కంటెంట్‌కు వెళ్లండి

Repentance గురించి బైబిల్ వచనాలు

343 వచనాలు · 65 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎందుకంటే ఆయన మన దేవుడు మనం ఆయన పచ్చికలోని ప్రజలం, ఆయన శ్రద్ధచూపే మంద. నేడు, ఆయన స్వరాన్ని ఒకవేళ మీరు వింటే మంచిది,

  2. “మీరు మెరీబా దగ్గర చేసినట్టుగా, అరణ్యంలో మస్సా దగ్గర చేసినట్టుగా మీ హృదయాలను కఠినం చేసుకోకండి.

  3. దేవుడు తన నిబంధనను తలచుకొన్నాడు. వారి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాడు. తన మారని ప్రేమను బట్టి వారిని కనికరించాడు.

  4. “మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు” అని యెహోవా ప్రమాణం చేశారు ఆయన తన మనస్సు మార్చుకోరు.

  5. యెహోవా తన ప్రజలకు శిక్ష విముక్తి జరిగిస్తారు, ఆయన సేవకులపై దయ కలిగి ఉంటారు.

  6. విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు. వారి గాయాలను నయం చేస్తారు.

  7. “బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు బుద్ధిహీనుని మార్గాలను ప్రేమిస్తారు? ఎగతాళి చేసేవారు ఎన్నాళ్ళు ఎగతాళి చేస్తూ ఆనందిస్తారు? బుద్ధిహీనులు ఎన్నాళ్ళు తెలివిని అసహ్యించుకుంటారు?

  8. నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి! అప్పుడు నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాలను మీకు తెలియజేస్తాను.

  9. కానీ నేను పిలిచినప్పుడు మీరు వినడానికి నిరాకరించినందున నేను నా చేయి చాచినప్పుడు ఎవరూ పట్టించుకోనందున,

  10. మీరు నా సలహాను లెక్కచేయనందున నా గద్దింపును అంగీకరించనందున,

  11. ఆపద మిమ్మల్ని తాకినప్పుడు నేను నవ్వుతాను; విపత్తు మిమ్మల్ని అధిగమించినప్పుడు నేను ఎగతాళి చేస్తాను,

  12. విపత్తు తుఫానులా మిమ్మల్ని అధిగమించినప్పుడు, ఆపద మిమ్మల్ని తుఫానులా ముంచినప్పుడు, మీకు బాధ ఇబ్బంది కలిగినప్పుడు నేను ఎగతాళి చేస్తాను.

  13. “అప్పుడు వారు నాకు మొరపెడతారు కాని నేను జవాబు ఇవ్వను; నా కోసం ఆతురతగా వెదకుతారు కాని నేను కనబడను,

  14. వారు జ్ఞానాన్ని అసహ్యించుకున్నారు, యెహోవాకు భయపడాలని వారు కోరలేదు కాబట్టి.

  15. వారు నా సలహాను అంగీకరించలేదు నా గద్దింపును కూడా త్రోసివేశారు కాబట్టి,

  16. వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు.

  17. మూర్ఖులు దారితప్పడం వల్ల నశిస్తారు, బుద్ధిహీనుల నిర్లక్ష్యం వారిని నాశనం చేస్తుంది;

  18. నా మాటలను వినేవారు క్షేమంగా నివసిస్తారు; కీడు కలుగుతుందనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు.”

  19. ఇకపై తెలివి లేనివారిగా ఉండకుండా బ్రతుకండి; తెలివిని కలిగించు దారిలో చక్కగా నడపండి.”

  20. రేపటిని గురించి గొప్పగా చెప్పుకోవద్దు, ఎందుకంటే ఏ రోజు ఏమి తెస్తుందో నీకు తెలియదు.

  21. తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు, కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు.

  22. “మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి. మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి; తప్పు చేయడం మానండి.

  23. సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి. అణచివేయబడుతున్న వారి పక్షాన ఉండండి. తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి. విధవరాలి పక్షాన వాదించండి.

  24. మిగిలినవారు తిరిగి వస్తారు, యాకోబులో మిగిలినవారు బలవంతుడైన దేవుని వైపు తిరుగుతారు.

  25. ఆ రోజున ఏడ్వడానికి కన్నీరు కార్చడానికి తలలు గొరిగించుకోడానికి గోనెపట్ట కట్టుకోడానికి సైన్యాల అధిపతియైన యెహోవా మిమ్మల్ని పిలుస్తారు.