కంటెంట్‌కు వెళ్లండి

circa 1380–1050 BC

The Judges & Ruth

Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.

703 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. న్యాయాధిపతులు పరిపాలించిన రోజుల్లో దేశంలో కరువు వచ్చింది. కాబట్టి యూదాలోని బేత్లెహేము నుండి ఒక వ్యక్తి తన భార్యను, తన ఇద్దరు కుమారులను తీసుకుని, మోయాబు దేశంలో కొంతకాలం ఉండడానికి వెళ్లాడు.

  2. అతని పేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదాలోని బేత్లెహేము వాసులైన ఎఫ్రాతీయులు. వారు మోయాబుకు వెళ్లి అక్కడ నివసించారు.

  3. కొంతకాలం తర్వాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. ఆమె, తన ఇద్దరు కుమారులు మిగిలారు.

  4. వారు మోయాబు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు, వారిలో ఒకామె పేరు ఓర్పా, మరో ఆమె పేరు రూతు. వారు దాదాపు పది సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత,

  5. రూతు 1:5సుమారు క్రీ.పూ. 1308

    మహ్లోను కిల్యోను ఇద్దరు చనిపోయారు. నయోమి, తన భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది.

  6. రూతు 1:6సుమారు క్రీ.పూ. 1308

    యెహోవా తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వారిని దర్శించారని నయోమి విన్నప్పుడు, ఆమె, తన ఇద్దరు కోడళ్ళతో కలిసి మోయాబు విడిచి స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడింది.

  7. రూతు 1:7సుమారు క్రీ.పూ. 1308

    తన ఇద్దరు కోడళ్ళతో కలిసి తాను ఉంటున్న స్థలం విడిచి యూదా దేశానికి వెళ్లే మార్గంలో బయలుదేరింది.

  8. రూతు 1:8సుమారు క్రీ.పూ. 1308

    అయితే దారిలో నయోమి తన ఇద్దరు కోడళ్ళతో, “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్లండి. నా మీద, చనిపోయిన మీ భర్తల మీద మీరు దయ చూపించినట్లు యెహోవా మీమీద దయ చూపును గాక.

  9. రూతు 1:9సుమారు క్రీ.పూ. 1308

    మీరు మళ్ళీ పెళ్ళి చేసుకుని మీ భర్తల ఇండ్లలో నెమ్మది పొందేలా యెహోవా దయచేయును గాక” అన్నది. తర్వాత వారికి ముద్దు పెట్టింది, వారు బిగ్గరగా ఏడ్చి,

  10. రూతు 1:10సుమారు క్రీ.పూ. 1308

    ఆమెతో, “మేము నీతో నీ ప్రజల దగ్గరకు వస్తాం” అని అన్నారు.

  11. రూతు 1:11సుమారు క్రీ.పూ. 1308

    కాని నయోమి, “నా కుమార్తెలారా, మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి, నాతో ఎందుకు వస్తారు? మీకు భర్తలుగా ఉండడానికి నేను ఇంకా కుమారులను కనగలనా?

  12. రూతు 1:12సుమారు క్రీ.పూ. 1308

    నా బిడ్డలారా, ఇళ్ళకు తిరిగి వెళ్లండి; నేను వృద్ధురాలిని, నేను మళ్ళీ పెళ్ళి చేసుకునే వయస్సులో లేను, ఒకవేళ అది సాధ్యమే అని ఆశించి, ఈ రాత్రి నేను పెళ్ళి చేసుకుని, కుమారులను కన్నా,

  13. రూతు 1:13సుమారు క్రీ.పూ. 1308

    వారు ఎదిగే వరకు మీరు వేచి ఉంటారా? వారి కోసం పెళ్ళి చేసుకోకుండ ఉంటారా? వద్దు, నా బిడ్డలారా, యెహోవా హస్తం నాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ బాధ నాకు ఉంది!” అని జవాబిచ్చింది.

  14. రూతు 1:14సుమారు క్రీ.పూ. 1308

    అలా అనగానే వారు బిగ్గరగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్లిపోయింది, కాని రూతు తన అత్తను అంటిపెట్టుకునే ఉంది.

  15. రూతు 1:15సుమారు క్రీ.పూ. 1308

    నయోమి రూతుతో, “చూడు, నీ తోడి కోడలు తన ప్రజల దగ్గరకు, తన దేవుళ్ళ దగ్గరకు తిరిగి వెళ్తుంది. నీవు తనతో వెళ్లు” అన్నది.

  16. రూతు 1:16సుమారు క్రీ.పూ. 1308

    అందుకు రూతు, “నిన్ను విడవమని లేదా తిరిగి వెళ్లిపొమ్మని నన్ను బలవంతం చేయకు. నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, నీవు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు.

  17. రూతు 1:17సుమారు క్రీ.పూ. 1308

    నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, అక్కడే పాతిపెట్టబడతాను. చావు తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను విడదీస్తే యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించును గాక.”

  18. రూతు 1:18సుమారు క్రీ.పూ. 1308

    రూతు తనతో కూడ వెళ్లడానికి నిశ్చయించుకుందని నయోమి గ్రహించి, ఆమెను బలవంత పెట్టడం మానేసింది.

  19. రూతు 1:19సుమారు క్రీ.పూ. 1308

    కాబట్టి ఆ ఇద్దరు స్త్రీలు వారు బేత్లెహేము వరకు ప్రయాణించి బేత్లెహేముకు చేరినప్పుడు, ఆ పట్టణమంతా వారిని చూసి అక్కడికి వచ్చి, “ఈమె నయోమి కదా?” అని స్త్రీలు ఆశ్చర్యం వ్యక్తపరిచారు.

  20. రూతు 1:20సుమారు క్రీ.పూ. 1308

    ఆమె వారితో, “నన్ను నయోమి అని పిలువకండి, మారా అని పిలువండి, ఎందుకంటే సర్వశక్తుడు నాకు జీవితాన్ని చాలా చేదుగా మార్చారు.

  21. రూతు 1:21సుమారు క్రీ.పూ. 1308

    నేను సమృద్ధి కలదానిగా వెళ్లాను, అయితే యెహోవా నన్ను ఏమి లేనిదానిగా తీసుకువచ్చారు. ఎందుకు నన్ను నయోమి అని పిలుస్తారు? యెహోవా నాకు శ్రమ కలుగజేశారు; సర్వశక్తుడు నాకు బాధ కలిగించారు” అన్నది.

  22. రూతు 1:22సుమారు క్రీ.పూ. 1308

    అలా నయోమి మోయాబీయురాలైన తన కోడలు రూతుతో మోయాబు నుండి యవల కోత ఆరంభంలో బేత్లెహేముకు చేరుకుంది.

  23. రూతు 2:1సుమారు క్రీ.పూ. 1307

    నయోమికి తన భర్త ఎలీమెలెకు వంశం యొక్క బంధువు ఉన్నాడు, అతని పేరు బోయజు.

  24. రూతు 2:2సుమారు క్రీ.పూ. 1307

    మోయాబీయురాలైన రూతు నయోమితో, “నేను పొలాలకు వెళ్లి ఎవరి దృష్టిలో దయ పొందితే అతని వెనుక అతని పొలంలో పరిగె ఏరుకు వస్తాను” అని చెప్పింది. అందుకు నయోమి, “నా కుమారీ, వెళ్లు” అన్నది.

  25. రూతు 2:3సుమారు క్రీ.పూ. 1307

    కాబట్టి ఆమె వెళ్లి, ఒక పొలంలో కోతకోస్తున్న పనివారి వెనుక పరిగె ఏరుకోవడం ప్రారంభించింది. అలా ఆమె పని చేసిన పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుకు చెందినది.