Skip to content

Repentance గురించి బైబిల్ వచనాలు

343 వచనాలు · 65 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మా పూర్వికుల రోజులనుండి నేటివరకు మేము చాలా ఘోరమైన అపరాధాలు చేశాము. మా పాపం కారణంగా ఈ రోజు ఉన్నట్లు మేము, మా రాజులు, యాజకులు పరాయి రాజుల చేతి అప్పగించబడి ఖడ్గానికి, బానిసత్వానికి, దోపిడికి, అవమానానికి గురైయ్యాము.

  2. “అయితే ఇప్పుడు, మా దేవుడైన యెహోవా ప్రార్థనకు జవాబుగా మా కళ్ళకు వెలుగిచ్చి మా బానిసత్వం నుండి కొంత ఉపశమనం కలిగేలా మాలో కొందరిని తప్పించి, తన పరిశుద్ధాలయంలో స్థిరమైన స్థలాన్ని ఇచ్చి, మా దేవుడు కొంతమట్టుకు మా పట్ల దయ చూపించారు.

  3. మేము బానిసలుగా ఉన్నప్పటికీ, మా దేవుడు మా దాస్యంలో మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన పర్షియా రాజుల ఎదుట మామీద దయ చూపించారు. దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి, దానికి మరమ్మత్తు చేయడానికి, ఆయన మాకు నూతన జీవాన్ని ఇచ్చారు. యూదాలో, యెరూషలేములో ఆయన మాకు రక్షణ గోడగా ఉన్నారు.

  4. “అయితే ఇప్పుడు, మా దేవా, ఇంత జరిగిన తర్వాత మేము ఏమి చెప్పగలము? మీ సేవకులైన ప్రవక్తల ద్వారా మీరు ఇచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టాము. వారు, ‘మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం అక్కడి ప్రజల అపవిత్రత వలన కలుషితమైపోయింది. తమ అసహ్యకరమైన ఆచారాలతో వారు దేశాన్ని ఆ చివర నుండి ఈ చివర వరకు నింపేశారు.

  5. Which thou hast commanded by thy servants the prophets, saying, The land, unto which ye go to possess it, is an unclean land with the filthiness of the people of the lands, with their abominations, which have filled it from one end to another with their uncleanness.

  6. కాబట్టి మీ కుమార్తెలకు వారి కుమారులతో గాని, మీ కుమారులకు వారి కుమార్తెలతో గాని పెళ్ళి చేయవద్దు. ఎప్పటికీ వారితో స్నేహ ఒప్పందం కోరవద్దు, అప్పుడు మీరు బలవంతులుగా ఉండి, ఆ దేశంలోని మంచి వాటిని తిని, మీ పిల్లలకు శాశ్వతమైన వారసత్వంగా దానిని అప్పగిస్తారు’ అని చెప్పారు.

  7. “మేము చేసిన చెడు పనులకు, మా గొప్ప అపరాధానికి ఫలితంగా ఇలా మాకు జరిగింది. అయినప్పటికీ, మా దేవుడవైన మీరు మా దోషాలకు తగిన పూర్తి శిక్షను మాకు విధించకుండా ఈ విధంగా కొంతమందిని దాస్యం నుండి తప్పించారు.

  8. ఇంత జరిగాక, మేము మరలా మీ ఆజ్ఞలు పాటించకుండా ఇలాంటి అసహ్యకరమైన ఆచారాలు పాటించే ప్రజలతో వియ్యమందుతామా? మాలో ఒక్కరు తప్పించుకుని మిగిలిపోకుండ మీరు మమ్మల్ని నాశనం చేసేంతగా కోప్పడతారు గదా?

  9. యెహోవా, ఇశ్రాయేలు దేవా, మీరు నీతిమంతులు! ఈ రోజున మేము కొద్ది మందిమి మిగిలాము. మేము మీ ముందు నిలబడడానికి మేమెవరం అర్హులం కాకపోయిన, మీ ఎదుట మా అపరాధంలో నిలబడ్డాము.”

  10. కానీ ఒకవేళ మీరు నా వైపు తిరిగి, నా ఆజ్ఞలను అనుసరిస్తే చెరగొనిపోబడిన మీ ప్రజలు ఎంత దూరంలో ఉన్నా నేను వారిని అక్కడినుండి సమకూర్చి నా పేరు కోసం నేను నివాసంగా ఎంచుకున్న ప్రదేశానికి వారిని తీసుకువస్తాను.’

  11. “నీవు నీ హృదయాన్ని సమర్పించుకొని, నీ చేతులు ఆయన వైపు చాపితే,

  12. నీ చేతిలో ఉన్న పాపాన్ని నీవు విడిచిపెడితే నీ గుడారంలో చెడుకు చోటివ్వకపోతే,

  13. అప్పుడు నిర్దోషిగా నీ ముఖాన్ని పైకెత్తుతావు; భయం లేకుండా స్థిరంగా నిలబడతావు.

  14. ఒకవేళ నీవు సర్వశక్తిమంతుని వైపు తిరిగితే, నీవు మళ్ళీ పునరుద్ధరించబడతావు: నీ గుడారంలో నుండి దుష్టత్వాన్ని నీవు తొలగించి

  15. అప్పుడు వారు దేవునికి ప్రార్థించి ఆయన దయను పొందవచ్చు, వారు దేవుని ముఖం చూసి ఆనందంతో కేకలు వేస్తారు; ఆయన వారి నీతిని వారికి తిరిగి ఇస్తారు.

  16. వారు ఇతరుల దగ్గరకు వెళ్లి ఇలా చెప్తారు, ‘నేను పాపం చేశాను, సరియైన దానిని వంకరగా మార్చాను, అయినా దానికి తగిన శిక్ష నాకు విధించబడలేదు.

  17. సమాధికి వెళ్లకుండ దేవుడు నా ప్రాణాన్ని విమోచించారు. జీవిత వెలుగును ఆస్వాదించడానికి నేను బ్రతుకుతాను.’

  18. “ఒకవేళ ఎవరైనా దేవునితో, ‘నేను శిక్షను భరించాను ఇకమీదట నేరం చేయను.

  19. నేను చూడలేనిది నాకు చూపించు; నేనేదైనా తప్పు చేసివుంటే ఇకమీదట అలాంటిది చేయను’ అనవచ్చు.

  20. దిద్దుబాటును వినేలా చేస్తారు తమ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపపడాలని వారిని ఆజ్ఞాపిస్తారు.

  21. కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని దుమ్ములో బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నాను.”

  22. భూనివాసులందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరుగుతారు, దేశాల్లోని కుటుంబాలన్నీ ఆయనకు నమస్కారం చేస్తాయి.

  23. కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.

  24. విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపంగా ఉంటారు. ఆత్మలో నలిగినవారిని ఆయన రక్షిస్తారు.

  25. విరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి; పశ్చాత్తాపంతో విరిగిన హృదయాన్ని దేవా, మీరు నిరాకరించరు.