- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1380–1050 BC
The Judges & Ruth
Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.
ఈ కాలపు వచనాలు
- న్యాయాధిపతులు 9:56సుమారు క్రీ.పూ. 1233
ఈ విధంగా అబీమెలెకు తన డెబ్బైమంది సోదరులను చంపి తన తండ్రికి చేసిన ద్రోహాన్ని దేవుడు తిరిగి అతని మీదికి రప్పించారు.
- న్యాయాధిపతులు 9:57సుమారు క్రీ.పూ. 1233
అంతేకాదు, షెకెము వారు కూడా తమ చెడు కార్యాలన్నిటికి వెల చెల్లించేలా దేవుడు చేశారు. యెరుబ్-బయలు కుమారుడైన యోతాము శాపం వారి మీదికి వచ్చింది.
- న్యాయాధిపతులు 10:1సుమారు క్రీ.పూ. 1232
అబీమెలెకు చనిపోయిన తర్వాత ఇశ్శాఖారు గోత్రం నుండి దోదో మనుమడు, పువా కుమారుడైన తోలా ఇశ్రాయేలును రక్షించడానికి లేచాడు. అతడు ఎఫ్రాయిం కొండసీమలో, షామీరులో నివసించాడు.
- న్యాయాధిపతులు 10:2సుమారు క్రీ.పూ. 1232
అతడు ఇరవై మూడు సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు; తర్వాత అతడు చనిపోయి షామీరులో పాతిపెట్టబడ్డాడు.
- న్యాయాధిపతులు 10:3సుమారు క్రీ.పూ. 1209
అతని తర్వాత గిలాదు వాడైన యాయీరు లేచాడు, అతడు ఇరవై రెండు సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు.
- న్యాయాధిపతులు 10:4సుమారు క్రీ.పూ. 1209
అతనికి ముప్పైమంది కుమారులున్నారు, వారు ముప్పై గాడిదల మీద తిరిగేవారు. వారికి గిలాదులో ముప్పై పట్టణాలు ఉన్నాయి, ఇప్పటికి వాటిని హవ్వోత్ యాయీరు పట్టణాలు అని పిలుస్తారు.
- న్యాయాధిపతులు 10:5సుమారు క్రీ.పూ. 1209
యాయీరు చనిపోయినప్పుడు అతన్ని కామోనులో పాతిపెట్టారు.
- న్యాయాధిపతులు 10:6సుమారు క్రీ.పూ. 1187
ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు. వారు బయలు, అష్తారోతు, అరాము, సీదోను, మోయాబు, అమ్మోనీయుల, ఫిలిష్తీయుల దేవుళ్ళను పూజించారు. ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచి ఆయనను సేవించడం మానుకున్నారు.
- న్యాయాధిపతులు 10:7సుమారు క్రీ.పూ. 1187
యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోప్పడి వారిని ఫిలిష్తీయులకు, అమ్మోనీయులకు అప్పగించారు,
- న్యాయాధిపతులు 10:8సుమారు క్రీ.పూ. 1187
వారు ఆ సంవత్సరం నుండి పద్దెనిమిది సంవత్సరాలు యొర్దాను తూర్పున ఉన్న గిలాదులో, అమోరీయుల దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరిని బాధించి అణచివేశారు.
- న్యాయాధిపతులు 10:9సుమారు క్రీ.పూ. 1187
అమ్మోనీయులు కూడా యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం ప్రజలతో యుద్ధం చేయడానికి యొర్దానును దాటారు; ఇశ్రాయేలీయులు ఎంతో శ్రమ అనుభవించారు.
- న్యాయాధిపతులు 10:10సుమారు క్రీ.పూ. 1187
అప్పుడు ఇశ్రాయేలీయులు, “మేము మా దేవున్ని విడిచి బయలు ప్రతిమలను సేవిస్తూ, మీకు విరోధంగా పాపం చేశాం” అని యెహోవాకు మొరపెట్టారు.
- న్యాయాధిపతులు 10:11సుమారు క్రీ.పూ. 1187
యెహోవా ఇశ్రాయేలీయులకు జవాబిస్తూ, “ఈజిప్టువారు, అమోరీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు,
- న్యాయాధిపతులు 10:12సుమారు క్రీ.పూ. 1187
సీదోనీయులు, అమాలేకీయులు, మయోనీయుల మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు నేను మిమ్మల్ని వారి చేతుల్లో నుండి కాపాడలేదా?
- న్యాయాధిపతులు 10:13సుమారు క్రీ.పూ. 1187
అయితే మీరు నన్ను విడిచి ఇతర దేవుళ్ళను సేవించారు కాబట్టి నేను మిమ్మల్ని ఇక కాపాడను.
- న్యాయాధిపతులు 10:14సుమారు క్రీ.పూ. 1187
వెళ్లండి, మీరు ఎంచుకున్న దేవుళ్ళకు వేడుకోండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు అవే మిమ్మల్ని కాపాడతాయేమో!” అని అన్నారు.
- న్యాయాధిపతులు 10:15సుమారు క్రీ.పూ. 1187
అయితే ఇశ్రాయేలీయులు యెహోవాతో, “మేము పాపం చేశాము. మీ ఇష్ట ప్రకారం మాకు చేయండి, కాని ఇప్పుడు దయచేసి మమ్మల్ని కాపాడండి” అని విన్నవించుకున్నారు.
- న్యాయాధిపతులు 10:16సుమారు క్రీ.పూ. 1187
తర్వాత ఇశ్రాయేలీయులు తమ మధ్యలో ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించి యెహోవాను సేవించారు. యెహోవా వారు అనుభవిస్తున్న శ్రమను ఇక సహించలేకపోయారు.
- న్యాయాధిపతులు 10:17సుమారు క్రీ.పూ. 1187
ఆ సమయంలో అమ్మోనీయుల సైన్యాలు యుద్ధానికి సమావేశమై గిలాదులో బస చేశారు, ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో బస చేశారు.
- న్యాయాధిపతులు 10:18సుమారు క్రీ.పూ. 1187
గిలాదు నాయకులు ఒకరితో ఒకరు, “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మనలను ఎవరు నడిపిస్తారో, అతడు గిలాదు నివాసులందరి మీద అధికారిగా ఉంటాడు” అని అనుకున్నారు.
గిలాదు వంశానికి చెందిన యెఫ్తా బలమైన యోధుడు. యెఫ్తా తండ్రి గిలాదు; అతని తల్లి ఓ వేశ్య.
గిలాదుకు అతని భార్య కుమారులను కన్నది, వారు పెద్దవారైనప్పుడు యెఫ్తాను తరిమేశారు. “నీవు ఇతర స్త్రీకి పుట్టిన వాడవు కాబట్టి మా కుటుంబంలో నీకు ఆస్తి వాటా రాదు” అని వారు అతనితో అన్నారు.
కాబట్టి యెఫ్తా తన సోదరుల దగ్గర నుండి వెళ్లి టోబు దేశంలో స్థిరపడ్డాడు, అక్కడ పోకిరీల గుంపు అతనితో ఉంటూ అతన్ని వెంబడించారు.
- న్యాయాధిపతులు 11:4సుమారు క్రీ.పూ. 1187
కొంతకాలం తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో పోరాడుతున్నప్పుడు, గిలాదు పెద్దలు టోబు దేశంలో ఉన్న యెఫ్తాను తీసుకురావడానికి వెళ్లారు.
- న్యాయాధిపతులు 11:5సుమారు క్రీ.పూ. 1187
And it was so, that when the children of Ammon made war against Israel, the elders of Gilead went to fetch Jephthah out of the land of Tob: