కంటెంట్‌కు వెళ్లండి

Prophets గురించి బైబిల్ వచనాలు: By an audible voice

12 వచనాలు · 128 కోణాలు

By an audible voice గురించి వచనాలు

  1. అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, పొడుపుకథల్లా కాక స్పష్టంగా మాట్లాడతాను. అతడు యెహోవా రూపాన్ని చూస్తాడు. అలాంటప్పుడు మీరెందుకు భయపడకుండా నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు?”

  2. అప్పుడు యెహోవా సమూయేలును పిలిచారు. అందుకు సమూయేలు, “నేను ఇక్కడే ఉన్నాను” అంటూ,

  3. అతడు ఏలీ దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “మీరు నన్ను పిలిచారా? నేను ఇక్కడే ఉన్నాను” అని అన్నాడు. అందుకు ఏలీ, “నేను పిలువలేదు; వెళ్లి పడుకో” అని చెప్పగానే అతడు వెళ్లి పడుకున్నాడు.

  4. మళ్ళీ యెహోవా, “సమూయేలూ!” అని పిలిచారు. అప్పుడు సమూయేలు లేచి ఏలీ దగ్గరకు వెళ్లి, “నేను ఇక్కడే ఉన్నాను; మీరు నన్ను పిలిచారా?” అని అడిగాడు. అయితే ఏలీ, “నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు; వెళ్లి పడుకో” అన్నాడు.

  5. అప్పటికి సమూయేలుకు ఇంకా యెహోవా తెలియదు; యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు.

  6. యెహోవా మూడవసారి, “సమూయేలూ!” అని పిలిచినప్పుడు, అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్లి, “నేను ఇక్కడే ఉన్నాను; మీరు నన్ను పిలిచారా?” అని అడిగాడు. యెహోవాయే ఆ బాలుని పిలిచారని ఏలీ గ్రహించాడు.

  7. కాబట్టి ఏలీ సమూయేలుతో, “నీవు వెళ్లి పడుకో, ఎవరైనా మళ్ళీ పిలిస్తే, ‘యెహోవా, చెప్పండి, మీ సేవకుడనైన నేను వింటున్నాను’ అని చెప్పు” అన్నాడు. కాబట్టి సమూయేలు వెళ్లి తన స్థలంలో పడుకున్నాడు.

  8. తర్వాత యెహోవా వచ్చి అక్కడ నిలబడి, “సమూయేలూ! సమూయేలూ!” అని మళ్ళీ పిలిచారు. వెంటనే సమూయేలు, “చెప్పండి, మీ సేవకుడనైన నేను వింటున్నాను” అన్నాడు.

  9. అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా చెప్పారు: “ఇశ్రాయేలీయులలో నేను ఒక పని చేయబోతున్నాను; దాని గురించి విన్నవారి చెవులు గింగురుమంటాయి.

  10. ఆ రోజున ఏలీ ఇంటివారికి వ్యతిరేకంగా నేను మాట్లాడినదంతా మొదటి నుండి చివరి వరకు వారి మీదికి రప్పిస్తాను.

  11. ఎందుకంటే అతనికి తెలిసిన పాపం కారణంగా నేను అతని కుటుంబానికి ఎప్పటికీ తీర్పు తీరుస్తానని అతనితో చెప్పాను; అతని కుమారులు దేవున్ని దూషించారు, అతడు వారిని అరికట్టలేక పోయాడు.

  12. కాబట్టి, ‘ఏలీ ఇంటివారి దోషానికి బలుల వలన గాని, అర్పణల వలన గాని ఎప్పటికీ ప్రాయశ్చిత్తం జరుగదు’ అని ఏలీ ఇంటివారికి నేను ప్రమాణం చేశాను.”