కంటెంట్‌కు వెళ్లండి

Prophets గురించి బైబిల్ వచనాలు: Were consulted in all difficulties

6 వచనాలు · 128 కోణాలు

Were consulted in all difficulties గురించి వచనాలు

  1. అందుకు ఆ సేవకుడు, “చూడండి, ఈ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు. అతడు ఎంతో గొప్పవాడు, అతడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. మనం అక్కడికి వెళ్దాము. మనం ఎక్కడికి వెళ్లాలో బహుశ అతడు మనకు చెప్పవచ్చు” అన్నాడు.

  2. అప్పుడు సమూయేలు సౌలును, “నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టావు?” అని అడిగాడు. అందుకు సౌలు, “నేను చాలా బాధల్లో ఉన్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వస్తే దేవుడు నా నుండి దూరమయ్యారు. ప్రవక్తల ద్వారా గాని కలల ద్వారా గాని ఆయన నాకు ఏ సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఏం చేయాలో నాకు చెప్తావని నిన్ను పిలిచాను” అన్నాడు.

  3. యరొబాము తన భార్యతో, “నీవు యరొబాము భార్యవని ఎవ్వరూ గుర్తుపట్టకుండా, మారువేషం వేసుకుని షిలోహుకు వెళ్లు. అక్కడ నేను ఈ ప్రజల మీద రాజునవుతానని నాకు చెప్పిన అహీయా ప్రవక్త ఉంటాడు.

  4. పది రొట్టెలు, కొన్ని అప్పములు, జాడీలో తేనె తీసుకుని అతని దగ్గరకు వెళ్లు. బాలునికి ఏమి జరుగుతుందో అతడు నీకు చెప్తాడు” అన్నాడు.

  5. యరొబాము భార్య అతడు చెప్పినట్లు చేసింది. ఆమె షిలోహులో ఉన్న అహీయా ఇంటికి వెళ్లింది. అహీయాకు వృద్ధాప్యం వలన చూపు పోయింది.

  6. అయితే యెహోషాపాతు, “మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త ఒక్కడు కూడా ఇక్కడ లేడా?” అని అడిగాడు.