కంటెంట్‌కు వెళ్లండి

Prophets గురించి బైబిల్ వచనాలు: Frequently in their actions, &c were made signs to the people

67 వచనాలు · 128 కోణాలు

Frequently in their actions, &c were made signs to the people గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆ సమయంలో యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా మాట్లాడారు. ఆయన, “నీ నడుముకున్న గోనె పట్టాను, నీ పాదాలకున్న చెప్పులు తీసివేయి” అన్నారు. అతడు అలాగే చేసి, బట్టలు తీసివేసి చెప్పులు లేకుండా నడిచాడు.

  2. అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యెషయా ఈజిప్టు గురించి, కూషు గురించి సూచనగా సంకేతంగా మూడు సంవత్సరాలు బట్టలు, చెప్పులు లేకుండా తిరిగిన విధంగానే

  3. అష్షూరు రాజు చెరపట్టబడిన ఈజిప్టువారిని, కూషు బందీలను, పిల్లలను పెద్దలను బట్టలు లేకుండా చెప్పులు లేకుండా తీసుకు పోతాడు. ఈజిప్టువారిని అవమానం కలిగేలా వారి పిరుదుల కనిపించేలా వారిని తీసుకెళ్తాడు.

  4. యెహోవా ఇలా అంటున్నారు: “వెళ్లి కుమ్మరి దగ్గర ఒక మట్టి పాత్ర కొను. నీతో పాటు ప్రజల పెద్దలను, యాజకులలో కొందరిని తీసుకుని,

  5. “నీతో పాటు వచ్చినవారు చూస్తుండగానే ఆ కుండను పగలగొట్టి,

  6. వారితో ఇలా చెప్పు, ‘సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మరలా బాగుచేయడానికి వీలు లేకుండ ఈ కుమ్మరి కుండను పగలగొట్టినట్లు నేను ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని ధ్వంసం చేస్తాను. తోఫెతులో స్థలం లేకపోయేంతగా అక్కడే చనిపోయినవారిని పాతిపెడతారు.

  7. యెహోవా నాతో ఇలా అన్నారు: “సంకెళ్లు ఒక కాడిని తయారుచేసి నీ మెడ మీద పెట్టుకో.

  8. యూదా రాజైన సిద్కియా దగ్గరకు యెరూషలేముకు వచ్చిన రాయబారులతో ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజులకు కబురు పంపించు.

  9. “యూదులు చూస్తుండగానే, నీతో పాటు కొన్ని పెద్ద రాళ్లను తీసుకెళ్లి, తహ్పన్హేసులోని ఫరో రాజభవనం ద్వారం దగ్గర ఉన్న ఇటుక కాలిబాటలో మట్టిలో పాతిపెట్టు.

  10. నీవు ఈ గ్రంథపుచుట్ట చదవడం ముగించాక, దానికి ఒక రాయి కట్టి యూఫ్రటీసు నదిలో పడేయండి.

  11. “మనుష్యకుమారుడా, ఒక మట్టి ఇటుకను తీసుకుని, నీ ముందు పెట్టుకుని, దాని మీద యెరూషలేము పట్టణ నమూనాను గీయి.

  12. తర్వాత అది ముట్టడి వేయబడినట్లుగా దాని ఎదురుగా ముట్టడి దిబ్బలు, బురుజు కట్టినట్లు, దానికి ఎదురుగా సైనిక శిబిరాలు, గోడలను పడగొట్టే యంత్రాలు ఉన్నట్లు గీయి.

  13. తర్వాత ఒక ఇనుప రేకును తీసుకుని, దాన్ని నీకు, పట్టణానికి మధ్య ఇనుప గోడలా ఉంచి, నీ ముఖాన్ని దాని వైపుకు త్రిప్పి నిలబడు. నీవు పట్టణాన్ని ముట్టడి చేస్తున్నట్లుగా ఉంటావు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచనగా ఉంటుంది.

  14. “అప్పుడు నీవు నీ ఎడమవైపుకు పడుకుని ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని నీ మీద వేసుకో. నీవు నీవైపు పడుకుని ఉన్న అన్ని రోజులు వారి పాపాన్ని నీవు భరించాలి.

  15. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు పాపం చేశారో అన్ని రోజులు నేను నీకు నిర్ణయిస్తాను. దాని ప్రకారం 390 రోజులు నీవు వారి పాపాన్ని భరించాలి.

  16. “నీవు ఇది పూర్తి చేసిన తర్వాత, ఈసారి నీ కుడి వైపుకు తిరిగి పడుకుని యూదా ప్రజల పాపాన్ని భరించు. నేను నీకు 40 రోజులు, ప్రతి సంవత్సరానికి ఒక రోజు నియమించాను.

  17. ముట్టడిలో ఉన్న యెరూషలేము వైపు నీ ముఖాన్ని త్రిప్పి చొక్కా తీసివేసి చేయి ఎత్తి, దానికి వ్యతిరేకంగా ప్రవచించు.

  18. నీ ముట్టడి రోజులు పూర్తయ్యే వరకు నీవు ఒకవైపు నుండి మరోవైపుకు తిరగకుండా నిన్ను త్రాళ్లతో బంధిస్తాను.

  19. “గోధుమలు, యవలు, చిక్కుడు కాయలు, అలచందలు, జొన్నలు తీసుకోండి; వాటిని ఒక పాత్రలో నిల్వ ఉంచి వాటితో రొట్టెలు చేసుకుని నీవు ఒకవైపు పడుకున్న 390 రోజులు వాటిని తినాలి.

  20. ప్రతిరోజు తినడానికి ఇరవై షెకెళ్ళ ఆహారాన్ని తూకం వేసి, నిర్ణీత సమయాల్లో తినాలి.

  21. అలాగే ఒక హిన్ లో ఆరవ వంతు నీరు కొలిచి నిర్ణీత సమయాల్లో త్రాగాలి.

  22. యవలతో రొట్టెలు చేసుకుని ప్రజలంతా చూస్తుండగా మానవ మలంతో వాటిని కాల్చుకుని తినాలి.

  23. నేను వారిని ఏ జాతుల మధ్యకు వెళ్లగొడతానో వారి మధ్య ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అపవిత్రమైన ఆహారం తింటారు” అని యెహోవా నాకు చెప్పారు.

  24. “మనుష్యకుమారుడా, పదునైన కత్తిని తీసుకుని దానిని మంగలి కత్తిలా ఉపయోగించి నీ తలను, గడ్డాన్నీ క్షౌరం చేసుకో. ఒక త్రాసు తెచ్చి ఆ వెంట్రుకలను తూచి భాగాలుగా చేయి.

  25. నీ ముట్టడి రోజులు పూర్తి కాగానే ఈ వెంట్రుకలలో మూడవ భాగాన్ని పట్టణం లోపల కాల్చివేయాలి. మూడవ భాగాన్ని తీసుకుని ఖడ్గంతో పట్టణం చుట్టూ చెదరగొట్టాలి. మిగిలిన మూడవ భాగాన్ని గాలికి ఎగిరిపోనివ్వాలి. ఎందుకంటే నేను ఖడ్గంతో వారిని వెంటాడతాను.