Prophets గురించి బైబిల్ వచనాలు: Numerous in Israel
Numerous in Israel గురించి వచనాలు
“ఆ తర్వాత నీవు దేవుని గిబియాకు వెళ్తావు, అక్కడ ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఉంది. నీవు పట్టణం దగ్గరకు చేరుకుంటుండగా, వీణలు, కంజరలు, పిల్లనగ్రోవులు, సితారాలు వాయిస్తున్నవారి వెనుక, ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల ఊరేగింపు నీకు కనబడుతుంది. వారు ప్రవచిస్తూ వస్తారు.
యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపిస్తూ ఉన్నప్పుడు, ఓబద్యా వందమంది ప్రవక్తలను తీసుకెళ్లి వారిని దాచిపెట్టి, వారిని యాభైమంది చొప్పున రెండు గుహల్లో ఉంచి వారికి అన్నపానాలు అందించాడు.)