కంటెంట్‌కు వెళ్లండి

Repentance గురించి బైబిల్ వచనాలు: Shame and confusion

15 వచనాలు · 65 కోణాలు

Shame and confusion గురించి వచనాలు

  1. ఇలా ప్రార్థించాను: “నా దేవా, నా ముఖాన్ని మీ వైపు ఎత్తడానికి నాకు చాలా సిగ్గుగా, అవమానంగా ఉంది. మా పాపాలు మా తల కన్న ఎత్తుగా ఉన్నాయి, మా అపరాధం ఆకాశాన్ని అంటింది.

  2. మా పూర్వికుల రోజులనుండి నేటివరకు మేము చాలా ఘోరమైన అపరాధాలు చేశాము. మా పాపం కారణంగా ఈ రోజు ఉన్నట్లు మేము, మా రాజులు, యాజకులు పరాయి రాజుల చేతి అప్పగించబడి ఖడ్గానికి, బానిసత్వానికి, దోపిడికి, అవమానానికి గురైయ్యాము.

  3. “అయితే ఇప్పుడు, మా దేవుడైన యెహోవా ప్రార్థనకు జవాబుగా మా కళ్ళకు వెలుగిచ్చి మా బానిసత్వం నుండి కొంత ఉపశమనం కలిగేలా మాలో కొందరిని తప్పించి, తన పరిశుద్ధాలయంలో స్థిరమైన స్థలాన్ని ఇచ్చి, మా దేవుడు కొంతమట్టుకు మా పట్ల దయ చూపించారు.

  4. మేము బానిసలుగా ఉన్నప్పటికీ, మా దేవుడు మా దాస్యంలో మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన పర్షియా రాజుల ఎదుట మామీద దయ చూపించారు. దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి, దానికి మరమ్మత్తు చేయడానికి, ఆయన మాకు నూతన జీవాన్ని ఇచ్చారు. యూదాలో, యెరూషలేములో ఆయన మాకు రక్షణ గోడగా ఉన్నారు.

  5. “అయితే ఇప్పుడు, మా దేవా, ఇంత జరిగిన తర్వాత మేము ఏమి చెప్పగలము? మీ సేవకులైన ప్రవక్తల ద్వారా మీరు ఇచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టాము. వారు, ‘మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం అక్కడి ప్రజల అపవిత్రత వలన కలుషితమైపోయింది. తమ అసహ్యకరమైన ఆచారాలతో వారు దేశాన్ని ఆ చివర నుండి ఈ చివర వరకు నింపేశారు.

  6. Which thou hast commanded by thy servants the prophets, saying, The land, unto which ye go to possess it, is an unclean land with the filthiness of the people of the lands, with their abominations, which have filled it from one end to another with their uncleanness.

  7. కాబట్టి మీ కుమార్తెలకు వారి కుమారులతో గాని, మీ కుమారులకు వారి కుమార్తెలతో గాని పెళ్ళి చేయవద్దు. ఎప్పటికీ వారితో స్నేహ ఒప్పందం కోరవద్దు, అప్పుడు మీరు బలవంతులుగా ఉండి, ఆ దేశంలోని మంచి వాటిని తిని, మీ పిల్లలకు శాశ్వతమైన వారసత్వంగా దానిని అప్పగిస్తారు’ అని చెప్పారు.

  8. “మేము చేసిన చెడు పనులకు, మా గొప్ప అపరాధానికి ఫలితంగా ఇలా మాకు జరిగింది. అయినప్పటికీ, మా దేవుడవైన మీరు మా దోషాలకు తగిన పూర్తి శిక్షను మాకు విధించకుండా ఈ విధంగా కొంతమందిని దాస్యం నుండి తప్పించారు.

  9. ఇంత జరిగాక, మేము మరలా మీ ఆజ్ఞలు పాటించకుండా ఇలాంటి అసహ్యకరమైన ఆచారాలు పాటించే ప్రజలతో వియ్యమందుతామా? మాలో ఒక్కరు తప్పించుకుని మిగిలిపోకుండ మీరు మమ్మల్ని నాశనం చేసేంతగా కోప్పడతారు గదా?

  10. యెహోవా, ఇశ్రాయేలు దేవా, మీరు నీతిమంతులు! ఈ రోజున మేము కొద్ది మందిమి మిగిలాము. మేము మీ ముందు నిలబడడానికి మేమెవరం అర్హులం కాకపోయిన, మీ ఎదుట మా అపరాధంలో నిలబడ్డాము.”

  11. నేను దారితప్పిన తర్వాత, పశ్చాత్తాపపడ్డాను; నేను అర్థం చేసుకున్న తర్వాత, నా రొమ్ము కొట్టుకున్నాను. నా యవ్వనంలో కలిగిన అవమానాన్ని భరిస్తూ, నేను సిగ్గుపడ్డాను అవమానపాలయ్యాను.’

  12. నీవు నీ అక్కచెల్లెళ్లను కలుసుకున్నప్పుడు నీ మార్గాలను జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడతావు. నీతో నా ఒడంబడికలో భాగం కాకపోయినా నేను వారిని నీకు కుమార్తెలుగా ఇస్తాను.

  13. నీవు చేసిన వాటన్నిటికి నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు నీవు వాటిని జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడతావు, నీ అవమానాన్ని బట్టి ఇక ఎన్నటికీ నోరు విప్పవు, ఇదే యెహోవా వాక్కు.’ ”

  14. “ప్రభువా! మీరు నీతిమంతులు, కాని ఈ రోజు మేమైతే అనగా మీ పట్ల మేము చూపిన నమ్మకద్రోహాన్ని బట్టి ఆయా దేశాలకు చెదరగొట్టబడిన యూదా ప్రజలం, యెరూషలేము నివాసులం, ఇశ్రాయేలీయులం, దగ్గరగా దూరంగా ఉన్నవారమందరం అవమానంతో నిండిపోయాము.

  15. యెహోవా, మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి మేము, మా రాజులు, అధిపతులు, పూర్వికులు అవమానంతో కప్పబడ్డాము.