Prophets గురించి బైబిల్ వచనాలు: Kept the chronicles
Kept the chronicles గురించి వచనాలు
రాజైన దావీదుకు సంబంధించిన ఇతర వివరాలన్నీ మొదటి నుండి చివరి వరకు, అతని పాలనకు అధికారానికి సంబంధించిన వివరాలు, అతడు, ఇశ్రాయేలీయులు ఇతర దేశాల రాజ్యాలు ఎదుర్కొన్న పరిస్థితుల వివరాలు దీర్ఘదర్శి సమూయేలు, నాతాను ప్రవక్త, దీర్ఘదర్శి గాదు వ్రాసిన చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి.
సొలొమోను పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, మొదటి నుండి చివరి వరకు నాతాను ప్రవక్త వ్రాసిన గ్రంథంలో, షిలోనీయుడైన అహీయా ప్రవచన గ్రంథంలో, దీర్ఘదర్శియైన ఇద్దో నెబాతు కుమారుడైన యరొబాము గురించి వ్రాసిన గ్రంథంలో వ్రాయబడలేదా?
రెహబాము పరిపాలనకు సంబంధించిన విషయాలు, మొదటి నుండి చివరి వరకు షెమయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో దీర్ఘదర్శియైన ఇద్దో వ్రాసిన వంశవృక్షాల విషయమైన గ్రంథంలో వ్రాయబడలేదా? రెహబాముకు యరొబాముకు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉండేది.