Skip to content

Prophets గురించి బైబిల్ వచనాలు: Schools of

17 వచనాలు · 128 కోణాలు

Schools of గురించి వచనాలు

  1. యెహోవా మాటచేత, ప్రవక్త బృందంలో ఒకడు తన తోటి ప్రవక్తతో, “నీ ఆయుధంతో నన్ను కొట్టు” అన్నాడు, కాని అతడు నిరాకరించాడు.

  2. బేతేలులో ఉన్న ప్రవక్తల బృందం వారు ఎలీషా దగ్గరకు వచ్చి, “ఈ రోజు యెహోవా నీ గురువును నీ దగ్గరనుండి తీసుకెళ్తున్నారని నీకు తెలుసా?” అని అడిగారు. ఎలీషా జవాబిస్తూ, “నాకు తెలుసు, ఊరుకోండి” అన్నాడు.

  3. తర్వాత ఏలీయా అతనితో అన్నాడు, “ఎలీషా, నీవు ఇక్కడ ఉండు. యెహోవా నన్ను యెరికోకు వెళ్లమన్నారు.” అతడు జవాబిస్తూ అన్నాడు, “సజీవుడైన యెహోవా మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడువను.” కాబట్టి వారు యెరికోకు వెళ్లారు.

  4. యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు ఎలీషా దగ్గరకు వచ్చి, “ఈ రోజు యెహోవా నీ గురువును నీ దగ్గర నుండి తీసుకెళ్తున్నారని నీకు తెలుసా?” అని అడిగారు. ఎలీషా జవాబిస్తూ, “నాకు తెలుసు, ఊరుకోండి” అన్నాడు.

  5. తర్వాత ఏలీయా అతనితో, “ఎలీషా, నీవు ఇక్కడే ఉండు. యెహోవా నన్ను యొర్దానుకు వెళ్లమన్నారు” అని చెప్పాడు. కాని అతడు, “సజీవుడైన యెహోవా మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడువను” అన్నాడు. కాబట్టి ఆ ఇద్దరు నడుచుకుంటూ వెళ్లారు.

  6. ప్రవక్త బృందంలో నుండి యాభైమంది మనుష్యులు యొర్దాను దగ్గర ఆగిన ఏలీయా, ఎలీషాలకు ఎదురుగా నిలబడ్డారు.

  7. ఏలీయా తన పైవస్త్రాన్ని తీసి, మడతపెట్టి నీళ్లను కొట్టాడు, నీళ్లు కుడి వైపుకు, ఎడమవైపుకు చీలిపోయాయి, వారిద్దరు పొడినేల మీద నడిచివెళ్లారు.

  8. వారు దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లక ముందు, నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు” అన్నాడు. అందుకు ఎలీషా అన్నాడు, “నీ మీద ఉన్న ఆత్మ నా మీద రెండంతలుగా నేను పొందుకోనివ్వు.”

  9. అందుకు ఏలీయా, “నీవు అడిగింది కష్టమైనది, అయితే నన్ను తీసుకువెళ్లే సమయంలో నీవు నన్ను చూస్తే నీవు దానిని పొందుకుంటావు, చూడకపోతే నీవు పొందుకోవు” అని చెప్పాడు.

  10. వారు కలిసి మాట్లాడుతూ నడుస్తూ వెళ్తున్నప్పుడు, అకస్మాత్తుగా అగ్ని గుర్రాలతో ఉన్న అగ్ని రథం వచ్చి వారిద్దరిని వేరు చేసింది. ఏలీయా సుడిగాలిలో ఆకాశంలోకి పైకి వెళ్లిపోయాడు.

  11. ఎలీషా అది చూస్తూ, “నా తండ్రీ! నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలు, రౌతులు నీవే!” అని కేక పెట్టాడు. ఎలీషా అతన్ని మరలా చూడలేదు. అప్పుడు అతడు తాను వేసుకున్న బట్టలు రెండుగా చింపుకున్నాడు.

  12. ఎలీషా, ఏలీయా మీద నుండి క్రిందపడ్డ అతని పైవస్త్రాన్ని తీసుకుని తిరిగి యొర్దాను ఒడ్డుకు వచ్చి నిలబడ్డాడు.

  13. ఎలీషా ఏలీయా మీద నుండి క్రిందపడ్డ పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీళ్లను కొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?” అన్నాడు. అతడు ఆ నీళ్లను కొట్టినప్పుడు ఆ నీళ్లు కుడి వైపుకు ఎడమవైపుకు విడిపోగా అతడు అవతలి ఒడ్డుకు వెళ్లాడు.

  14. దీనిని చూస్తున్న యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు, “ఏలీయా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది” అని చెప్పి అతన్ని కలుసుకోడానికి వెళ్లి అతని ఎదుట సాష్టాంగపడ్డారు.

  15. ఒక రోజు ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, “మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు, అతడు యెహోవా పట్ల భక్తి కలవాడని మీకు తెలుసు. అయితే ఇప్పుడు అతనికి అప్పిచ్చినవాడు నా ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకెళ్లడానికి వస్తున్నాడు” అని మొరపెట్టింది.

  16. తర్వాత ఎలీషా గిల్గాలుకు తిరిగి వెళ్లాడు, అప్పుడు ఆ ప్రాంతంలో కరువు ఉంది. ప్రవక్తల బృందం ఎలీషాను కలుస్తున్నప్పుడు, అతడు తన సేవకునితో, “పెద్దకుండ పొయ్యిమీద పెట్టి ఈ ప్రవక్తలకు వంటకం చేయి” అన్నాడు.

  17. ఎలీషా ప్రవక్త ప్రవక్తల బృందంలో ఒకరిని పిలిచి ఇలా అన్నాడు, “నీ నడికట్టు బిగించుకుని, సీసాలో ఒలీవనూనె పట్టుకుని రామోత్ గిలాదుకు వెళ్లు.