కంటెంట్‌కు వెళ్లండి

Prophets గురించి బైబిల్ వచనాలు: Sometimes received divine communications and uttered predictions under great bodily and mental excitement

7 వచనాలు · 128 కోణాలు

Sometimes received divine communications and uttered predictions under great bodily and mental excitement గురించి వచనాలు

  1. ప్రవక్తల గురించి: యెహోవాను బట్టి ఆయన మాట్లాడిన మాటలనుబట్టి నా హృదయం నాలో పగిలిపోయింది; నా ఎముకలన్నీ వణుకుతున్నాయి. త్రాగిన మత్తులో ఉన్నవాడిలా, ద్రాక్షరసానికి లొంగిపోయిన బలవంతునిలా ఉన్నాను,

  2. అప్పుడు ఆత్మ నన్ను ఎత్తుకుని తీసుకెళ్లాడు. నేనలాగే కొట్టుకొని పోయాను. నా మనస్సులో పుట్టిన కోపానికి ఎంతో కలత చెందినప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చింది.

  3. కెబారు నది దగ్గర ఉన్న తేలాబీబు అనే స్థలంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు వచ్చాను. వారు కూర్చున్న చోటే దిగులుగా ఏడు రోజులు కూర్చుండిపోయాను.

  4. “ఇది ఆ విషయానికి ముగింపు. దానియేలు అనే నేను నా తలంపులలో ఆందోళన చెందాను, నా ముఖం పాలిపోయింది, కాని నేను ఈ విషయాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను.”

  5. కాబట్టి నేనొక్కడినే ఈ గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉండిపోయాను, ఈ గొప్ప దర్శనం చూశాను; నాలో బలం ఏమి లేదు, నా ముఖం ఎంతో పాలిపోయింది, నేను పూర్తిగా నీరసించిపోయాను.

  6. యెహోవా, నీ కీర్తి గురించి విన్నాను; యెహోవా, నీ క్రియలకు నేను భయపడుతున్నాను. మా దినాల్లో వాటిని మళ్ళీ చేయండి, మా కాలంలో వాటిని తెలియజేయండి; ఉగ్రతలో కరుణించడం జ్ఞాపకముంచుకోండి.

  7. నేను వినగా నా గుండె కొట్టుకుంది, ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి; నా ఎముకలు కుళ్లిపోతున్నాయి, నా కాళ్లు వణికాయి. అయినా మనపై దాడి చేస్తున్న దేశం మీదికి విపత్తు సంభవించే దినం వచ్చేవరకు నేను ఎదురుచూస్తూ ఉంటాను.