కంటెంట్‌కు వెళ్లండి

Prophets గురించి బైబిల్ వచనాలు

655 వచనాలు · 128 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఈ మనుష్యులు, సహజ మరణం పొందితే, మనుష్యులు అనుభవించు విధిని వీరు అనుభవిస్తే, అప్పుడు యెహోవా నన్ను పంపలేదు.

  2. అయితే బిలాము వారితో, “బాలాకు తన రాజభవనంలో ఉన్న వెండి బంగారమంతా ఇచ్చినా సరే, నా దేవుడైన యెహోవా ఆజ్ఞకు మించి ఎక్కువ గాని తక్కువ గాని చేయలేను.

  3. “ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను కదా” అని బిలాము జవాబిచ్చాడు. “కానీ నాకిష్టమైనది నేను చెప్పలేను. దేవుడు నా నోట్లో పెట్టిందే నేను చెప్పాలి” అని బాలాకుతో అన్నాడు.

  4. యెహోవా బిలాము నోటిలో ఒక సందేశం పెట్టి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటలు చెప్పు” అని అన్నారు.

  5. బిలాము, “యెహోవా నా నోట పెట్టిన మాటను నేను మాట్లాడకూడదా?” అని అన్నాడు.

  6. ఆశీర్వదించమని నేను ఆజ్ఞ పొందుకున్నాను; ఆయన వారిని ఆశీర్వదించారు, దాన్ని నేను మార్చలేను.

  7. బిలాము బాలాకుతో, “యెహోవా ఏది చెప్తే నేను అదే చేయాలని నేను చెప్పలేదా?” అని జవాబిచ్చాడు.

  8. ఇశ్రాయేలు వారు గోత్రాల ప్రకారం గుడారాలు వేసుకుని ఉండడం బిలాము చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది,

  9. అతడు ఈ సందేశం ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,

  10. దేవుని మాటలు వినే వాని ప్రవచనం, సర్వశక్తిగల దేవుని నుండి దర్శనం చూసేవాడు, సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు:

  11. అప్పుడు బిలాము ఈ సందేశాన్ని ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,

  12. దేవుని మాటలు వినే వాని ప్రవచనం, మహోన్నతుని దగ్గర నుండి తెలివి సంపాదించుకున్నవాడు, సర్వశక్తిగల వాడి నుండి దర్శనం చూసేవాడు, సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు:

  13. యొర్దాను తూర్పున మోయాబు దేశంలో మోషే ఈ ధర్మశాస్త్రాన్ని వివరించడం మొదలుపెట్టి ఇలా అన్నాడు:

  14. దేవుడైన యెహోవా హోరేబు దగ్గర మనతో ఇలా మాట్లాడారు, “మీరు ఈ పర్వతం దగ్గర చాలా కాలం నుండి ఉన్నారు.

  15. ఆ పర్వతం మీద అగ్నిలో నుండి యెహోవా మీతో ముఖాముఖిగా మాట్లాడారు.

  16. అయితే మీరు ఆ అగ్నికి భయపడి పర్వతం ఎక్కలేదు కాబట్టి యెహోవా మాట మీకు తెలియజేయడానికి నేను యెహోవాకు మీకు మధ్యలో నిలబడ్డాను. ఆయన ఇలా అన్నారు:

  17. “బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.

  18. అయితే నీవు ఇక్కడ నాతో ఉండు, ఎందుకంటే వారు స్వాధీనం చేసుకోవడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో పాటించేలా నీవు బోధించాల్సిన ఆజ్ఞలు, శాసనాలు చట్టాలు నీకు ఇస్తాను.”

  19. మీ దేవుడైన యెహోవా నా లాంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కోసం లేవనెత్తుతాడు, మీరు అతని మాట వినాలి.

  20. వారి తోటి ఇశ్రాయేలీయులలో నుండే నీలాంటి ప్రవక్తను లేపుతాను. ఆయన నోట నా మాటలుంటాయి, నా ఆజ్ఞలన్నీ వారికి చెప్తాను.

  21. కానీ నేను ఆజ్ఞాపించనిదేదైనా నా పేరున మాట్లాడాలని భావించే ప్రవక్త లేదా ఇతర దేవుళ్ళ పేరిట మాట్లాడే ప్రవక్తను చంపాలి” అని అన్నారు.

  22. మోషే నూను కుమారుడైన యెహోషువతో పాటు వచ్చి ప్రజలు వింటుండగా ఈ పాటలోని అన్ని మాటలను వినిపించాడు.

  23. అంతకుముందే మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచాడు కాబట్టి అతడు జ్ఞానాత్మతో నింపబడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.

  24. అప్పటినుండి ఇశ్రాయేలులో యెహోవా ముఖాముఖిగా మాట్లాడిన మోషే వంటి ప్రవక్త,

  25. ఈజిప్టులో ఫరోకు, అతని అధికారులందరికి, అతని దేశమంతటికి సూచనలను, అద్భుతాలను చేయడానికి యెహోవా పంపిన అలాంటి ప్రవక్త ఇశ్రాయేలులో లేడు.