా కట్టడలు నమ్మదగినవి, అవి సామాన్యులకు జ్ఞానాన్ని ఇస్తాయి.

  3. యెహోవా కట్టడలు సరియైనవి, హృదయానికి ఆనందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి, కళ్లకు కాంతి కలిగిస్తాయి.

  4. యెహోవా పట్ల భయం స్వచ్ఛమైనది, నిరంతరం నిలుస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి, అవన్నీ నీతియుక్తమైనవి.

  5. అవి బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనవి; తేనె కంటే, తేనెపట్టు నుండి వచ్చే ధారల కంటే మధురమైనవి.

  6. వాటి వల్ల మీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు; వాటిని పాటించడం వలన గొప్ప బహుమానం దొరుకుతుంది.

  7. మీరు మనుష్యులను వారి పాపం విషయంలో మందలించినప్పుడు, చిమ్మెటలా మీరు వారి సంపదను హరించివేస్తారు. మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా

  8. మీరు ఇవి చేసినప్పుడు నేను మౌనంగా ఉన్నాను, నేను మీలాంటి వాణ్ణే అని మీరనుకున్నారు. కాని నేనిప్పుడు మిమ్మల్ని నిలదీస్తున్నాను, నా ఆరోపణలను మీ ముందు పెడుతున్నాను.

  9. యెహోవా శిక్షణ చేసినవారు ధన్యులు, వారికి మీ ధర్మశాస్త్రం నుండి మీరు బోధిస్తారు.

  10. నాకు బాధ కలుగకముందు నేను త్రోవ తప్పి తిరిగాను, కాని ఇప్పుడు నేను మీ వాక్కుకు లోబడుతున్నాను.

  11. నాకు బాధ కలగడం మేలైంది తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను.

  12. యెహోవా, మీ న్యాయవిధులు నీతిగలవని నాకు తెలుసు, నమ్మకత్వంలో మీరు నన్ను బాధించారని నాకు తెలుసు.

  13. నీతిమంతులు నన్ను కొట్టడం నామీద దయ చూపడమే; వారు నన్ను మందలించడం నాకు తైలాభిషేకమే. నా తల దానిని నిరాకరించదు, కీడుచేసేవారి క్రియలకు విరుద్ధంగా నా ప్రార్థన మాత్రం మానను.

  14. వారు నా సలహాను అంగీకరించలేదు నా గద్దింపును కూడా త్రోసివేశారు కాబట్టి,

  15. అప్పుడు మీరంటారు, “నేను క్రమశిక్షణను అసహ్యించుకోవడమేంటి! నా హృదయం దిద్దుబాటును తిరస్కరించడమేంటి!

  16. ఈ ఆజ్ఞ దీపంగా ఈ బోధ వెలుగుగా క్రమశిక్షణ కోసమైన దిద్దుబాట్లుగా జీవమార్గాలుగా ఉండి,

  17. వెక్కిరించు వానికి బుద్ధి చెప్పు వాడు తనకు అవమానాన్ని తెచ్చుకుంటాడు; దుష్టులు వానిని గద్దించు వారు నిందను తెచ్చుకుంటారు.

  18. హేళనగా మాట్లాడు వానిని గద్దించకు లేకపోతే వాడు నిన్ను ద్వేషిస్తాడు; తెలివిగల వానిని గద్దిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు.

  19. క్రమశిక్షణ పాటించేవారు జీవితానికి మార్గం చూపుతారు, కాని దిద్దుబాటును పట్టించుకోనివారు ఇతరులను దారి తప్పిస్తారు.

  20. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు, కానీ దిద్దుబాటును అసహ్యించేవాడు మూర్ఖుడు.

  21. శిక్షను తిరస్కరించేవారికి అవమానం దారిద్ర్యం కలుగుతాయి అయితే దిద్దుబాటును స్వీకరించేవారు ఘనత పొందుతారు.

  22. మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు కాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు.

  23. దారితప్పిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు చావునొందుదురు.

  24. ఎగతాళి చేసేవారికి సరిదిద్దేవారంటే ఇష్టముండదు, కాబట్టి జ్ఞానుల దగ్గరకు వెళ్లరు.

  25. జీవితాన్ని ప్రసాదించే దిద్దుబాటును అంగీకరించేవారు జ్ఞానుల సహవాసంలో ఉంటారు.