Prophets గురించి బైబిల్ వచనాలు: Often led a wandering and unsettled life
Often led a wandering and unsettled life గురించి వచనాలు
సజీవుడైన మీ దేవుడు, యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా యజమాని అహాబు మీకోసం వెదకడానికి అన్ని దేశాలకు, రాజ్యాలకు మనుష్యులను పంపాడు. ఏ దేశం వారైనా ఏలీయా లేడని చెప్పినప్పుడు మిమ్మల్ని ఆ దేశం వారు చూడలేదని వారి చేత ఒట్టు పెట్టించుకున్నాడు.
ఇప్పుడు నన్ను వెళ్లి నా యజమానితో, ‘ఏలీయా ఇక్కడ ఉన్నాడు’ అని చెప్పమంటున్నారు.
నేను మిమ్మల్ని విడిచి వెళ్లిన తర్వాత, యెహోవా ఆత్మ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు. నేను అహాబుకు చెప్పినప్పుడు, ఒకవేళ అతనికి మీరు కనబడకపోతే అతడు నన్ను చంపేస్తాడు. అది సరికాదు; మీ సేవకుడనైన నేను కూడ బాల్యం నుండే యెహోవాను ఆరాధించే వాన్ని.
ఏలీయా భయపడి, తన ప్రాణం కాపాడుకోడానికి పారిపోయాడు. అతడు యూదాలోని బెయేర్షేబకు చేరి, అక్కడ తన సేవకుడిని విడిచిపెట్టి,
కాబట్టి అతడు లేచి తిని నీళ్లు త్రాగాడు. ఆ ఆహారం వల్ల బలం పొందుకొని నలభై రాత్రింబగళ్ళు ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబును చేరుకున్నాడు.
అప్పుడు యెహోవా అతనితో, “నీవు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లు, దమస్కు ఎడారికి వెళ్లు. అక్కడికి వెళ్లాక, హజాయేలును అరాము మీద రాజుగా అభిషేకించు.
మనం పైకప్పు మీద చిన్న గది కట్టి అందులో పడక, బల్ల, కుర్చీ, దీపం ఉంచుదాము. మన దగ్గరకు అతడు వచ్చినప్పుడెల్లా, అతడు ఆ గదిలో ఉండవచ్చు” అని చెప్పింది.