కంటెంట్‌కు వెళ్లండి

Repentance గురించి బైబిల్ వచనాలు: The present time the season for

8 వచనాలు · 65 కోణాలు

The present time the season for గురించి వచనాలు

  1. ఎందుకంటే ఆయన మన దేవుడు మనం ఆయన పచ్చికలోని ప్రజలం, ఆయన శ్రద్ధచూపే మంద. నేడు, ఆయన స్వరాన్ని ఒకవేళ మీరు వింటే మంచిది,

  2. “మీరు మెరీబా దగ్గర చేసినట్టుగా, అరణ్యంలో మస్సా దగ్గర చేసినట్టుగా మీ హృదయాలను కఠినం చేసుకోకండి.

  3. రేపటిని గురించి గొప్పగా చెప్పుకోవద్దు, ఎందుకంటే ఏ రోజు ఏమి తెస్తుందో నీకు తెలియదు.

  4. యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి; ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి.

  5. అయితే, “నా అనుకూల సమయంలో నీ మొర ఆలకించాను, రక్షణ దినాన నేను నీకు సహాయం చేశాను” అని ఆయన చెప్తున్నారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని మీకు నేను చెప్తున్నాను.

  6. కాబట్టి, పరిశుద్ధాత్మ చెప్పినట్లు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,

  7. అరణ్యంలో శోధన సమయంలో, మీరు తిరుగుబాటు చేసిన విధంగా, మీ హృదయాలను కఠినం చేసుకోకండి;

  8. మరల దేవుడు ఒక దినాన్ని సిద్ధపరచి దాన్ని “నేడు” అని పిలిచారు. వాక్యంలో వ్రాయబడిన ప్రకారం చాలా కాలం తర్వాత ఆయన దావీదు ద్వారా కూడా ఇదే మాటను మాట్లాడారు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే, మీ హృదయాలను కఠినం చేసుకోకండి.”